HBD Brahmanandam: లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం.. మీమ్ గాడ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

బ్రహ్మానందం... ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన కామెడీతో తెలుగువారిని నవ్వించిన బ్రహ్మి 68వ పడిలోకి అడుగుపెట్టారు. బ్రహ్మానందం తన కామెడీతో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడనడం సందేహం లేదు. సినిమాలో కామెడీ పండించాలంటే ఆయన కచ్చితంగా ఉండాల్సిందే. ఓ దశలో అయితే.. ప్రతి సినిమాలో ఆయనకు ఓ పాత్ర ఉండేది. కానీ వయసు పై పడటంతో ఇపుడు సినిమాల విషయంలో కాస్త స్లో ఆయ్యారు. ఈరోజు బ్రహ్మీ బర్త్ డే సందర్భంగా ఆయన ఆస్తుల గురించి తెలుసుకుందాం.

లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తన కామెడీతో కోట్లాది మందిలో నవ్వులు పూయించాడు. నటిస్తే కాదు.. ఆయన కనిపిస్తేనే నవ్వేవాళ్ళు చాలా మందే ఉన్నారనే విషయం తెలిసిందే. బ్రహ్మానందం ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 35ఏళ్ల ఆయన సినీ కెరీర్ లో దాదాపు 1250 పైగా సినిమాల్లో న‌టించాడు. అయినప్పటికీ కామెడీ రారాజుగా బ్రహ్మానందం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.

Recommended Video

Brahmanandam Assets మీమ్ గాడ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? | Telugu Filmibeat

Birthday Special Story: Brahmanandam Net Worth and Remuneration Details

ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సినిమాలను తగ్గించేశాడు. ఇటీవల బ్రహ్మానందం ఆత్మకథ 'నేను' పేరుతో బుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే.. ఆయన చాలా మందికి ఒక గొప్ప కమెడియన్ గా మాత్రమే ఆయన తెలుసు. ఆయన ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన కమెడియన్ అని చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత రిచెస్ట్ కామెడియన్ గా బ్రహ్మానందం రికార్డ్ చేశాడు.

ఒక కామెడియన్ స్టార్ హీరో రేంజులో సంపాదించ‌గ‌ల‌రా అనే ప్రశ్నకు సమాధానం బ్రహ్మీ. నిన్న మొన్నటి వరకు.. బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ, భారతీ సింగ్ భారతదేశపు అత్యంత సంపన్న కమెడియన్స్ గా ఉండేవారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రినీ దాటేసి బ్రహ్మానందం టాప్ 1లో ఉన్నాడు. ఆయన నెలవారీ సంపాదన రూ. 2 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం. కేవలం సినిమాల వల్లే కాదు.. బ్రాండ్ అండార్స్మెంట్స్ ద్వారా కూడా బాగానే ఆదాయం వస్తుందట.

Birthday Special Story: Brahmanandam Net Worth and Remuneration Details

ఈయన ఒక్కో ఎండార్స్మెంట్ కోసం కోటి నుండి రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో.. ప్రస్తుతం ఆయన మొత్తం నికర ఆస్తుల‌ విలువ సుమారు రూ. 500 కోట్లకు చేరుకుందని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు.. జీవించి ఉన్న న‌టుల్లో అత్యధిక సినిమాల్లో న‌టించిన న‌టుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ కూడా క్రియేట్ చేశాడు బ్రహ్మీ. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పద్మశ్రీ కూడా ఇచ్చింది.

ఒక మాములు కాలేజ్ లెక్చరర్ గా కెరీర్ మొదలుపెట్టిన బ్ర‌హ్మానందం... ఇప్పుడు భారతదేశపు అత్యంత ధనవంతుడైన కమెడియన్ గా రికార్డులు సృష్టించారు. ఇక మీమ్ గాడ్ గా ఆయనకు పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ వంటి మీమర్స్ కు బ్రహ్మానందం ఒక గాడ్. ఇక ఆయన ఇలాంటి ఎన్నోచిత్రాలు.. ఎంతో మందిని నవ్వించాలని కోరుకుంటూ.. తెలుగు ఫిల్మీబీట్ కోరుకుంటుంది. హ్యాపీ బర్త్ డే ది లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X