ఇండియన్ 2 డిజాస్టార్.. టెన్షన్‌లో నిర్మాతలు.. మరీ ఆ సీక్వెల్స్ పరిస్థితేంటీ?
Tollywood Sequel Movies: టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. హిట్ అయినా.. ప్రతీ సినిమాకు సీక్వెల్ ఫ్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. వాస్తవానికి ఈ ట్రెండ్ పాతదేయినా.. మోస్ట్ సక్సెస్ పుల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో మళ్లీ ప్రారంభమైందని చెప్పాలి. బహుబలి 2 అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడంతో ఈ సీక్వెల్స్ పర్వం మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ట్రెండ్ మరింత జోరందుకుంది. అలాగే.. అలాగే.. డీజే టిల్లు, హిట్ 2.. కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలు హిట్ కావడంతో సౌత్ లో మూవీ మేకర్స్ కి సీక్వెల్ పై కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది.
కానీ, బాక్సాఫీస్ రికార్డ్ చూస్తుంటే.. సౌత్ లో సీక్వెల్ మూవీ విషయంలో మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన కామెడీ ఎంటర్టైన్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'శంకర్ దాదా జిందాబాద్' సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అలాగే మాస్ మహారాజ రవితేజ 'కిక్' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కిక్ 2 సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాగే.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లవ్ స్టోరీ 'ఆర్య' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'ఆర్య 2' కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

అలాగే కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సీక్వెల్ గా వచ్చిన మన్మథుడు 2 కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇక ఇటీవల సౌత్ ఇండియా సక్సెస్ పుల్ డైరెక్టర్ శంకర్- కమల్ హాసన్ కాంబో వచ్చిన ' భారతీయుడు 2' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై, థియేటర్లలో ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలా సీక్వెల్ విషయంలో సక్సెస్ పుల్ డైరెక్టర్ కే డిజాస్టర్ ఎదురుకావడంతో సీక్వెల్స్ అంటేనే కాస్త వణుకు మొదలయింది.

పుష్ప 2 :
టాలీవుడ్ త్వరలో విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ సీక్వెల్ మూవీ, పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2' ది రూల్. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడిన ఈ సినిమా డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందట.

సలార్ 2 :
భారీ బడ్జెట్ సీక్వెల్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా సలార్ 2. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే.. సలార్ 2 మూవీ శౌర్యంగపర్వం పేరుతో రానున్నదట. అయితే.. ఈ మూవీ విడుదల అనుకున్న సమయం కంటే.. లేట్ గా రానున్నది. ఎప్పుడు రిలీజ్ అయినా ఈ మూవీ మాత్రం ప్రభాస్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ కూడా అందుకు తగ్గట్టుగా శ్రమిస్తున్నారట.

గూఢచారి 2 :
ఆరేండ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా అడివి శేష్ హీరోగా తెరకిక్కిన స్పై థ్రిల్లర్ మూవీ 'గూఢచారి'. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 వస్తుంది. కొత్త ఎక్స్పీరియన్స్ గా వచ్చిన మూవీలో అడివిశేష్ నటన అద్బుతం. ఈ మూవీ కూడా తెలుగు ప్రేక్షకులు సరికొత్త ఫీల్ ను అందించింది. ఈ స్పై థ్రిల్లర్ మూవీని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ప్రకటించారు. మరో వైపు హిట్ 3 రానున్నది. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండవ భాగంలో అడివి శేష్ నటించిన ఈ సీక్వెల్ లో మూడవ పార్ట్ లో మాత్రం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారు.

జై హనుమాన్ :
తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ కాంబోలో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మూవీ 'హనుమాన్' (Hanuman).ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో తెలిసిందే. కేవలం రూ.40 కోట్ల బడ్డెట్‌తో నిర్మితమైన విజువల్స్, గ్రాఫిక్స్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ.350 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా జై హనుమాన్ (Jai Hanuman)రాబోతున్నట్లు ప్రకటించింది.
ఏదిఏమైనా.. ప్రేక్షకులు కథలో, కథనంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగాణంతో తెరకెక్కించమని కాకుండా.. సగటు ఆడియన్స్ హార్ట్ కు టచ్ అయ్యేలా ఉందా? లేదా? అనేది మ్యాటర్.. ఏ స్టోరీ అయితే.. ప్రేక్షకుడి మనస్సుకు టచ్ అయ్యేలా ఆ సినిమా సూపర్ డూపర్ హిటే.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షమే.


Click it and Unblock the Notifications











