CCL 2024 Final బెంగాల్ టైగర్స్ సంచలన విజయం.. చేజేతులా కర్ణాటక బుల్లోజర్స్ ఓటమి!

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 టోర్నీలో భాగంగా కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టుపై బెంగాల్ జట్టు భారీ విజయం సాధించింది. తొలిసారి ఫైనల్‌కు చేరిన బెంగాల్.. రెండుసార్లు కప్ గెలిచిన కర్నాటకను మట్టికరిపించింది. 138 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక జట్టు విజయలక్ష్యం ముందు బోల్తా పడటంతో బెంగాల్ జట్టు ట్రోఫిని ఎగురేసుకుపోయింది. ఈ మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే..

టాస్ గెలిచి బ్యాటింగ్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న బెంగాల్ టైగర్ జట్టు కెప్టెన్ జిషు సేన్‌గుప్తా బ్యాటింగ్ ఎంచుకొన్నారు. అయితే తొలి ఓవర్‌లో జట్టు ఓపెనర్ అవుట్ కావడంతో ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత రత్నదీప్ క్లీన్ బోల్డ్ కావడంతో జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే జామీ బాధ్యతాయుతంగా ఆడటంతో జట్టు భారీ స్కోర్ చేసింది. జామీ 29 బంతుల్లో 57 పరుగులు, రాహుల్ 9 బంతుల్లో 29 పరుగులు చేశారు. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. కర్ణాటక జట్టులో కార్తీక్ 2 వికెట్లు, చందన్ 1 వికెట్ పడగొట్టారు.

CCL 2024 Final

తొలి ఇన్నింగ్స్‌లో అధిక్యం
ఆ తర్వాత కర్ణాటక జట్టు తొలి ఇన్సింగ్ ఆరంభించింది. అయితే కర్ణాటక జట్టు పరుగులు సాధించే క్రమంలో వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో 86 పరుగులు చేసింది. ప్రదీప్ 23 బంతుల్లో 32 పరుగులు, కార్తీక్ 19 బంతుల్లో 31 పరుగులు చేశారు. బెంగాల్ జట్టు ఆనంద్ 3 వికెట్లు, రత్నదీప్ 1 వికెట్ పడగొట్టారు. దాంతో బెంగాల్ టైగర్స్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారీ అధిక్యం లభించటంతో రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. నిర్ణీత 10 ఓవర్లలో 102 పరుగులు చేసింది. దాంతో కర్ణాటక జట్టు ముందు 138 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. జామీ అత్యధికంగా పరుగులు చేయడం విశేషం.

CCL 2024 Final

కష్టాల్లో పడిన కర్ణాటక
138 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక జట్టు సుడిగాలిలా ఇన్నింగ్స్ ప్రారంభించింది. 2 ఓవర్లు ముగిసే సమయానికి ఓపెనర్లు 24 పరుగులు చేశారు. ఇక మూడో ఓవర్ ముగిసే సమయానికి 46 పరుగులు చేశారు. కరణ్ భారీ సిక్సర్లు సాధించడంతో స్కోరు పరుగులు పెట్టింది. అయితే ఆనంద విసిరిన నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచే ప్రయత్నంలో బౌండరీ వద్ద క్యాచ్ పట్టడంతో కర్ణాటక జట్టు తొలి వికెట్ పడింది. అయితే కేవలం 20 పరుగుల తేడాతో కార్తీక్, ప్రతాప్ కూడా అవుట్ కావడంతో 6 ఓవర్లలో 66 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

CCL 2024 Final

కర్ణాటక బుల్డోజర్స్ సుడిగాలి ఇన్నింగ్స్
ఆ తర్వాత 30 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో 6 ఓవర్‌లో వరుసగా రెండు బంతుల్లో రాజీవ్ రెండు సిక్సర్లు బాదడటంతో 28 బంతుల్లో 59 పరుగులు లక్ష్యం ముందు నిలిచింది. ఆ తర్వాత బంతి వైడ్ కావడం, 4 పరుగుల బై రూపంలో రావడంతో టార్గెట్ 54 పరుగులకు కుదించబడింది. ఆ తర్వాత బంతికి మరో వైడ్ వచ్చింది. ఆ తర్వాత బంతికి 4 పరుగుల వచ్చాయి. కేవలం మూడు బుంతుల్లో 22 పరుగులు వచ్చాయి. 4 బంతికి రాజీవ్ మరో సిక్సర్ బాదడంతో టార్గెట్ మరింత సులభమైంది.

6వ ఓవర్‌లో 30 పరుగులు
చివరకు 6వ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన రాజీవ్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. 7వ ఓవర్‌లో రాహుల్ బౌలింగ్‌లో ప్రదీప్ క్లీన్ బౌల్డ్ కావడంతో ఆట మలుపు తిరిగింది. కర్ణాటక బుల్డోజర్స్ జట్టు 18 బంతుల్లో 36 పరుగులు విజయలక్ష్యంగా మారింది. దాంతో 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.

CCL 2024 Final

8 ఓవర్‌ ఇలా..
కర్ణాటక బుల్డోజర్స్ జట్టు 18 బంతుల్లో 36 పరుగులు విజయలక్ష్యంగా మారింది. 8వ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. దాంతో విజయలక్ష్యం 12 బంతుల్లో 26 పరుగులుగా మారింది. 8 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కర్ణాటక 112 పరుగులు చేసింది.

Bengal Tigers Win

9వ ఓవర్‌లో
తొలి బంతి వైడ్ రావడంతో ఒక్క పరుగు వచ్చింది. ఆ తర్వాత బంతి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి 1 పరుగులు, మూడో బంతికి 1 పరుగు, నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి 1 పరుగు లభించింది. ఆరో బంతికి 1 పరుగు లభించడంతో చివరి ఓవర్‌లో గెలుపు కోసం కర్ణాటక జట్టు 23 పరుగులు చేయాల్సి వచ్చింది.

Bengal Tigers

చివరి ఓవర్‌లో
జామీ బెనర్జీ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతికి డార్లింగ్ కృష్ణ బౌండరీ సాధించాడు. ఆ తర్వాత బంతికి వైడ్ వేశాడు. రెండో బంతికి పరుగులేమి రాకపోవడంతో చివరి నాలుగు బంతుల్లో 18 పరుగులు చేయాల్సి వచ్చింది. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి జామీ విసిరిన బంతికి లాంగ్ ఆన్‌లో డార్లింగ్ కృష్ణ క్యాచ్ అవుట్ అయ్యాడు. డార్లింగ్ కృష్ణ 15 బంతుల్లో 17 పరుగులు చేసి పెవిలియన్‌కు వచ్చాడు. చందన్ బ్యాటింగ్‌కు దిగి బౌండరీ సాధించాడు. దాంతో చివరి బంతికి 11 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి బంతికి సింగిల్ రావడంతో బెంగాల్ టైగర్స్ విజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X