For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Brahmanandam: కళామతల్లి పెదవులపై చెరగని చిరునవ్వు.. బ్రహ్మానందం గురించి తెలియని విషయాలు!

  |

  బ్రహ్మానందం.. తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతేకాదు, ఆ పేరు వినగానే మన పెదాలపై నవ్వులు చిగురిస్తుంటాయి. సినిమాల్లో ఆయన ఎంట్రీకి కేకలు వినిపిస్తుంటాయి. దేశ వ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్‌కు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతలా దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తూ రికార్డులు, అవార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడీ హాస్యబ్రహ్మ. సుదీర్ఘ కాలంగా తెలుగు వాళ్లకు నవ్వులు పంచుతోన్న బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి!

  బ్రహ్మానందం బ్యాగ్రౌండ్ ఇదే.. అరగుండుతో స్టార్ట్

  బ్రహ్మానందం బ్యాగ్రౌండ్ ఇదే.. అరగుండుతో స్టార్ట్


  బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. చదువులో నెంబర్ వన్ అయిన ఆయన మాస్టర్ ఆఫ్ డిగ్రీ తెలుగు చేసి అత్తిలిలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే కొన్ని స్టేజ్ షోలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే జంధ్యాల రూపొందించిన ‘ఆహా నా పెళ్లంట' సినిమాలో ‘అరగుండు' అనే పాత్రతో సినీ రంగ ప్రవేశం చేశారాయన.

  మరచిపోలేని పాత్రలు... గిన్నిస్ రికార్డులో పేరు

  మరచిపోలేని పాత్రలు... గిన్నిస్ రికార్డులో పేరు

  సుదీర్ఘమైన కెరీర్‌లో బ్రహ్మానందం ఎన్నో మర్చిపోలేని పాత్రలను పోషించారు. అరగుండు, ఖాన్ దాదా, బద్దం భాస్కర్, కిల్ బిల్ పాండే, కత్తి రాందాసు, శంకర్ దాదా ఆర్ఎంపీ, చిత్రగుప్తుడిగా, నెల్లూరు పెద్దారెడ్డి, శాస్త్రి, చారి, హల్వారాజ్‌, ప్రణవ్‌, బాబీ, జిలేబీ, మెక్‌డోనాల్డ్‌ మూర్తి, పద్మశ్రీ ఇలా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

  ఆ ఘనత సాధించిన తొలి తెలుగు కమెడియన్

  ఆ ఘనత సాధించిన తొలి తెలుగు కమెడియన్

  తెలుగులో మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు బ్రహ్మానందం. ఆ తర్వాత వాళ్ల అబ్బాయిలు బాలకృష్ణ, నాగార్జునతోనూ నటించారు. వీళ్ల తర్వాతి తరం అయిన నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాల్లోనూ చేశారు. తద్వారా మూడు తరాల హీరోలతో నటించిన ఏకైక కమెడియన్‌గా ఆయన రికార్డులను క్రియేట్ చేసుకున్నారు.

  హీరోగా బ్రహ్మానందం... అవార్డులు... పురస్కారం

  హీరోగా బ్రహ్మానందం... అవార్డులు... పురస్కారం

  నలభై ఏళ్ల కెరీర్‌లో కమెడియన్‌గానే కాకుండా.. నటుడిగానూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు బ్రహ్మానందం. ఇందులో ‘బాబాయ్ హోటల్' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ఇక, ఆయన కెరీర్‌లో ఐదు నందులు, ఒక ఫిల్మ్ ఫేర్, సైమా, ‘మా' అవార్డులతో పాటు 2010లో పద్మ శ్రీ పురస్కారం కూడా దక్కింది.

  నెమ్మదించిన బ్రహ్మానందం.... ‘అల’లో గెస్టుగా

  నెమ్మదించిన బ్రహ్మానందం.... ‘అల’లో గెస్టుగా

  అప్పట్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన బ్రహ్మానందం ఏడాది ఇరవైకి పైగా సినిమాలు కూడా చేసేవారు. అయితే, ఈ మధ్య మాత్రం ఆయన అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరం అయ్యారు. గత ఏడాది ‘అల వైకుంఠపురములో' సినిమాలో ‘రాములో రాములా' పాటలో తళుక్కున మెరిసిన ఆయన.. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

  ఒక కొడుకు హీరోగా.. మరో కొడుకు కూడా ఎంట్రీ

  ఒక కొడుకు హీరోగా.. మరో కొడుకు కూడా ఎంట్రీ

  2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు' సినిమాతో తన కొడుకు రాజా గౌతమ్‌ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు బ్రహ్మానందం. ఆ తర్వాత అతడు ‘వారెవా', ‘మను' చిత్రాల్లో నటించాడు. ఇక, ఇప్పుడు తన రెండో కొడుకు సిద్దార్థ్‌ను కూడా సినిమాల్లోకి తీసుకు రాబోతున్నారని ఇటీవల ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. త్వరలోనే అతడి సినిమా మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది.

  Brahmanandam Hails Allu Arjun & Trivikram At Ala Vaikunthapurramuloo Success Meet
  బ్రహ్మానందంలో ఆ టాలెంట్లు.. వెయ్యేల్లు వర్ధిల్లు

  బ్రహ్మానందంలో ఆ టాలెంట్లు.. వెయ్యేల్లు వర్ధిల్లు

  నటుడిగా ఎంతో కాలం పాటు ప్రేక్షకులను అలరించిన బ్రహ్మానందం అప్పుడప్పుడూ పాటలు కూడా పాడేవారన్న విషయం తెలిసిందే. అంతేకాదు, సంగీతంలోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. దీనితో పాటు పెయింటింగ్ కూడా అద్భుతంగా చేస్తుంటారు. ఇటీవల ఆయన గీసిన వెంకటేశ్వర స్వామి పటం వైరల్ అయింది. ఇన్ని రకాలుగా తెలుగు వాళ్లను అలరించిన బ్రహ్మానందం వెయ్యేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. హాస్య బ్రహ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Brahmanandam who is going through a rough patch in his film career shocked everyone with his appearance at the election campaign rally of a BJP leader. Adding strength to the speculations that he would soon join BJP, the star comedian has joined the rally with Dr Sudhakar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X