twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ ఫోటోతో దడ పుట్టించిన దివి.. అలా మొత్తం ఓపెన్ చేసేసిన సొట్టబుగ్గల సుందరి

    |

    బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ద్వారా ఫేమస్ అయిన కంటెస్టెంట్లు చాలా తక్కువ. అసలే ఈ నాల్గో సీజన్‌లో అంతగా ప్రాచుర్యం పొందని, ఎవ్వరికీ తెలియని కంటెస్టెంట్లను తీసుకొచ్చారని అందరూ పెదవి విరిచారు. అందులో దివి కూడా ఒక కంటెస్టెంట్. మొదటగా దివి ఎంట్రీ ఇచ్చాక.. ఈమె గురించి ఎవ్వరికీ తెలియదు. అసలు ఈమెను బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకున్నారు.. ఈమె నటించిన సినిమాలు ఏంటని అందరూ వెతుకులాట ప్రారంభించారు.

    Recommended Video

    Divi Vadthya Pic Goes Viral In Social Media
    మహర్షి సినిమాలో..

    మహర్షి సినిమాలో..

    మహర్షి సినిమాలో మహేష్ బాబుతో పాటు ఓ రెండు మూడు సీన్లలో కనిపించింది. ఆ విషయం బిగ్ బాస్ షో ద్వారానే తెలిసింది. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఓ యాడ్‌లో దివి నటించింది. ఇలా చిన్నా చితకా వాటిల్లో నటించిన దివికి బిగ్ బాస్ షో విపరీతమైన పాపులార్టీని తీసుకొచ్చింది.

    మొదట్లో అలా..

    మొదట్లో అలా..

    దివి ఇంట్లోకి వచ్చిన రెండు మూడు రోజుల్లో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. మొదటి వారంలోనే నామినేట్ అయిన దివి ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. ఎందుకంటే మొదటి రెండు మూడు రోజులు దివి ఎక్కడా కనిపించలేదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు ఈ కంటెస్టెంట్ ఉందా అని సెటైర్లు కూడా వేశారు.

    ఆ ఎపిసోడ్‌తో..

    ఆ ఎపిసోడ్‌తో..

    మొదటి వారంలో మార్నింగ్ మస్తీ టైంలో దివి మొదటి సారిగా నోరు విప్పింది. ఇంటి సభ్యులందరి గురించి చెప్పమని ఓ టాస్క్ ఇచ్చింది. బయట ఎలా అనుకుంటున్నారో అచ్చం అదే విధంగా ఉన్నది ఉన్నట్టు ప్రతీ కంటెస్టెంట్ గురించి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ ఒక్క ఎపిసోడ్‌తో దివి గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

    సొట్టబుగ్గలు, అందంతో..

    సొట్టబుగ్గలు, అందంతో..

    దివి సొట్ట బుగ్గలు, అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. చీర కడితే దివి అందం వంద రెట్లు పెరుగుతుందని నెటిజన్లు పొగిడేవారు. చివరకు హైపర్ ఆది కూడా అదే మాట అన్నాడు. నల్ల చీర ధరించి నువ్ గురి చూసి కొట్టావ్ కదా అప్పుడు అందరూ నీలో ఖుషి భూమికను చూశారని నడుము అందాల గురించి వివరించాడు.

    తాజాగా రచ్చ..

    తాజాగా రచ్చ..

    దసరా ఎపిసోడ్‌కు స్పెషల్ హోస్ట్‌గా రావడం దివి ఎలిమినేట్ అవ్వడం అంతా మాయలా జరిగిపోయింది. బయటకు వచ్చిన దివి హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో బికినీ ధరించినట్టుంది. కుర్చీలో కూర్చుని అందాలను తెలివిగా కవర్ చేస్తూ.. కాళ్లను మాత్రం పూర్తిగా వదిలేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Bigg Boss 4 Telugu Divi Shocking Pic Goes Viral, Making love with my thoughts..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X