చేసింది కొన్ని సినిమాలు.. పాకిస్థాన్‌లోనూ అభిమాన సంఘాలు.. ఏకైక హీరోయిన్ 'బ్రో'

సినీ పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్లుగా మారతారు. అది కూడా అనేక చిత్రాలు చేసి, అవి హిట్ అయితేనే వారికి ఆ స్టార్ డమ్ వస్తుంది. కానీ తొలి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.

తొలి సినిమా కాదు, కేవలం ఒకే ఒక్క వీడియో ఎవరూ తెచ్చుకోని క్రేజ్ అందుకుంది ఓ ముద్దుగుమ్మ. అయితే ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ పాకిస్థాన్ లో అభిమాన సంఘాలు పెట్టేంత ఫేమ్ తెచ్చుకుంది ఈ బ్యూటి. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరనే విషయంలోకి వెళితే..

Bro Actress Priya Prakash Varrier Has Fans Clubs In Pakistan

సెన్సేషన్ వీడియో: ఒకే ఒక్క వీడియోతో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడం అంతా ఈజీ కాదు. కానీ కన్ను కొట్టి, ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి.. గన్‌ పేల్చి యువతను ఒక ఊపు ఊపేసింది మలయాళ ముద్దగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది ప్రియా. స్కూల్ ఏజ్‌లో లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'తో హీరోయిన్‌గా పరిచయమైన ప్రియా ప్రకాష్ వీడియో అప్పట్లో సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే.

Bro Actress Priya Prakash Varrier Has Fans Clubs In Pakistan

రాని సక్సెస్: 'ఒరు అదార్ లవ్' సినిమాలోని ఆ వీడియోపై ఎంతో మంది మీమ్స్ సైతం చేశారు. అందులో సినీ స్టార్ సెలబ్రిటీల నుంచి ప్రముఖ రాజకీయ వేత్తలు కూడా ఉన్నారు. అలా ప్రియా ప్రకాష్ వారియర్ బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ ఫేమ్ తో వరుసగా సినీ ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటికి పెద్దగా విజయం మాత్రం వరించలేదు.

Bro Actress Priya Prakash Varrier Has Fans Clubs In Pakistan

దాయాది దేశం: అయితే ఇదే కన్ను కొట్టిన వీడియో ప్రియా ప్రకాష్ కు పాకిస్థాన్ లో అభిమానులను తీసుకొచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ప్రియా తెలిపింది. ప్రియా ప్రకాష్ కన్ను కొట్టిన వీడియో పాకిస్థాన్ ప్రేక్షకులకు తెగ నచ్చేసిందట. తనకు దాయాది దేశం నుంచి రోజూ సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టేవారని ప్రియా ప్రకాష్ చెప్పుకొచ్చింది.

Bro Actress Priya Prakash Varrier Has Fans Clubs In Pakistan

ఏకైక సౌత్ హీరోయిన్: అంతేకాకుండా తనకోసం పాక్ లో అభిమాన సంఘాలు కూడా ఉన్నాయని, వాళ్లు చెబుతుంటే నమ్మలేకపోయానని ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పుకొచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే పాకిస్థాన్ లో ఇలా అభిమాన సంఘాలు ఉన్న ఏకైక సౌత్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ అవుతుంది. చేసింది కొన్ని సినిమాలైన ఒక్క వీడియోతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటి.

Bro Actress Priya Prakash Varrier Has Fans Clubs In Pakistan

బ్రో సినిమాపైనే: ఇదిలా ఉంటే ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగులో నితిన్ తో చెక్, తేజ సజ్జాతో 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ', మలయాళంలో 'లైవ్' అనే సినిమాలు చేసింది. కానీ, అవేం అంతగా ఆడలేదు. ప్రస్తుతం ప్రియా చేతిలో 'విష్ణుప్రియ', 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్', 'కొల్ల', '4 ఇయర్స్' వంటి చిత్రాలు ఉన్నాయి. వీటన్నికంటే ముఖ్యంగా పవన్-సాయి ధరమ్ బ్రో సినిమాలో కూడా నటిస్తోంది ఈ వింక్ బ్యూటి. ఈ సినిమాపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది ఈ మలయాళీ చిన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X