Samantha To nayan సౌత్ హీరోయిన్స్ పై ఫోకస్ పెట్టిన బాలీవుడ్.. వరుసగా హిందీ ఆఫర్స్!

ఒకప్పుడు సౌత్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న వారికి బాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు వచ్చేవి కావు. సౌత్ హీరోయిన్స్ లలో కొంతమంది మాత్రమే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నారు. ఇక మధ్యలో కాస్త సౌత్ బ్యూటీలకు అవకాశాలు తగ్గాయని అనుకున్న సమయంలో ఊహించని విధంగా సమంత, నయన్ వంటి వారికి హిందీ సినిమా ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇక భవిష్యత్తులో అయితే హీరో హీరోయిన్స్ భాషతో సంబంధం లేకుండా క్రేజ్ అందుకుంటారని చెప్పవచ్చు. ఇక నయాతర నుంచి సమంత వరకు ప్రస్తుతం హిందీ ఆఫర్స్ ఎక్కువగా దక్కించుకుంటున్న వారిపై ఒక లుక్కేస్తే..

అప్పట్లో లో స్టార్ హీరోయిన్స్

అప్పట్లో లో స్టార్ హీరోయిన్స్

వైజయంతి మాల, వహీదా రెహ్మాన్, హేమ మాలిని అలాగే రేఖ వంటి సౌత్ నటీమణులు బాలీవుడ్ లో ఒకప్పుడు భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి అయితే దక్షిణాదిలో ఒక దశ అనంతరం హిందీ సినిమాల కోసం ముంబై వెళ్లారు. ముందుగా ప్లాన్స్ అన్ని సిద్ధం చేసుకొని శ్రీదేవి నార్త్ లో కూడా స్టార్ హీరోయిన్ గా అప్పట్లో బారి స్థాయిలో క్రేజ్ అందుకుంది. ఆమె ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్స్ కు బారి షాక్ ఇచ్చింది.

నయనతార కూడా

నయనతార కూడా

ఇక అట్లీ చిత్రంలో షారూఖ్‌తో నయనతార నటిస్తోంది. నయనతార గత కొంతకాలంగా కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ లో ఎంత కాంట్రవర్సీ ఉన్నా కూడా ఆ ప్రభావం ఎప్పుడు కూడా సినిమాలపపై పడనివ్వలేదు. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఆఫర్ ను కూడా అందుకునెందుకి సిద్ధమైంది.

విడాకుల అనంతరం

విడాకుల అనంతరం

ఇక సమంత రూత్ ప్రభు కూడా ముంబై అరంగేట్రం కోసం హిందీ నేర్చుకుంటూ, అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ది ఫ్యామిలీ మ్యాన్‌లో రాజి యొక్క తీవ్రమైన పాత్రలో కనిపించి వార్తల్లో నిలిచింది, ఆమె ఇటీవల నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమెకు మరికొన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయని త్వరలోనే నార్త్ లో బిజీ అవ్వనున్నట్లు టాక్ అయితే వస్తోంది.

నిత్యా మీనన్ స్పెస్ మూవీ

నిత్యా మీనన్ స్పెస్ మూవీ

ఇక మరోవైపు నిత్యా మీనన్ కూడా కొన్ని ప్రత్యేకమైన హిందీ సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించింది. ఇటీవల అక్షయ్ కుమార్ మెషిన్ మంగళ అనే స్పెస్ డ్రామా మూవీలో నిత్యా నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో నిత్య మీనన్ నటించిన విధానం అభిమానులకు మంచి కిక్కిచ్చాయి. ప్రియమణి మైదాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ను అనుకున్నారు. మళ్ళీ ఆ తరువాత ప్రియమణికి ఆ ఆఫర్ వచ్చింది.

Recommended Video

MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
మహానటికి బారీగా క్రేజ్

మహానటికి బారీగా క్రేజ్

కీర్తి సురేష్ కు కూడా బాలీవుడ్ ఆఫర్స్ అయితే బాగానే వస్తున్నాయి. కానీ ఆమె తొందరపడకుండా చాలా నెమ్మదిగా కథలను సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం సర్కారు వారి పాట తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ త్వరలోనే మరో రెండు హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి మరికొన్ని రోజుకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X