twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు శ్రీముఖి కావాలి.. బ్రహ్మానందం.. ఎందుకో తెలుసా?

    By Rajababu
    |

    Recommended Video

    నాకు శ్రీముఖి కావాలి.. బ్రహ్మానందం.. ఎందుకో తెలుసా?

    హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎక్కడ ఉన్న నవ్వులతో ముంచెత్తుతారు. ఆయన మౌనంగా ఉంటేనే అందరూ పడీ పడీ నవ్వుతారు. అలాంటింది ఓ ఎక్స్‌ప్రెషన్ ఇస్తే ఇక చెప్పేదేముంది. ఇలాంటి సంఘటన ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన కామెడీ అవార్డుల కార్యక్రమంలో చోటుచేసుకొన్నది. శ్రీముఖితో బ్రహ్మనందం వేదికపై చేసిన సరదా సన్నివేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. అదేమిటంటే..

     కిల్‌బిల్ పాండే‌గా

    కిల్‌బిల్ పాండే‌గా

    టెలివిజన్ ఛానెల్ కామెడీ అవార్డులు ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో జరిగాయి. ఆ కార్యక్రమానికి శ్రీముఖి, ప్రదీప్ యాంకర్లుగా వ్యవహరించారు. ఆ సందర్భంగా వేదికపైకి బ్రహ్మనందం వచ్చారు. ఆ సందర్భంగా బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రహ్మానందం ఉన్న కిల్‌బిల్ పాండే పోస్టర్‌ను ప్రదర్శించారు. ఆ పోస్టర్ చూసి ఇంద్రగంటి మోహన కృష్ణ, అచ్చిరెడ్డితోపాటు అందరూ పడిపడి నవ్వారు.

    హీరోయిన్‌గా ఎవరైతే

    హీరోయిన్‌గా ఎవరైతే

    కిల్‌బిల్ పాండే పోస్టర్‌ను ప్రదీప్ చూపిస్తూ.. కిల్‌బిల్ పాండే సినిమా తీస్తే మీ పక్కన ఎవరు హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందనిపిస్తుందో చెప్పాలని బ్రహ్మానందంను కోరాడు. దాంతో ఏంటీ ఈ రోజు ఈ రకంగా బాదేస్తున్నారని బ్రహ్మనందం పంచ్ విసిరాడు.

    నా ఫేస్‌కు హీరోయిన్ అవసరమా?

    నా ఫేస్‌కు హీరోయిన్ అవసరమా?

    కిల్‌బిల్ పాండే పోస్టర్‌ను చూపిస్తూ ఆ ఫేస్‌కు హీరోయిన్ అవసరమా? మీకు అడగడానికి అదో రకంగా లేదా? అని బ్రహ్మనందం అన్నాడు. అందుకు ప్రదీప్ సమాధానం ఇస్తూ.. మీరే అన్ని చేసేస్తారు. మీ పక్కన హీరోయిన్ ఉంటే మరింత బాగుంటుందని అనుకొంటున్నాం అని అన్నాడు.

    శ్రీముఖి వైపు ఓరచూపు

    శ్రీముఖి వైపు ఓరచూపు

    దాంతో బ్రహ్మానందం స్పందిస్తూ.. నా పక్కన హీరోయిన్‌గా ఉండటానికి అంటూ ఓరచూపుగా శ్రీముఖిని బ్రహ్మానందం చూశాడు. దాంతో శ్రీముఖి సిగ్గుతో వంకలు తిరిగిపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌లో గీత గోవిందం సినిమా పాట తకథిం.. తకథిం అంటూ ఇంకా ఇంకా అనే పాట ప్లే కాగానే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

    సిగ్గుపడిన శ్రీముఖి

    సిగ్గుపడిన శ్రీముఖి

    శ్రీముఖి సిగ్గుపడుతుండగా.. బ్రహ్మానందం అలాగే చూస్తూ.. ఆయ్.. సిగ్గుపడకూడదు అని అదోలా చూశాడు. అందుకు కిల్ బిల్ పాండే సరసన హీరోయిన్‌గానా అంటూ శ్రీముఖి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సైగ చేసింది.

    నాకు సిగ్గేస్తుందని

    నాకు సిగ్గేస్తుందని

    ఆ తర్వాత ప్రదీప్ కిల్‌బిల్ పాండే పక్కన హీరోయిన్ ఎవరో పేరు చెప్పండి సార్ అంటూ అడిగాడు. అందుకు బ్రహ్మానందం.. ఆమె పేరు పలకడానికి నాకు సిగ్గువేస్తుంది అని అనగానే ఆడిటోరియమంతా నవ్వుల్లో మునిగిపోయింది. ఇలా సూపర్ ఫన్‌గా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

    ట్రెండింగ్‌లో వీడియో

    బ్రహ్మానందం, శ్రీముఖి, ప్రదీప్ మధ్య జరిగిన సంభాషణ వీడియో ప్రస్తుతం హాట్‌హాట్‌గా ట్రెండ్ అవుతున్నది. ఈ వీడియోను శ్రీముఖి, అనసూయ, ప్రగ్యా జైస్వాల్; రష్మిక మందన్న, రాహుల్ రవీంద్రన్ షేర్ చేశారు.

    English summary
    Popular Telugu Television Channel orgnised a comedy awards function. So many tollywood's film personalities are attended for this event. Pradeep and Sree Mukhi was the host for this function. In that event, Brahmanandam episode was highlight for event. That video goes viral in youtube.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X