బిల్ గేట్స్ మెచ్చిన సినిమా ఏంటో తెలుసా? ఎంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు తమ దగ్గరకు వచ్చిన స్టోరీలను డేట్స్ లేకనో, లేదంటే వర్కౌట్ కాదేమో అనే డౌట్ ఉన్నా కంటెంట్ బాగున్నప్పటికీ వదిలేసుకుంటారు. అలా కొంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన ఓ సినిమా ఏకంగా బిల్ గేట్స్ ను మెప్పించింది. ఆ సినిమా ఏంటి? ఎంతమంది స్టార్స్ ఆ మూవీని రిజెక్ట్ చేశారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సినిమా ఓ బ్లాక్ బస్టర్ హిట్. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ. ఈ మూవీని ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ రిజెక్ట్ చేశారు. పలువురు నటీనటులు నటించడానికి ఇష్టపడకపోవడంతో దాదాపు నాలుగేళ్లు ఆలస్యంగా రిలీజ్ అయ్యింది ఈ మూవీ. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా రికార్డును క్రియేట్ చేసింది.

బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకుంటున్న బాలీవుడ్ బాక్స్ ఆఫీసుకు హిట్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రిలీఫ్ వచ్చేలా చేసింది. ఆ మూవీ పేరే టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ. ఈ మూవీ 2017లో హిందీలో రిలీజ్ అయ్యింది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ మూవీకి మిస్టర్ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, నీరజ్ పాండే కలిసి నిర్మించారు.
అలాగే ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా కూడా నటించారు. భూమి పెడ్నేకర్ లతో పాటు అనుపమ్ ఖేర్, రాజేష్ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో భారతదేశంలోని మరుగుదొడ్ల సమస్యను హైలెట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటికీ ఈ ప్రాథమిక సౌలభ్యం లేకపోవడం అనేది మహిళలను నిరాశ పరుస్తుంది.

అయితే సమాచారం ప్రకారం ఈ మూవీ స్క్రిప్ట్ నాలుగేళ్లు పలువురు స్టార్స్ దగ్గరకు తిరిగింది. అయితే ఎవ్వరూ ఈ మూవీని చేయడానికి ఒప్పుకోలేదు. కానీ అక్షయ్ కుమార్ మాత్రం స్క్రిప్ట్ చదివిన వెంటనే ఆ పాత్రను చేయడానికి అంగీకరించాడు. ఆ తర్వాత మూవీ రిలీజ్ కావడం చరిత్రను సృష్టించడం వంటివి వెంటవెంటనే జరిగిపోయాయి.
ఇక స్టోరీలోకి వెళ్తే.... ఈ మూవీ మధ్యప్రదేశ్ లోని బేతల్ జిల్లాకు చెందిన అనితా బాయి జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఆమె భర్త ఇంట్లో మరుగుదొడ్డి కట్టించకపోవడంతో ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఈ మూవీని 2017లో బిల్ గేట్స్ చూసి మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











