సంక్రాంతి స్పెషల్.. సుహాసిని-భానుచందర్‌లతో భారీ ప్లాన్

పండుగలు వస్తున్నాయంటే స్పెషల్ ఈవెంట్లు, స్పెషల్ సాంగ్‌లు క్రియేట్ చేయడమే ఇప్పుడు నడుస్తోన్న ట్రెండ్. అందులో భాగంగా ప్రతీ ఒక్కరూ తమ తమ యూట్యూబ్ చానెల్స్‌లో ప్రతీ పండుగకు ఓ స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. వాటికి కూడా ఈ మధ్య భారీ బడ్జెట్‌ను కేటాయిస్తు పెద్ద పెద్ద సెలెబ్రిటీలను తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా దసరా పండుగకు తెలంగాణ పాటలు ఎంతగా మార్మోగుతుంటాయో అందరికీ తెలిసిందే.

అయితే ఈ సంక్రాతికి కూడా అలా పాటలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే అన్ని పాటల్లోకెల్లా ఓ పాట మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నాటి సూపర్ హిట్ జంట భాను చందర్ సుహాసినిలను మళ్లీ ఇలా సంక్రాంతి పాటతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొత్తానికి ఈ పాట బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. మామూలుగా ఇలాంటి స్పెషల్ పాటలను కాసర్ల శ్యామ్ రాస్తుంటారు. భాను చందర్ సుహాసిన నటించిన ఈ పాటను కూడా ఆయనే రచించగా భోలో షావలి, అంజనా సౌమ్య వంటి వారు ఆలపించారు.

 Bhanu chander And Suhasini For Sankranti Special Song

అయితే ఈ పాటను మాత్రం క్రేజీ అంకుల్ యూనిట్‌తో రిలీజ్ చేయించారు. ఆ సినిమాలో మెయిన్ లీడ్ చేసిన సింగర్ మనో, శ్రీముఖి, రాజా రవీంద్ర చేతుల మీదగా ఈ పాటను ఆవిష్కరించారు.శ్రేయాస్ మీడియా యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ పాట విడదలై ,నెటిజెన్స్‌ను కట్టిపడేస్తోంది. మొత్తంగా ఈ సంక్రాంతికి మాత్రం పాటల సందడి ఎక్కువగానే ఉండేట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X