Telugu Warriors సెమీస్ కు చేరాలంటే? అఖిల్ సేనకు సాధ్యమేనా?
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025) హోరాహోరీగా సాగుతోంది. ఈ వారంతో నాకౌట్ దశ ముగియనున్న నేపథ్యంలో ఏయే జట్లు సెమీఫైనల్ చేరుతాయోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ముంబై హీరోస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇక చెన్నై రైనోస్, పంజాబ్ దే షేర్, భోజ్‌పురి దబాంగ్స్, తెలుగు వారియర్స్ జట్లు సెమీస్ బెర్త్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఫిబ్రవరి 22న భోజ్‌పురి దబాంగ్స్‌పై చెన్నై రైనోస్ .. కర్ణాటక బుల్డోజర్స్‌పై పంజాబ్ దే షేర్ విజయం సాధించడంతో లెక్కలన్నీ మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23న బెంగాల్ టైగర్స్ - తెలుగు వారియర్స్, ముంబై హీరోస్ - పంజాబ్ దే షేర్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లు ఆసక్తి రేకిత్తిస్తున్నాయి.

సీసీఎల్ టోర్నీలలో అత్యంత విజయవంతమైన జట్టుగా తెలుగు వారియర్స్ నిలిచింది. ఏకంగా నాలుగు సార్లు ఛాంపియన్‌గా అవతరించిన తెలుగు జట్టు ఈసారి ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో అభిమానులు నిరాశపడుతున్నారు. ఈసారి కూడా గెలిచి ఐదో సారి ట్రోఫీ అందుకుంటామని తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని చెప్పిన మాటలు ఆచరణలో కనిపించడం లేదు. మూడు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క విజయంతో సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది తెలుగు జట్టు.
తొలి మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో అఖిల్ సేన చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌తో తెలుగు వారియర్స్ తలపడింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అఖిల్ సేన పోరాడి గెలిచింది. అదృష్టం బాగుండి కాస్తలో తప్పిపోయింది కానీ ఆ మ్యాచ్ కూడా చేజారిపోయేది. గాడిలో పడ్డారు అనుకునే లోపు చెన్నై రైనోస్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ మరోసారి బొక్కబోర్లాపడింది. 108 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన తెలుగు జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది.
ఫిబ్రవరి 23న సూరత్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో బలమైన బెంగాల్ టైగర్స్‌తో తెలుగు వారియర్స్ తలపడనుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిచిన బెంగాల్ జట్టు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. మరి ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచినా తెలుగు వారియర్స్ సెమీస్‌కు వెళ్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై , పంజాబ్, భోజ్‌పురి జట్లు రెండేసి విజయాలతో తెలుగు టీమ్ కంటే ముందున్నాయి. పంజాబ్ జట్టు ఏకంగా కర్ణాటక బుల్డోజర్స్‌కు షాకిస్తూ రెండో విజయాన్ని అందుకుంది. ఆ జట్టు ఆదివారం ముంబై హీరోస్‌తో తలపడుతుంది.
నెట్ రన్ రేట్ విషయంలోనూ చెన్నై, పంజాబ్, భోజ్‌పురి జట్లు అఖిల్ సేన కంటే ముందున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు వారియర్స్ సెమీఫైనల్‌లో అడుగుపెట్టేది లేనిది ఫిబ్రవరి 23తో తేలిపోనుంది. సెమీస్‌కి వెళ్లాలంటే బెంగాల్‌పై భారీ తేడాతో అఖిల్ సేన గెలవడంతో పాటు పంజాబ్‌పై ముంబై విజయం సాధించాల్సి ఉంది. దీంతో ఏం జరుగుంది? ఏ జట్టు సెమీఫైనల్‌కు వెళ్తుందనేది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











