ఐటెమ్ సాంగ్‌లో మోనాల్ గజ్జర్.. సంక్రాంతి అల్లుడితో ఘాటుగా రొమాన్స్
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలతో విశేషంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న మోనాల్ గజ్జర్ రేంజ్ మరో లెవెల్‌కు చేరకొన్నట్టు కనిపిస్తున్నది. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లతో మోనాల్ దూసుకెళ్తున్నారు. టెలివిజన్ షోలు, సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మోనాల్ యువ హీరో కోసం ఐటెం గర్ల్‌గా మారిందనే విషయం క్రేజీగా మారింది. ఆ స్పెషల్ పాటకు సంబంధించిన విషయాలు మీ కోసం...

టాలీవుడ్‌లో మోనాల్ గజ్జర్
2012లో సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మోనాల్ గజ్జర్ ఆ తర్వాత వెన్నెల 11/2, ఒక కాలేజ్ స్టోరి, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దేవదాసి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా పలు తమిళ, గుజరాతీ చిత్రాల్లో భారీ ఆఫర్లు అందుకొన్నది. గుజరాతీ చిత్రాల్లో నటించడంతో టాలీవుడ్‌కు దూరమయ్యారు.

బిగ్‌బాస్‌లో మోనాల్ క్రేజీగా
ఇక బిగ్‌బాస్ తెలుగు 4 షోలో ఎంట్రీ ఇచ్చాక మోనాల్ పేరు మార్మోగింది. బిగ్‌బాస్ హౌస్‌లో దాదాపు 13 వారాలపాటు తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత టాలీవుడ్‌లో బిజీగా మారిపోయారు. పలు ప్రాజెక్టుల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారు.

డాన్సీ ప్లస్ షోలో యాంకర్ ఓంకార్‌తో
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్, డైరెక్టర్ ఓంకార్ నిర్వహించే డాన్సీప్లస్ అనే రియాలిటీ షోలో మెరిసింది. డ్యాన్స్ ఫ్లోర్‌పై వయ్యారంగా స్టెప్పులు వేసింది. Dancee+ షోలో తన అందాలతో ఆకట్టుకొన్నది. వేదికపై వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అల్లుడు అదుర్స్‌లో స్పెషల్ సాంగ్
ఇక బిగ్‌బాస్ తర్వాత తెలుగు సినిమాకు సంబంధించిన భారీ ఆఫర్‌ను మోనాల్ గజ్జర్ అందుకొన్నారు. బెల్లంకొండ్ శ్రీను నటిస్తున్న అల్లుడు అదుర్స్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో ఐటెమ్ గర్ల్‌గా కనిపించబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ ముగింపు దశకు చేరుకొన్నది.

స్పెషల్ సాంగ్ కోసం భారీ రెమ్యునరేషన్
అల్లుడు శ్రీనులో స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు మోనాల్ గజ్జర్‌కు భారీ రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











