తమన్‌ వల్ల ఇబ్బందిపడుతున్న దేవి.. అతన్ని కొట్టాలంటే ఇదే మంచి ఛాన్స్!

సినిమా ఇండస్ట్రీలో ఒకే క్రాఫ్ట్ కి చెందిన టెక్నీషియన్స్ మధ్య పోటీ ఉండడం సహజమే. అయితే ఈ పోటీ కొన్నిసార్లు కెరీర్ పై చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా థమన్ vs దేవి శ్రీ ప్రసాద్ అనేలా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో కాస్త నిరాశపరిస్తున్నాడనే చెప్పాలి. ఇదే సమయంలో థమన్ తన మ్యూజిక్ తో స్టార్ హీరోలను సైతం ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

Recommended Video

Thaman Vs Devi Sri Prasad : Musical Fight In Tollywood
 తగ్గిన దేవి హవా..

తగ్గిన దేవి హవా..

టీనేజ్ వయసులోనే దేవి శ్రీ ప్రసాద్ కంపోజింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక పాతికేళ్ల వయసులోనే తమిళ్ తెలుగు అని తేడా లేకుండా స్టార్ హీరోలందరితో వర్క్ చేశాడు. ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అంటే జనాల్లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ హవా తగ్గింది అనే కామెంట్స్ వస్తున్నాయి.

 థమన్ కొట్టేస్తున్నాడు..

థమన్ కొట్టేస్తున్నాడు..

ఈ మధ్య కాలంలో థమన్ చాలా వరకు థమన్ తన మ్యూజిక్ స్టైల్ ని మార్చుకున్నాడానే చెప్పాలి. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా మ్యూజిక్ తోనే మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. అల.. వైకుంఠపురములో.. సినిమాతో థమన్ రేంజ్ మరో స్థాయికి వెళ్లిందనే చెప్పాలి. దీంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేస్తున్నాడు.

దేవిపై థమన్ ఎఫెక్ట్..

దేవిపై థమన్ ఎఫెక్ట్..

దేవి శ్రీ ప్రసాద్ చేయాల్సిన కొన్ని సినిమాలు ఈ మధ్య థమన్ వల్ల చాలానే మిస్ అవుతున్నాయి. త్రివిక్రమ్ కూడా దేవిని వదిలేసి థమన్ తోనే ట్యూన్స్ సెట్ చేయించుకుంటున్నాడు. మిగతా దర్శక నిర్మాతలు కూడా చాలా వరకు దేవిని సెకండ్ అప్షన్ గానే అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. రొటీన్ మ్యూజిక్ ఇవ్వడం వల్లే అవకాశాలు తగ్గుతున్నాయి. కొరటాల కూడా అతన్ని తీసేసి మనిశర్మని సెట్ చేసుకోవడం పెద్ద దెబ్బె అని చెప్పాలి.

రెండు ఆయుధాలు..

రెండు ఆయుధాలు..

చిన్న సినిమాలు ఎన్ని ఉన్నా కూడా ఇండస్ట్రీ హిట్ సినిమాకు సంగీతం అందిస్తేనే మళ్ళీ ట్రాక్ లో పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ రెండు ఆయుధాలతో థమన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాడు. పుష్ప సినిమాతో పాటు గబ్బర్ సింగ్ కాంబినేషన్ కి కూడా మరోసారి రాక్ స్టార్ ట్యూన్స్ సెట్ చేస్తున్నాడు. ఈ సినిమాలతోనే స్ట్రాంగ్ హిట్ కొట్టి సెట్టవ్వలని చూస్తున్నాడు దేవి. మరి ఆ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X