twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుకుమార్ డిజాస్టర్ కొట్టగానే కారులో తిప్పిన రాజమౌళి.. 10నిమిషాల్లో.. శత్రువు నుంచి స్నేహం వరకు

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీ నిజంగా చాలా అదృష్టం చేసుకొని ఉంటుంది. మాయాబజార్ తెరకెక్కించిన కేవి రెడ్డి నుంచి బాహుబలి తీసిన రాజమౌళి వరకు అందరూ కూడా చిత్ర పరిశ్రమను ఎప్పటికప్పుడు మరో స్థాయికి తీసుకువెళుతున్నారు. ఇక అలాంటి విభిన్నమైన ట్రెండ్ సెట్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. అయితే ఈ అగ్ర దర్శకుల మధ్య స్నేహం ఎలా ఉంటుందనేది జనాలకు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఇక రాజమౌళి మొదట సుకుమార్ ను అసూయతో శత్రువులాగా కూడా చూశాడట. ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ ఎదురుగానే ఆ విషయాన్ని చెప్పారు. ఆ స్టోరీలోకి వెళితే..

    సుకుమార్ మేకింగ్ చూసి.. అసూయ పడ్డారు

    సుకుమార్ మేకింగ్ చూసి.. అసూయ పడ్డారు

    సుకుమార్ ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. దిల్ సినిమాకు సహాయక దర్శకుడిగా వర్క్ చేసినప్పుడే నిర్మాత రాజుకు ఆర్య కథ చెప్పి ఒప్పించాడు. అయితే ఆ సినిమా సక్సెస్ అనంతరం సుకుమార్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలామంది దర్శకులు ఒక విధంగా అసూయ పడ్డారట.

    వీడు ఎవడో గాని మనకు పోటీగా వచ్చేశాడు

    వీడు ఎవడో గాని మనకు పోటీగా వచ్చేశాడు

    అసూయ పడిన వారిలో దర్శకధీరుడు రాజమౌళి కూడా ఉన్నాడు. అప్పటి వరకు రాజమౌళి రెండే సినిమాలు చేశాడు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి సినిమాలతో కమర్షియల్ గా క్రేజ్ అందుకున్న రాజమౌళి సుకుమార్ ను చూసి వీడు ఎవడో గాని మనకు పోటీగా వచ్చేశాడు అని అనుకున్నాడట. ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఓపెన్ గా చెప్పేశాడు.

    వీడిని ఫ్రెండ్ గా చేసుకుంటే

    వీడిని ఫ్రెండ్ గా చేసుకుంటే

    అయితే సుకుమార్ ను రెండు విధాలుగా చూడాలి. ఒకటి అతన్ని శత్రువుగా చూసి నిరంతరం అసహ్యించుకోవాలి. రెండోది వీడిని ఫ్రెండ్ గా చేసుకుంటే మనసు ప్రశాంతగా ఉంటుంది.. అని చెప్పిన జక్కన్న సుకుమార్ తో ఫ్రెండ్షిప్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. అయితే సుకుమార్ తొందరపాటులో చేసిన మిస్టేక్ డిజాస్టర్ కావడంతో ఆ సమయంలో జక్కన్న మాత్రమే సపోర్ట్ గా ఉన్నాడట.

    సజెస్ట్ చేసినప్పటికీ సుక్కు పట్టించుకోలేదు

    సజెస్ట్ చేసినప్పటికీ సుక్కు పట్టించుకోలేదు

    ఆర్య తరువాత మూడేళ్ళ పాటు కష్టపడి రాసిన జగడం సినిమాతో మళ్ళీ అల్లు అర్జున్ తోనే కసిగా హిట్ కొట్టాలని సుకుమార్ పక్కా ప్లాన్ చేసుకున్నాడు. అయితే కథలో కొన్ని లోపాలు ఉన్నాయని దిల్ రాజు సజెస్ట్ చేసినప్పటికీ సుక్కు పట్టించుకోలేదు. అల్లు అర్జున్ కూడా అదే అన్నాడు. కానీ వారి మాటలు వినిపించుకోకుండా రామ్ తో సినిమా చేశాడు.

    రాజమౌళి ఒక్కరే నా వైవు

    రాజమౌళి ఒక్కరే నా వైవు

    జగడం రిలీజ్ అనంతరం డిజాస్టర్ టాక్ అందుకోవడంతో సుకుమార్ చాలా నిరుత్సాహపడ్డాడు. ఆ సమయంలో రాజమౌళి అతన్ని కారులో తీసుకెళ్లి పది నిమిషాల పాటు సినిమా గురించి మాట్లాడరట. ఈ విషయాన్ని సుకుమార్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. నా ప్లాప్స్ వచ్చినప్పుడు ప్రపంచ మొత్తం ఒకవైపు ఉంటే రాజమౌళి ఒక్కరే నా వైవు ఉన్నట్లు చెప్పారు.

    Recommended Video

    Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
    రాజమౌళి - సుకుమార్ స్నేహం

    రాజమౌళి - సుకుమార్ స్నేహం

    సినిమా చాలా డిఫరెంట్ గా ఉంది. కానీ నువ్వు ఇంకా బాగా తియ్యగలవు. నువ్వు అనుకున్నట్లు తీస్తే సినిమా మామూలుగా ఉండదని చాలా సందర్భాల్లో రాజమౌళి సుకుమార్ కు సలహా ఇచ్చాడట. ఆ విధంగా రాజమౌళి - సుకుమార్ ఒక మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక ఫ్యామిలీ లో ఎలాంటి ఈవెంట్స్ జరిగినా కూడా ఒకరికొకరు ఇన్విటేషన్స్ పంపించుకోవడం కామన్. నిజంగా హీరోలు కూడా ఇలా ఉంటే అభిమానుల్లో ఓ మంచి వాతావరణం క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు.

    English summary
    It would be very interesting for the public to know how friendship can be between top directors. Rajamouli at first saw Sukumar as an envious enemy. In an interview, Sukumar said the opposite. Going into that story ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X