మాల్దీవులలోనే హాట్ హీరోయిన్స్ రచ్చ.. పైసా ఖర్చు లేదు.. అందుకే వెళుతున్నారా?

నిత్యం సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే సినీ తారలు కాస్త గ్యాప్ దొరికినా కూడా హాలిడేస్ అంటూ విదేశాలకు వెళ్లిపోతారు. లోకల్ గా అయితే ఏకాంతంగా తిరగడం కుదరదని జనాలు ఎక్కువగా లేని హాలిడే స్పాట్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ అందరు కూడా ఒక స్పెషల్ హాలిడే స్పాట్ ను టార్గెట్ గా సెట్ చేసుకొని వెళుతున్నారు. అదే మాల్దీవ్స్. అయితే దాని వెనుక ఒక రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరంతా పైసా ఖర్చు లేకుండా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైరల్ అవుతున్న అనుమానాలు

వైరల్ అవుతున్న అనుమానాలు

సౌత్ ఏషియాలోని అత్యంత విలాసవంతమైన మాల్దీవ్స్ లొకేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా ఒకేసారి స్టార్స్ అందరూ ఆ హాలిడే స్పాట్ లో దర్శనమిస్తుండడంతో కొత్త అనుమానలైతే పూట్టుకొస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా మాల్దీవ్స్ కి గత ఆరు నెలలుగా ఆదాయం లేదు. అందుకే అక్కడి గవర్నమెంట్ ఒక స్పెషల్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

తాప్సి స్టార్ట్ చేయడంతో..

తాప్సి స్టార్ట్ చేయడంతో..

మొదట తాప్సి బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆ ప్రదేశాలకు వెళ్లింది. కొన్నిరోజులు పాటు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసింది. ప్రియుడు మాతియాస్‌తో కలిసితో స్కూబా డౌవ్ కూడా చేసింది. ఇక కెమెరాకు ఫోజిచ్చిన చిత్రాలను తమ ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఆమె తరువాత ఇక వరుసగా మరికొందరు మాల్దీవ్స్ బాట పట్టారు.

బికినీలో షాక్ ఇచ్చిన రకుల్

బికినీలో షాక్ ఇచ్చిన రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇటీవల మాల్దీవ్స్ బీచ్ లలో దర్శనమిచ్చింది. చాలా రోజుల తరువాత హాట్ హాట్ గా బికినీలో కనిపించి ఆడియేన్స్ కి షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతున్నాయి. అలాగే మరో గ్లామరస్ హీరోయిన్ శాన్వి కూడా మాల్దీవ్స్ కు వెళ్లింది.

హాట్ బ్యూటీ దిశా పటాని..

హాట్ బ్యూటీ దిశా పటాని..

బాలీవుడ్ హీరోయిన్స్ లలో హాలిడేస్ ను ఎక్కువగా ఎంజాయ్ చేసే బ్యూటీలలో దిశా పటాని ఒకరు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా అమ్మడు సముద్ర తీరాలకు చేరుకుంటుంది. బీచ్ లో బికినీలో తిరగడమంటే అమ్మడికి చాలా ఇష్టమట. ఇక బికినీ వేసిన ప్రతిసారీ సోషల్ మీడియాలో అభిమానులకు ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు.

సమంత.. కాజల్ కూడా

సమంత.. కాజల్ కూడా

ఇక సమంత అక్కినేని కూడా చాలా రోజుల తరువాత హాలిడేస్ ని ఎంజాయ్ చేయడానికి వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఆమెతో పాటు కాజల్ అగర్వాల్ ఇటీవల హనీమూన్ ని మాల్దీవ్స్ లోనే ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే స్టార్స్ అందరికీ ఒక బంపర్ ఆఫర్ రావడం వల్లనే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

అక్కడికి ఎందుకు వెళుతున్నారంటే..

అక్కడికి ఎందుకు వెళుతున్నారంటే..

గతంలో సీజన్స్ తో సంబంధం లేకుండా మాల్దీవ్స్ బీచ్ లు జనాలతో సందడిగా కనిపించేవి. ఎప్పుడైతే కరోనా దెబ్బ కొట్టిందో అప్పటి నుంచి ఆదాయం లేక అక్కడి గవర్నమెంట్ బాగానే నష్టపోయింది. ఇక అందుకే సెలబ్రెటీలకు కొందరికి ఉచితంగా ఎంజాయ్ చేసే ఆఫర్ ఇప్పిస్తున్నట్లు టాక్. సెలబ్రెటీలను రప్పించి మాల్దీవ్స్ గవర్నమెంట్ ప్రమోషన్స్ చేస్తున్నట్లు టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.

Recommended Video

Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
సెలబ్రెటీల వల్ల వైరల్ అవుతున్న మాల్దీవ్స్

సెలబ్రెటీల వల్ల వైరల్ అవుతున్న మాల్దీవ్స్

కొందరికి తక్కువ ఖర్చుతో ఆఫర్స్ ఇస్తున్నార. మరికొందరికేమో ప్రమోషన్స్ లో భాగంగా పూర్తిగా ఉచితంగా టూర్ ని ఎంజాయ్ చేసే ఆఫర్ ఇచ్చినట్లు టాక్. ఏదేమైనా గత నెల రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా మాల్దీవ్స్ పేరు గట్టిగానే ట్రెండ్ అవుతోంది. ఇక ట్రావెలింగ్ ఎజెంట్స్ కూడా అద్భుతమైన ఆఫర్స్ తో కస్టమర్స్ బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఈ ఆఫర్స్ ని ఇంకా ఎంతమంది స్టార్ హీరోయిన్స్ వాడుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X