Cannes 2023 మాజీ మిస్ వరల్డ్‌కు అరుదైన గౌరవం.. రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యరాయ్, అనుష్క, అదితి

ప్రపంచ సినిమాకు వారధిగా నిలిచే కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు అంతా సిద్దమైంది. మే 16 తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే పారిస్ ఫిలిం ఫెస్టివల్‌కు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ తారలు పాల్గొనే 76వ కాన్స్ ఫెస్టివల్‌కు భారతీయ సినీ తారలు రెడ్ కార్పెట్‌పై మెరిసేందుకు పారిస్ బాట పట్టారు.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ విషయానికి వస్తే.. 1946లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా రూపొందే అన్ని జోనర్ల సినిమాలు, డాక్యుమెంటరీలను ప్రదర్శించేందుకు వేదికను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయం సాధించిన చిత్రాలను, భవిష్యత్‌లో రిలీజ్ అయ్యే సినిమాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు.

Cannes 2023: Aditi Rao Hydari, Anushka sharma, Manushi Chhillar to lead 76th Cannes International Film Festival

గతంలో కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, దీపిక పదుకోన్, విద్యాబాలన్ లాంటి అగ్రతారలు ఈ వేదికపై మెరుపులు మెరిపించారు. ఈ ఏడాది ఇండియా నుంచి అనుష్క శర్మ, ఇషా గుప్తా, మనుషీ చిల్లర్, విజయ్ వర్మ పాల్గొనేందుకు పారిస్‌కు బయలుదేరనున్నారు. కాన్స్ 2023 వేడుకలో ఐశ్వర్యరాయ్ మరోసారి అందాలను ప్రదర్శించనున్నారు. అలాగే అదితి రావు హైదరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.

ఇండియా తరఫున కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించేందుకు కొన్ని చిత్రాలను ఎంపిక చేశారు. కాను బెహల్ రూపొందించిన ఆగ్రా మూవీని డైరెక్టర్స్ ఫోర్ట్ నైట్ సెక్షన్‌లో, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన కెన్నడీ సినిమాను మిడ్‌నైట్ స్క్రీనింగ్స్‌లో ప్రదర్శించనున్నారు.

మాజీ మిస్ వరల్డ్ మనుషీ చిల్లర్ భారత్ తరుఫున ప్రతినిధిగా కాన్స్ రెడ్ కార్పెట్‌పై మెరువనున్నారు. ఆమె వెంట ఇషాగుప్తా, కంగబమ్ తుంబా, ఆస్కార్ విన్నర్ గునీత్ మోంగ ఉంటారు. ప్రముఖ గాయకుడు కుమార్ సాను కుమార్తె షానన్ కే కూడా ఈ వేడుకలో పాల్గొంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X