twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్, నాగార్జున, చిరంజీవి మల్టీస్టారర్.. ఆ ఒక్క మాటతో మొత్తం క్యాన్సిల్

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు ఈ మధ్యనే మళ్ళీ మొదలయ్యాయి. గత కొన్నేళ్ల వరకు కూడా ఎవరు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకు వచ్చే వారు కాదు. దర్శకులు కూడా రిస్క్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. అయితే ఒకనొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున ముగ్గురు కలిసి సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. కానీ ఒకే ఒక్క మాట కారణంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్ని చాలా ఏళ్ళకు రాఘవేంద్రరావు బయటపెట్టారు.

    వార్ మొదలు కావడంతో..

    వార్ మొదలు కావడంతో..

    ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో స్టార్స్ ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. కృష్ణ, శోభన్ బాబు వరకు కూడా బాగానే కొనసాగింది. అయితే ఆ తరువాత ఫ్యాన్స్ వార్ మొదలు కావడంతో హీరోలలో కూడా వ్యత్యాసం చాలానే పెరిగిపోయింది. అభిమానులకు భయపడి మల్టీస్టారర్ సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది.

    మొహమాటం లేకుండా వెంకీ మల్టీస్టారర్ సినిమాలు

    మొహమాటం లేకుండా వెంకీ మల్టీస్టారర్ సినిమాలు

    ఇక మళ్ళీ చాలా కాలం తరువాత మహేష్ బాబు, వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో మల్టీస్టారర్ సినిమాలకు ఊపొచ్చింది. ఒక విదంగా వెంకటేష్ కు అందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ తో పాటు రామ్, నాగ చైతన్య వంటి యంగ్ హీరోలతో మొహమాటం లేకుండా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

    వెంకీ, నాగ్ , మెగాస్టార్.. మల్టీస్టారర్

    వెంకీ, నాగ్ , మెగాస్టార్.. మల్టీస్టారర్

    అయితే 2002 టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు స్టార్స్ గా వరుస హిట్స్ అందుకుంటూ వెళుతున్నారు. వారి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉండేది. అయితే అలాంటి స్టార్స్ తో సినిమా చేస్తే అద్భుతంగా ఉంటుందని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు డిసైడ్ అయ్యాడట.

    100వ సినిమా అలా ఉండాలని

    100వ సినిమా అలా ఉండాలని

    అందుకు ప్రత్యేకమైన ఒక కారణం కూడా ఉంది. కె.రాఘవేంద్రరావు అప్పటికే 99 సినిమాలు పూర్తి చేయగా 100వ సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉండాలని ముగ్గురు అగ్ర హీరోలను అనుకున్నాడట. అప్పట్లో ఫామ్ లో ఉన్న రైటర్ చిన్ని కృష్ణతో కథను కూడా రెడీ చేయించారు. టైటిల్ త్రివేణి సంగమం అని ఫిక్స్ చేశారు. ఇక అల్లు అరవింద్ - సి.అశ్వినిదత్ తో కలిసి నిర్మాణంలో రాఘవేంద్రరావు కూడా భాగం కావాలని అనుకున్నారు.

    Recommended Video

    Rumours On Narappa Movie Release | Acharya వల్లే..!!
    ఆ మాటతో ప్రాజెక్ట్ క్యాన్సిల్

    ఆ మాటతో ప్రాజెక్ట్ క్యాన్సిల్

    అంతా సెట్టయ్యింది అనుకుంటున్న సమయంలో సి.అశ్వినిదత్ ఒక్క మాట చెప్పడం వలన కె.రాఘవేంద్రరావు ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడట. ఎలా తీసినా కూడా తమ హీరోను ఒక చోట తక్కువ చూపించారు అని ఫ్యాన్స్ లో గొడవలు అవుతాయి. మనకు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ అశ్విన్ దత్ చెప్పడంతో దర్శకేంద్రుడు వెనక్కి తగ్గి సింపుల్ గా గంగోత్రి సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చాడు. ఈ విషయాన్ని సౌందర్య లహరి ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు మొదటిసారి బయటకు చెప్పాడు.

    English summary
    At one point, megastar Chiranjeevi, Victory Venkatesh and King Nagarjuna agreed to do a film together. But the project was canceled due to a single word. This matter was revealed by Raghavendra Rao in a interview
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X