Mumbai Heroes Vs Bhojpuri Dabanggs నరాలు కట్ అయ్యే మ్యాచ్.. 1 పరుగు తేడాతో ఓటమి.. ఎవరు ఓడారంటే?
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం మార్చి 3వ తేదీన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భోజ్‌పురి దంబంగ్స్ జట్టుతో ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో ముంబై హీరోస్ జట్టు విజయం సాధించింది. 98 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భోజ్‌పురి జట్టు 1 పరుగు తేడాతో ఓటమి పాలైంది. చివరి బంతి వరకు జరిగిన మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబై హీరోస్ మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ధాటిగా ప్రారంభించింది. ముంబై జట్టులో నవదీప్ 17 బంతుల్లో 32 పరుగులు చేయడం విశేషంగా చెప్పుకోవాలి. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 5వ వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. భోజ్‌పురి జట్టులో మన్మోహన్ 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకొన్నాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భోజ్‌పురి దబంగ్స్ జట్టు వేగంగా పరుగులు చేసే క్రమంలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అంశుమన్ ధాటిగా ఆడి 31 బంతుల్లో 51 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. భోజ్‌పురి జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది.
ముంబై జట్టు 6 పరుగులు తొలి ఇన్సింగ్స్ అధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టింది. మరోసారి నవదీప్ చెలరేగి ఆడారు. కేవలం 16 బంతుల్లో 26 పరుగులు చేసింది. భోజ్ పురి జట్టులో ఆదిత్య 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో 98 పరుగుల టార్గెట్‌ను భోజ్‌పురి దంబగ్స్ జట్టు ముందు ఇచ్చింది.
అనంతరం 98 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భోజ్‌పురి జట్టు ఆచితూచి ఆడుతూ కనిపించింది. అయితే పరుగుల వేగం మందగించడంతో జట్టు ముందు భారీ రన్ రేట్ కనిపించింది. నాలుగు ఓవర్లలో 52 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరకు 12 బంతుల్లో 32 పరుగుల లక్ష్యం వరకు వచ్చింది. 9వ ఓవర్‌లో 12 లభించడంతో 10వ ఓవర్‌లో 6 బంతుల్లో 20 పరుగులు లక్ష్యం ముందు కనబడింది.

ఫైనల్ ఓవర్‌లో తొలి బంతికి 2 పరుగులు, రెండో బంతికి బౌండరీ సాధించారు. దాంతో నాలుగు బంతుల్లో 14 పరుగుల విజయలక్ష్యం ముందుండింది. ఆ తర్వాత 3 బంతికి సిక్సర్ సాధించడంతో విజయం భోజ్‌పురి పక్షాన చేరినట్టు కనిపించింది. ఇక 3 బంతుల్లో 8 పరుగులు సులభంగా అనిపించేలా చేసింది. నాలుగో బంతికి 2 పరుగులు వచ్చాయి. దాంతో విజయానికి 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక ఐదో బంతికి 2 పరుగులు చేశారు. దాంతో చివరి బంతికి 4 పరుగుల కావాల్సి వచ్చింది.
ముంబై బౌలర్ షబ్బీర్ వేసిన బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో లాంగ్ ఆన్‌లో ఫీల్డర్ ఆపడంతో 3 పరుగు చేసి టైగా మార్చే ప్రయత్నం చేశారు. కానీ కీపర్ చేతికి బంతి రావడం.. వెంటనే బెయిల్స్ తొలగించడంతో బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు. దాంతో భోజ్‌పురి జట్టు 1 పరుగు తేడాతో ఓటమి పాలైంది.


Click it and Unblock the Notifications











