CCL 2024 రోమాలు నిక్కబొడిచే మ్యాచ్‌లో.. ముంబైని మట్టి కరిపించిన బెంగాల్ .. ఫైనల్‌కు చేరిన టైగర్స్!
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 (CCL 2024) టోర్నమెంట్‌లో భాగంగా త్రివేండ్రంలోని కేరళలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై హీరోస్ జట్టును బెంగాల్ టైగర్స్ జట్టు మట్టికరిపించింది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఓటమి పాలైన బెంగాల్ జట్టు మరోసారి ఆల్ రౌండ్ ప్రతిభను చూపి ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకొన్నది. ఈ మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగాల్ టైగర్స్ మొదట బ్యాటింగ్‌తో
మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగాల్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 10 ఓవర్లలో ఈ జట్టు 3 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. బెంగాల్ జట్టులో అత్యధికంగా జామీ 65 పరుగులు చేయడంతో జట్టు భారీ స్కోరును చేసింది. కేవలం 30 బంతుల్లో 65 పరుగులు చేయడం మ్యాచ్‌లో హైలెట్‌గా నిలచింది. ముంబై జట్టులో ఫ్రెడ్డీ 1 వికెట్ పడగొట్టాడు.

ముంబై హీరోస్ ధీటుగానే
ఇక భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై హీరోస్ జట్టు ధీటుగానే సమాధానం ఇచ్చింది. ఓ దశలో వికెట్లు టపటపా పడటంతో పరుగుల వేగం మందగించింది. దాంతో ముంబై జట్టు 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. దాంతో 17 పరుగులు వెనుకబడింది. ముంబై జట్టులో షబ్బీర్ 15 బంతుల్లో 35 పరుగులు చేయగా.. రతన్‌దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.

పేలవంగా బెంగాల్ బ్యాటింగ్
17 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన బెంగాల్ టైగర్స్ జట్టు..పేలవమైన ఆటను ప్రదర్శించింది. బిగ్ టార్గెట్ పెట్టాలనే ఆత్రంతో, పరుగులు వేగం పంచే క్రమంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. దాంతో 98 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై జట్టు ముందుంచింది.

పరుగుల వేటలో ముంబై విఫలం
సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ చేపట్టిన ముంబై జట్టు.. పరుగులు సాధించడానికి తంటాలు పడింది. బెంగాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పెరిగింది. దాంతో భారీ షాట్లకు ప్రయత్నించడం, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అద్బుతమైన క్యాచ్‌లు పట్టడంతో జట్టు చతికిలపడింది.
చివరి 2 ఓవర్లలో
చివరి 12 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన సమయంలో షబ్బీర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద బెంగాల్ ఆటగాడు అద్బుతమైన క్యాచ్ పట్టడంతో దాదాపు ముంబై ఓటమి ఖరారైంది. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది 7 బంతికి సిక్సర్ సాధించడంతో ఆశలు చిగురించాయి. అయితే చివరి ఓవర్‌లో అంటే 6 బంతుల్లో 23 పరుగుల చేయాల్సి వచ్చింది.

చివరి ఓవర్‌లో హై డ్రామా
చివరి ఓవర్‌లో నాటకీయత చోటు చేసుకొన్నది. తొలి బంతికి బౌండరీ సాధించడంతో గెలుస్తుందా అనే అనుమానం కలిగింది. రెండో బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది. మూడో బంతికి రెండు పరుగులు లభించాయి. నాలుగో బంతిని ముంబై ఆటగాడు బౌండరీకి తరలించారు. దాంతో 2 బంతుల్లో 12 పరుగుల చేయాల్సి వచ్చింది. ఐదో బంతి బ్యాట్స్ హిట్ చేయడానికి ప్రయత్ని విఫలం కావడంతో బాల్ కీపర్ చేతిలో పడింది. దాంతో విజయం బెంగాల్ జట్టువైపు మొగ్గింది. చివరి బంతికి సింగిల్ రావడంతో బెంగాల్ టైగర్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











