CCL 2025: బెంగాల్ కీపర్ చీటింగ్.. బ్యాట్ విసిరికొట్టిన చెన్నై ప్లేయర్!

క్రికెట్ అంటే అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకోవడం కనిపిస్తుంటాయి. మైదానంలో ఆటగాళ్లు చురుకు వ్యవహరించే తీరు.. వారు పన్నే వ్యూహాలు ఆశ్చర్యంలో ముంచెత్తుంటాయి. కొన్నిసార్లు ఆటగాళ్ల తీరు వివాదాస్పదంగా మారుతుంటాయి. అయితే ఉత్కంఠ భరితంగా సాగిన బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్ జట్టు మధ్య ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకొన్నది. ఆ సంఘటన రెండు జట్ల మధ్య గందరగోళానికి దారి తీసింది. ఆ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బెంగాల్ టైగర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అయితే 80 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టు ధాటిగా ఆడటం ప్రారంభించింది. అయితే కెప్టెన్ విక్రాంత్ బ్యాటింగ్ చేస్తుండగా బెంగాల్ కీపర్ అనూహ్యంగా స్పందించిన తీరు గలాటా సృష్టించింది.

CCL 2025 Bengal Tigers Keeper Mystic Action and Chennai Rhinos batsman throws Bat with anger

చెన్నై ఆటగాడు విక్రాంత్ ఓ బంతిని ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బాల్ బ్యాట్ తాకకుండా కీపర్ సౌరభ్ చేతిలోకి వెళ్లింది. అయితే బంతి డెడ్ అయిందని భావించిన విక్రాంత్.. తన కాలిని గాల్లోకి లేపి ముందుకు కదలాడు. అలా కాలు పైకి లేపుతాడని ముందే పసిగట్టిన సౌరభ్ వెంటనే బెయిల్ తీసేసి స్టంప్ అవుట్ చేశాడు. దాంతో ఆ అవుట్‌ను నిర్ధారించడానికి థర్డ్ అంపైర్ నిర్ణయానికి వదిలేశాడు. చాలా సేపు పరిశీలించిన తర్వాత విక్రాంత్ అవుట్ అయ్యాడని అంపైర్ అవుట్ ఇచ్చాడు.

అయితే అంపైర్ నిర్ణయంపై విక్రాంత్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ పెవిలియన్ వైపుకు వెళ్లాడు. అయితే ఆ బంతి యాక్షన్ పూర్తయిన తర్వాతే నేను క్రీజు నుంచి బయటకు వచ్చాను. అలాంటి సమయంలో స్టంప్ అవుట్ ఎలా చేస్తారని వాదించాడు. ఓ దశలో కీపర్ చేసిన చర్యకు ప్రతి చర్యగా బ్యాట్‌ను విసిరికొట్టాడు. అయితే చెన్నై ఆటగాళ్లు సర్ది చెప్పడంతో విక్రాంత్ శాంతించాడు. ఆ తర్వాత మ్యాచ్ ముందుకు సాగింది. అయితే గత సీజన్‌లో విక్రాంత్ కూడా ఇదే విధంగా ఓ ఆటగాడిని అవుట్ చేశాడనే వాదన కామెంటరీ బాక్స్‌లో వినిపించింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగాల్ జట్టు తొలి 10 ఓవర్లలో 79 పరుగులు చేయగా.. అందుకు బదులుగా చెన్నై జట్టు 90 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టైగర్స్.. 4 వికెట్ల కోల్పోయి 111 పరుగులు చేసింది. దాంతో చెన్నై విజయానికి 100 పరుగులు అవసరం అయ్యాయి. 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చెన్నై చేసింది. దాంతో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X