CCL 2026: సిక్సర్లతో పంజాబ్ విధ్వంసం... చిత్తుగా ఓడిపోయిన భోజ్‌పురి దబాంగ్స్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో జరిగిన మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌ను పంజాబ్ దే షేర్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడించింది. దబాంగ్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం 11.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ ప్లేయర్స్ ఫోర్లు, సిక్సర్లతో గ్రౌండ్‌ను హోరెత్తించారు. ఈ నేపథ్యంలో భోజ్‌పురి దబాంగ్స్ ఎందుకు ఓడిపోయింది? ఎక్కడ తప్పు చేసింది? పంజాబ్ విజయానికి కారణాలు ఏంటీ? అనేది పరిశీలిస్తే..

Bhojpuri Dabanggs lost the match to Punjab De Sher in CCL 2026 at Coimbatore

తొలుత టాస్ గెలిచిన భోజ్‌పురి దబాంగ్స్ కెప్టెన్ మనోజ్ తివారీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన వెంటనే భోజ్‌పురి జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ టైగర్ 7 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ మనోజ్, ఆదిత్యలు కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ దశలో మనోజ్ తివారీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కాసేపటికే జెస్సీ బౌలింగ్‌లో మనోజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో దబాంగ్స్ స్కోర్ బోర్డ్ వేగం మందగించింది. అయితే ఆదిత్య, అస్గర్ ఖాన్‌లు ధాటిగా ఆడారు.

చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారీ 52, టైగర్ 7, ఆదిత్య 63 , అన్షుమన్ 15, అస్గర్‌ 23 నాటౌట్ చేశారు. పంజాబ్ బౌలర్లలో జెస్సీ, దక్ష్ సింగ్, హర్డీ సంధూ, అనూజ్‌లు తలో వికెట్ పడగొట్టారు. 172 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ దే షేర్ ఆది నుంచి ధాటిగా ఆడింది. అయితే మొదట్లోనే ఆ జట్టుకు షాక్ తగిలింది. ఓపెనర్ బబ్బాల్ ఔట్ అయ్యాడు. అయితే ఈ ఆనందాన్ని పంజాబ్ జట్టు ఏమాత్రం మిగల్చలేదు.

ఆ జట్టు ఆటగాడు నింజా సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 4వ ఓవర్‌లో మూడు ఫోర్లు, సిక్సర్, రెండు పరుగులతో కలిపి 20 పరుగులు రాబట్టాడు. అతనిని చూసి కరణ్ వాహి కూడా రెచ్చిపోయాడు. మనోజ్ తివారి వేసిన ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో కలిపి ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఈ దశలో నింజా కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి దూకుడుతో పంజాబ్ అలవోకగా 100 పరుగుల మార్క్ చేరుకుంది. అప్పటికే భోజ్‌పురి దబాంగ్స్ తన విజయంపై ఆశలు వదిలేసుకుంది. ఆ తర్వాత విక్రాంత్ బౌలింగ్‌లో నింజా ఔట్ అయ్యాడు. అప్పటికి పంజాబ్ విజయానికి 75 బంతుల్లో 66 పరుగులు చేయాల్సి ఉంది. చివరిలో కరణ్, హార్డీలు ఔట్ అయినప్పటికీ అనూజ్, రాహుల్‌లు జట్టును విజయ తీరాలకు చేర్చారు.

పంజాబ్ దే షేర్ బ్యాట్స్‌మెన్‌లలో బబ్బాల్ 5, నింజా 57, కరణ్ 73, హార్డీ 14, అనూజ్ 6 (నాటౌట్), రాహుల్ 11 (నాటౌట్) పరుగులతో నిలిచారు. మొత్తంగా 11.1 ఓవర్లలో పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మరో 53 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయం సాధించడం గమనార్హం. భోజ్‌పురి దబాంగ్స్ జట్టు బౌలర్లలో మనోజ్, విక్రాంత్, రాజీవ్, మన్మోహన్‌లు తలో వికెట్ పడగొట్టారు. మూడు మ్యాచ్‌లలో రెండేసి ఓటములతో ప్రస్తుతం పంజాబ్ దే షేర్, తెలుగు వారియర్స్ జట్లు నిలిచాయి. అయితే ఇవాళ్టీ మ్యాచ్‌లో తక్కువ బంతుల్లోనే పంజాబ్ విజయం సాధించడంతో తెలుగు వారియర్స్ కంటే మెరుగైన రన్‌రేట్‌ను సాధించింది. అటు భోజ్‌పురి దబాంగ్స్‌ జట్టు రెండు మ్యాచ్‌లలో ఒక గెలుపు, ఒక విజయంతో తన సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X