ఆకలి కోసం ఒళ్ళు అమ్ముకుందట.. సెక్స్ వర్కర్ నుంచి స్టార్ రైటర్‌గా ఆమె ప్రయాణం..
మనిషిగా పుట్టిన తరువాత సమాజంలో గౌరవమైన జీవితాన్ని పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ సమస్యలు మనిషిని వెక్కిరించే వైనం ఎంతో మనోవేదనకు గురి చేస్తాయి. ఒక బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీ కూడా అలాంటి జీవితాన్ని దాటుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సెక్స్ వర్కర్ నుంచి ఒక రైటర్ గా మారిన ఆమె జీవితంలో ఎన్నో చెరగని చేదు అనుభవాలు ఉన్నాయి. కనీసం తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు అంటే ఆమె ఎలాంటి పరిస్థితులను దాటుకుంటూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఆషికి 2 రైటర్..
ఆ రైటర్ మరెవరోకాదు. బాలీవుడ్ లో ఆషికి2 వంటి ఎమోషనల్లవ్ స్టోరిలకురైటర్ గా వర్క్ చేసిన షాగుప్తారఫీక్. తెలుగు వారికి ఆమె పెద్దగా పరిచయం లేకపోవచ్చు గాని బాలీవుడ్జనాలకుమాత్రం బాగా తెలుసు. అయితే షాగుప్తారైటర్ గా జీవితాన్నిస్టార్ చేయడానికి ముందు ఎవరు ఊహించనికఠినతరమైనజీవితాన్నిఎదుర్కొంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరణ ఇచ్చింది.

తల్లిదండ్రులు ఎవరో తెలియదు..
బాలీవుడ్ లో అతి తక్కువ బడ్జెట్ లో వచ్చి 200కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఆషికీ 2 సినిమాకు కథ, మాటలు అందించిన షాగుప్తా చూస్తుండగానే బాలీవుడ్ స్టార్ రైటర్స్ లో ఒకరిగా మారిపోయింది. అయితే ఆమె జీవితం ఒక సెక్స్ వర్కర్ నుంచి ఉహీంచని మలుపులు తిరిగింది. కనీసం తన తల్లిదండ్రులు ఎవరో కూడా షాగుప్తాకి తెలియదు అంటే ఆమె ఎలాంటి పరిస్థితులను దాటుకుంటూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

బార్ డ్యాన్సర్ గా..
షాగుప్తా ఒంటరిగా ఉండడంతో ఒక మహిళ ఆమెను చేరదీసింది. కొన్నాళ్లకు ఆ మహిళ మరో వ్యక్తికి దగ్గరవ్వగా అతను కొన్నిరోజులకే మరణించడంతో వారి జీవితం మరింత అంధకారంలోకి వెళ్లింది. దీంతో టీనేజ్ వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్న షాగుప్తా.. ఒక బార్ డ్యాన్సర్ గా కూడా వర్క్ చేసింది.

ఆకలి కోసం ఒళ్ళు అమ్ముకోక తప్పలేదు.
అనంతరం కొన్నాళ్లకు బార్ డ్యాన్సర్ నుంచి డబ్బుల కోసం సెక్స్ వర్కర్ గా మారే పరిస్థితి ఏర్పడింది. ఆకలి కోసం ఆమె ఒళ్ళు అమ్ముకోక తప్పలేదు. డ్యాన్స్ చేస్తుంటే తనపై అసభ్యకరంగా డబ్బులు చల్లారని చెప్పిన షాగుప్తా ఒక మహిళను ఈ సమాజంలో ఎలా చూస్తారో అప్పుడే అర్ధమయ్యిందని డైరెక్ట్ గా చెప్పేసింది. కొన్నాళ్లకు జీవితంలో నాకు నచ్చిన పని చేయాలని అనుకున్నాను అంటూ రైటర్ గా మారినట్లు తెలిపింది.
Recommended Video

ఆ దర్శకుడి సహాయంతో..
ఎలాగైనా రైటర్ కావాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. సీనియర్ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ ని కలిసి తన రైటింగ్ స్కిల్స్ ని చూపించగా వెంటనే ఆయన నాకు సపోర్ట్ చేశారని తెలిపింది. 2006లో వచ్చిన వా..లంహే సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్ గా డైలాగ్స్ రైటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన షాగుప్తా ఆ తరువాత మర్డర్ 2, జన్నథ్ 2 వంటి సినిమాలతో తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. ఈ విధంగా షాగుప్తా కష్టపడి ఎంచుకున్న మంచి దారి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











