టాలీవుడ్ బడా డైరెక్టర్ బాగోతం బయటపెడతా: నందినీ రాయ్ సంచలన ప్రకటన
హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా అంతగా గుర్తింపును సంపాదించుకోలేకపోయింది హాట్ బ్యూటీ నందినీ రాయ్. కానీ, బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంటర్ అవడం ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ షో తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే చాలా ఆఫర్లను అందుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా నిర్వహించిన సోషల్ మీడియా లైవ్‌లో టాలీవుడ్ బడా డైరెక్టర్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే ఆయన బాగోతం బయటపెడతానంటూ బాంబు పేల్చింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్.? వివరాల్లోకి వెళితే....

మన అమ్మాయే.. మిస్ ఆంధ్రాగా గెలుపొందింది
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన నందినీ రాయ్‌ది హైదరాబాదే. సింధీ కుటుంబానికి చెందిన ఆమె ప్రాథమిక విద్యను ఇక్కడ, ఉన్నత విద్యను విదేశాల్లో పూర్తి చేసింది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్ ఆరంభించి, మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి అవార్డులు దక్కించుకుంది.

వాటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది
పలు అందాల పోటీల్లో విజయం సాధించిన తర్వాత ఎన్నో సంస్థలు నందినీ రాయ్‌తో వ్యాపార ప్రకటనలు చేయించేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించింది. దీంతో ఆమె వ్యాపార ప్రకటనలతో బిజీ అయింది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఈ హాట్ బ్యూటీ ఏకంగా రెండు వందలకు పైగా యాడ్ ఫిల్మ్‌లలో నటించి రికార్డులకెక్కింది.

వాళ్లు పరిచయం చేశారు.. ఇక్కడ మాత్రం ఇలా
పేరుకు తెలుగు రాష్ట్రానికి చెందిన అమ్మాయే అయినప్పటికీ... నందనీ రాయ్‌ని హిందీ చిత్ర పరిశ్రమ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది. ‘ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఆమె... ‘మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు', ‘సిల్లీ ఫెలోస్', ‘శివరంజనీ' తదితర చిత్రాల్లో నటించింది.

కెరీర్ మార్చేసిన షో... రొమాన్స్‌తో పాపులర్
సినిమాలు, యాడ్ ఫిల్మ్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో నందినీ రాయ్‌కు బిగ్ బాస్ తెలుగులో ఆఫర్ వచ్చింది. దీంతో సీజన్ - 2కు కంటెస్టెంట్‌గా వెళ్లింది. బిగ్ బాస్ హౌస్‌లోని అందరితో పోలిస్తే వివాదారహితురాలిగా మెలిగిన ఈ హీరోయిన్.. హీరో తనీష్‌కు హగ్గులు, ముద్దులు ఇస్తూ పాపులర్ అయిపోయింది. దీంతో ఆ తర్వాత చాలా ఆఫర్లు అందుకుంది.

అమ్మాయిలు వెళ్లడం నా కళ్లారా చూశాను
ఇటీవల నందినీ రాయ్ ప్రముఖ యాప్‌తో లైవ్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇందులో భాగంగానే కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడింది. ‘చాలా మంది అమ్మాయిలు ఇష్టంతోనే వెళ్తున్నారు. అలా వెళ్లడం నేను కళ్లారా చూశాను. ప్రతి రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉంది. అలాగే సినిమాల్లోనూ ఉంటుంది' అని ఆమె చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ బడా డైరెక్టర్ బాగోతం బయటపెడతా
ఇదే చిట్ చాట్‌లో నందినీ రాయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు సినిమాల సంబంధ విశేషాలను కూడా వెల్లడించింది. కొన్ని సినిమా ఆఫర్లు వదులుకున్నానని, కొన్నింట్లో తప్పించారని చెప్పుకుంది. అదే సమయంలో టాలీవుడ్‌లో ఓ బడా డైరెక్టర్ గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే ఆయన బాగోతం బయటపెడతానంటూ ప్రకటించింది.
Recommended Video

ఇంతకీ ఎవరా డైరెక్టర్.? అసలు ఏం జరిగింది.?
కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న సమయంలో ‘రీసెంట్‌గా నేను ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సంతకం చేశాను. కానీ, దాని నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దానికి టాలీవుడ్‌లోని బడా డైరెక్టరే కారణం. అతడి గురించి ఇప్పుడు చెప్పను కానీ, త్వరలోనే బాగోతం బయటపెడతా' అని చెప్పింది. దీంతో ఆ డైరెక్టర్ ఎవరు.? అసలు ఏం జరిగింది.? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











