twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అల్లరి నరేష్: అందులో ఫస్ట్ ప్లేస్‌లో నాంది.. ఈ ఏడాది బెస్ట్ మూవీస్ ఇవే

    |

    రెండేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. ఇక, ఈ సంవత్సరం కూడా చాలా తక్కువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. మిగిలిన వాటిలో కొన్ని ఏవరేజ్‌గా, మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇక, 2021 సంవత్సరానికి గానూ ప్రముఖ టికెట్ బుకింగ్ సైత్ 'బుక్ మై షో'లో అత్యధిక రేటింగ్ పొందిన చిత్రాల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం పదండి!

    ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన అల్లరి నరేష్ ‘నాంది'

    ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన అల్లరి నరేష్ ‘నాంది'

    విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన చిత్రం 'నాంది'. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం బాగానే రాణించింది. ఇక, దీనికి బుక్ మై షోలో ఏకంగా వందకు 92 శాతం రేటింగ్ వచ్చింది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ విడుదలైన చిత్రాల్లోనే అత్యధిక రేటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

    రెండో స్థానానికి పరిమితమైన పవర్ స్టార్

    రెండో స్థానానికి పరిమితమైన పవర్ స్టార్

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్‌బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్'కు ఎంతటి హైప్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం హిట్ టాక్ ఉన్నా.. కలెక్షన్లను సరిగా రాబట్టలేకపోయింది. దీంతో కమర్షియల్‌గా సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇక, ఈ సినిమాకు బుక్ మై షోలో 85 శాతం రేటింగ్ వచ్చింది. దీంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

    ‘జాతి రత్నాలు', ‘క్రాక్'కు మూడో స్థానం

    ‘జాతి రత్నాలు', ‘క్రాక్'కు మూడో స్థానం

    తెలుగు సినీ ఇండస్ట్రీలో 'జాతి రత్నాలు' మూవీ చూపించిన హవా అంతా ఇంతా కాదు. చాలా చిన్న చిత్రంగా వచ్చిన దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. అలాగే రవితేజ నటించిన 'క్రాక్' సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంది. ఈ రెండు చిత్రాలకు సమానంగా బుక్ మై షోలో 83 శాతం రేటింగ్ వచ్చింది. తద్వారా ఇవి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి.

    హిట్ మూవీతో సమానంగా నాగ్ సినిమా

    హిట్ మూవీతో సమానంగా నాగ్ సినిమా

    విలక్షణ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'జాంబీ రెడ్డి'. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీనికి బుక్ మై షోలో 79 శాతం రేటింగ్ వచ్చింది. ఈ హిట్ మూవీతో సమంగా 79 శాతం రేటింగ్‌ను సంపాదించుకున్న మరో చిత్రం 'వైల్డ్ డాగ్'. నాగార్జున నటించిన ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ రెండు 4వ స్థానంలో ఉన్నాయి.

    ప్లాప్ చిత్రంతో సమంగా ‘ఉప్పెన' మూవీ

    ప్లాప్ చిత్రంతో సమంగా ‘ఉప్పెన' మూవీ

    ఈ ఏడాది విడుదలై చిత్రాల్లో నిర్మాతలకు ఎక్కువ లాభాలు అందించిన చిత్రం 'ఉప్పెన'. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి బుక్ మై షోలో 77 శాతం రేటింగ్ దక్కింది. ఇక, దీనికి సమానంగా సందీప్ కిషన్ నటించిన 'ఏ1 ఎక్స్‌ప్రెస్'కు సైతం 77 శాతం రేటింగ్ వచ్చింది. అయితే, ఇది మాత్రం కమర్షియల్‌గా సక్సెస్‌ను అందుకోలేకపోయింది.

    నితిన్ రెండు సినిమాల రేటింగులు ఇలా

    నితిన్ రెండు సినిమాల రేటింగులు ఇలా

    ఈ సంవత్సరం యూత్ స్టార్ నితిన్ ఒక్కడే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఒకటి చంద్రశేఖర్ ఏలేటీ తెరకెక్కించిన 'చెక్'. దీనికి బుక్ మై షోలో కేవలం 63 శాతం మాత్రమే రేటింగ్ వచ్చింది. ఇదే హీరో నటించిన మరో చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరీ తీసిన ఈ మూవీకి మాత్రం 74 శాతం రేటింగ్ దక్కింది. కానీ, ఈ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి.

    Recommended Video

    Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
    మిగిలిన చిత్రాల రేటింగ్ ఎలా ఉందంటే?

    మిగిలిన చిత్రాల రేటింగ్ ఎలా ఉందంటే?

    2021లో విడుదలై హిట్ అయిన చిత్రాల్లో ప్రదీప్ మాచిరాజు నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ఒకటి. దీనికి బుక్‌ మై షోలో 76 శాతం రేటింగ్ వచ్చింది. దీంతో ఇది ఏడో స్థానంలో నిలిచింది. ఇక, మిగిలిన చిత్రాల జాబితాను పరిశీలిస్తే.. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ నటించిన 'గాలి సంపత్'కు 72 శాతం రేటింగ్, కార్తికేయ 'చావు కబురు చల్లగా' చిత్రానికి 64 శాతం రేటింగ్ వచ్చింది.

    English summary
    So Many Movies Released in 2021. In The First Half.. Allari Naresh's Naandhi Movie Got Top Rating in BookMyShow. Pawan Kalyan's Vakeel Saab took Second Place in The List.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X