పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.. వందేళ్లు బతకాలన్న మాజీ సీఎం

పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా పవన్ ఓ ఘనతను సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...

అర్ధరాత్రి నుంచే మొదలయ్యాయి

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 48వ పడిలోకి అడుగు పెడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు సంబరాలు చేస్తున్నారు. వాస్తవానికి వారం రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులన్నీ మొదలయ్యాయి. ఇక, ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ కేక్స్ కట్ చేయడం.. సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పడం.. పవన్ డీపీలు, ఫ్లెక్సీలు ఇలా రచ్చ రచ్చ చేసేస్తున్నారు.

మెగా హీరోలు ఇలా...

పవన్ కల్యాన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎంతో మంది సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో మెగా హీరోలు రామ్ చరణ్ ‘హ్యాపీ బర్త్‌డే బాబాయ్. ఫ్రెండ్, మెంటర్, గైడ్‌గా నాతో ఉన్నందుకు థ్యాంక్స్' అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ ‘హ్యాపీ బర్త్‌డే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు' అని ట్వీట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ ‘నా గురువు, మామ, మన పవర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ బర్త్‌డే గురించి ఎంత చెప్పినా తక్కువే. లవ్ యూ సో మచ్' అని పోస్ట్ పెట్టాడు.

మిగిలిన వారిలో...

మిగిలిన వారిలో...

మెగా హీరోలు మాత్రమే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ మారుతి ‘నాయకుడు, వినాయకుడు ఇద్దరి పుట్టినరోజు ఒకేసారి వచ్చింది' అంటూ కేక్ కట్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు. అలాగే, నితిన్ ‘హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్ గారు' అని ట్వీట్ చేశాడు. వీరితో పాటు ఎంతో మంది నటులు, దర్శకులు, నిర్మాతలు ఇతర టెక్నీషియన్లు విషెస్ చెబుతున్నారు.

వందేళ్లు బతకాలన్న మాజీ సీఎం

సినీ పరిశ్రమ నుంచే కాదు.. రాజకీయ పరంగానూ పవన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ‘తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించి, విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తోన్న జనసేన పార్టీ అధినేత @PawanKalyan గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై, సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. అలాగే మాజీ మంత్రి లోకేష్ కూడా విషెస్ తెలియజేశారు.

ట్రెండ్ అవుతున్న పవన్

ట్రెండ్ అవుతున్న పవన్

ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండడంతో ఆయన మరోసారి ట్రెండ్ అవుతున్నారు. ఆయన పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanaKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత #happybirthdaypowerstar మూడో స్థానంలో, #HappyBirthdayJanasenani నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X