6 కోట్ల ఇల్లు ఎందుకు అమ్ముకొన్నానంటే.. అలా ఇండస్ట్రీకి దూరమయ్యా.. ‘అమ్మ’ కష్టాలపై నాగ్ ఎమోషనల్

బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటిలో జరిగిన మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో ఇంటి సభ్యులు తమ జీవితంలో కలిగిన కష్టాలను బిగ్‌బాస్‌కు చెప్పుకొన్నారు. ఇంటికి సంబంధించిన ఈఎంఐని కట్టలేక తాను లాక్‌డౌన్‌లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకొన్నానని జబర్దస్త్ అవినాష్ చెప్పడం అందర్నీ షాక్ గురించి చేసింది. అవినాష్ మాటలు విన్న అమ్మా రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.

జీవితంలో మరోసారి ఇలాంటి పనులు చేయవద్దు అంటూ అవినాష్‌ను హెచ్చరించారు. అయితే తన కష్టాలను గురించి వివరిస్తూ.. నేను ఇష్టంగా 6 కోట్లు పెట్టి కట్టుకొన్న ఇంటిని అమ్మేశాను అంటూ అవినాష్‌కు తన బాధను చెప్పుకొన్నారు. అయితే అమ్మా రాజశేఖర్ తన ఇంటిని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించలేదు. ఆ విషయాన్ని నాగార్జున అడిగితే అమ్మా రాజశేఖర్ చెబుతూ..

అవినాష్ సూసైడ్‌ అటెంప్ట్ గురించి నాగ్

అవినాష్ సూసైడ్‌ అటెంప్ట్ గురించి నాగ్

ఐదోవారం వీకెంట్ షోలో నాగార్జున వేదిక మీద నుంచి మాట్లాడుతూ.. అవినాష్ సూసైడ్ ఎపిసోడ్ గురించి ప్రస్తావించారు. అవినాష్‌కు నీవు చెప్పిన విషయాలు బాగున్నాయి. చాలా మంచి పనిచేశాడు. సూసైడ్ చేసుకోవద్దని చెప్పడం నాకు బాగా నచ్చింది. నీవు మంచి పనిచేశావంటూ అమ్మా రాజశేఖర్‌కు నాగార్జున కితాబుచ్చారు. దాంతో అమ్మా హ్యాపీగా ఫీలయ్యారు. వెంటనే అమ్మా రాజశేఖర్ నీవు ఎందుకు ఇంటిని అమ్మాల్సి వచ్చిందని నాగార్జున అడిగారు.

6 కోట్లు పెట్టి ఇల్లు కట్టాను..

6 కోట్లు పెట్టి ఇల్లు కట్టాను..

హెస్ట్ నాగార్జున ప్రశ్నకు అమ్మా రాజశేఖర్ సమాధానం ఇస్తూ.. 6 కోట్లు పెట్టి చాలా ఇష్టంగా ఇల్లు కట్టుకొన్నాను. ఓ రోజు నా పెంపుడు కుక్క కారణంగా అమ్మ కిందపడటంతో కాలు విరిగింది. నాకు అమ్మంటే చాలా ఇష్టం. కాలు విరగడం వల్ల దాదాపు ఏడాదికిపైగా హాస్పిటల్‌ చుట్టు తిరగాల్సి వచ్చింది. అయితే ఆ ఇంటిలో ఏదో దోషం ఉందని అమ్మా ఫీలైంది. చాలా రోజులు ఆ ఇంట్లో ఉండవద్దని పోరు పెట్టింది అని అమ్మా రాజశేఖర్ చెప్పారు.

అందుకే ఇంటిని అమ్మేశాను

అందుకే ఇంటిని అమ్మేశాను

నా అమ్మ ఆరోగ్యం చూసుకోవడానికి నేను ఏడాదికి పైగా సమయం వెచ్చించాను. ఆ కారణంగానే నాకు, ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను. అమ్మ కోసం అలా నేను నా కెరీర్ వదులుకోవాల్సి వచ్చింది. అయితే అమ్మ కోరిక మేరకు ఇంటిని అమ్మేసి బయటకు వచ్చాం. ఇప్పుడు వేరే ఇంటిలో హ్యాపీగా ఉంటున్నాం అని అమ్మా రాజశేఖర్ చెప్పారు.

అమ్మ సెంటిమెంట్ కోసం

అమ్మ సెంటిమెంట్ కోసం

అమ్మా రాజశేఖర్ తన తల్లి కోసం ఇష్టంగా కట్టుకొన్న ఇంటిని అమ్మడంపై నాగార్జున ఎమోషనల్ అయ్యారు. అమ్మ మాట కోసమే ఇంటిని అమ్మి వేయడం చాలా బాగుంది అని నాగ్ అన్నారు. అవును సార్.. అమ్మంటే నాకు చాలా ఇష్టం. అమ్మ కోసం ఏదైనా చేస్తాను. అమ్మ సెంటిమెంట్‌ను కాదనలేను అని అమ్మా రాజశేఖర్ చెప్పారు. అమ్మ సెంటిమెంట్ కోసం నీవు కఠిన నిర్ణయం తీసుకొని మంచి పనిచేశావు అని నాగ్ అన్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన గంగవ్వ, ఇల్లు కట్టిస్తానన్ననాగార్జున..!!
ఐదోవారం నామినేషన్‌లో అమ్మా రాజశేఖర్

ఐదోవారం నామినేషన్‌లో అమ్మా రాజశేఖర్

ఐదో వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. అమ్మా రాజశేఖర్ నామినేషన్‌లో ఉన్నారు. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్, సోహైల్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. ఇంకా నామినేషన్‌లో ఏడుగురు ఉన్నారు. ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో ఇంటి నుంచి ఎవరు వెళ్తారో అనే విషయం తేలనుంది. ఆదివారం ఎపిసోడ్ మరింత వినోదంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X