Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బతికితే అలా బతకాలట.. వెన్నెల కిషోర్‌పై బ్రహ్మాజీ సెటైర్స్!!
వెన్నెల కిషోర్ బ్రహ్మాజీలు తెరపై ఎంతగా సందడి చేస్తారో అందరికీ తెలిసిందే. తెరపై వేసే పంచ్‌లు, సెటైర్ల కంటే పదింతలు సోషల్ మీడియాలో వేస్తుంటారు. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. వారిపై వచ్చే రూమర్స్, ట్రోలింగ్‌పై సెటైర్స్ వేస్తుంటారు. ఆ మధ్య లాక్ డౌన్లో సోషల్ మీడియాలో వెన్నెల కిషోర్, లావణ్య, బ్రహ్మాజి, సాయి ధరమ్ తేజ్ అందరూ కలిసి ట్విట్టర్లో వాట్సప్ చాట్ చేసినట్టు చేశారు.
సెటైర్లు వేయడంలో అందరి కంటే ముందుగా బ్రహ్మాజీ ఉంటాడు. ఈ మధ్యే కలర్ ఫోటో సినిమాపై స్పందిస్తూ.. కమెడియన్, హీరో సుహాస్‌పై కామెంట్ చేశాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజి మాట్లాడుకుంటూ.. ఎవడో కొత్తగా వచ్చాడు.. బాగా టాలెంట్ ఉన్నట్టుంది.. తొక్కేద్దా లేదంటే మనకు ఛాన్స్‌లు రావంటూ ట్వీట్లు చేశాడు. సునీల్‌పైనా సెటైర్లు వేశారు. తాజాగా వీరిద్దరు సినిమా షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
నిన్న పెళ్లి గెటప్‌లో దిగిన ఓ సెల్పీని షేర్ చేశాడు బ్రహ్మాజీ. మరోసారి పెళ్లి కానీ ఎన్నోదో కౌంట్ మరిచిపోయాను.. అంటూ సెటైర్ వేశాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా పనిలో పడ్డట్టు కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ ల్యాప్ ట్యాప్ ముందు కూర్చుని ఉన్నాడు. అయితే ఆ ల్యాప్ టాప్ చుట్టూ రకరకాలు వంటకాలున్నాయి. పలు రకాల కూరలు పెట్టుకుని అన్నం తింటూ ల్యాప్ టాప్‌లో సినిమా చూస్తున్న ఫోటోను షేర్ చేస్తూ బ్రహ్మాజి అదిరిపోయే కామెంట్ చేశాడు. బతికితే ఇలా బతకాలి అంటూ వెన్నెల కిషోర్‌పై బ్రహ్మాజీ అసూయ పడ్డట్టు కనిపిస్తోంది.