Samantha: బెడ్ రూమ్ సీన్లలో హాట్ గా సమంత.. ఆ హీరోయిన్ రేంజ్ లో చేయనుందా?
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 వంటి వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు రాగా.. పుష్ప మూవీలోని ఊ అంటావా పాటతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాల తర్వాత సమంతకు బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సినిమా ఆఫర్లు వచ్చాయి.
ఈ మధ్య కాలంలో లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత యశోద మూవీతో హిట్ కొట్టింది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో పాటు మరో హాలీవుడ్ మూవీలో నటిస్తున్న సామ్.. అందులో ఘాటు ఇంటిమేట్ సీన్లలో నటించడమనే విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది.

యశోదతో హిట్టు.. శాకుంతలంతో..
వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది సమంత. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, పుష్ప ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకు వరుస పెట్టి అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం మొదలైంది. గతేడాది యశోదతో హిట్ కొట్టిన ఈ బ్యూటి ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్ తో లవ్ స్టోరీ..
ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమానే కాకుండా గ్లామరస్ బ్యూటి సమంత ఖుషీ అనే సినిమా కూడా చేస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ మూవీ లవ్ స్టోరీగా రానుంది.

అవేంజర్స్ క్రియేటర్స్..
అయితే ఈ తెలుగు చిత్రాలే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీస్ లోనూ నటించనుంది ఫిట్ నెస్ భామ సమంత. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు పోషించిన న్యూ స్ఫై థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్. అవేంజర్స్ క్రియేటర్స్, ది గ్రే మ్యాన్ మూవీ డైరెక్టర్స్ అయిన రూసో బ్రదర్స్ ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇంటిమేట్ సన్నివేశాల్లో..
సిటాడెల్ ట్రైలర్ ఆద్యంతం భారీ యాక్షన్స్ సీక్వెన్స్ తో భారీ స్టంట్స్ తో అదిరిపోయింది. దీంతో ఈ యాక్షన్ లవర్స్ కు ఈ సిరీస్ ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ లో ఎవరూ ఊహించని రేంజ్ లో ఘాటు బెడ్ రూమ్ సీన్లు, అదర చుంబనాలకు కొదవ ఉండదని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఈ ట్రైలర్ లో హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా రెచ్చిపోయి మరి ఇంటిమేట్ సీన్లలో నటించింది.

బెడ్ రూమ్ సీన్లు..
ఓవైపు భీకరమైన స్టంట్స్ చేస్తూనే మరోవైపు శృంగార రసాన్ని సూపర్ హాట్ గా పండించింది. అయితే ఈ వెబ్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ గా వస్తున్న సిటాడెల్ లో ముద్దుగుమ్మ నటిస్తోంది. సమంతతోపాటు మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు హాలీవుడ్ సిటాడెల్ భారతీయ వెర్షన్ లో అలాంటి ఘాటు బెడ్ రూమ్ సీన్లలో సమంత నటిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ముఖ్యంగా హీరోతో బెడ్ రూమ్ లో టాప్ విప్పి ప్రియాంక రేంజ్ లో రెచ్చిపోవాలి. అలా జరుగుతుందా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

బూతులతో విమర్శలు..
ఇప్పటికే రానా నాయుడు సిరీస్ బూతులతో విమర్శలు తెచ్చుకుంది. మరి సిటాడెల్ లో శృంగార సన్నివేశాలు తెరకెక్కిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు. మరి ఆ సన్నివేశాలను మాత్రం కాస్తా అటు ఇటుగా రాజ్ అండ్ డీకే ద్వయం మారుస్తారా అనేది తెలయాల్సి ఉంది. ఇక యశోద సినిమాతో యాక్షన్ సీన్స్ సూపర్బ్ గా చేయగలనని సమంత నిరూపించుకుంది. అలాగే ఘాటైన సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించగలదని ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో నిరూపించింది.

అలాంటి శృంగార రసాన్ని..
ఇక నాగ చైతన్యతో విడాకుల అనంతరం పుష్ప చిత్రంలో ఊ అంటావా వంటి ఐటమ్ సాంగ్ లో హాట్ డ్యాన్స్ తో రెచ్చిపోయింది సమంత. దానికంటే ముందు ఆ సాంగ్ చేయొద్దని స్నేహితులు, బంధువులు, వెల్ విషర్స్ చెప్పిన సమంత మాత్రం అవన్నీ పక్కన పెట్టి మరి తెగువ చూపించి చేసింది. ఇలా చూసుకుంటే సిటాడెల్ లో ప్రియాంక చోప్రా ఒలికించిన శృంగార రసాన్ని సమంత కూడా చేయగలదని పలువురు అంచనా వేస్తున్నారు. మరి ఇది తెలియాలంటే సిటాడెల్ తెలుగు వెర్షన్ విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











