CCL 2025: ముంబై హీరోస్‌ను చీల్చి చెండాడిన భోజ్‌పురి దబాంగ్స్... సిక్సర్లు, ఫోర్లతో పరుగుల సునామీ!
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా ఢిల్లీలో ముంబై హీరోస్, భోజ్‌పురి దంబగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగులు వరద పాటింది. హోరాహోరీగా జరిగిన గేమ్‌లో రెండు జట్లు కూడా భారీ స్కోర్లు సాధించాయి. ఇరు జట్ల ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో పరుగుల ప్రవాహాన్ని కొనసాగించారు. దాంతో ముంబై హీరోస్‌ను మట్టి కరిపించి భోజ్‌పురి దబాంగ్స్ ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో చోటు చేసుకొన్న హైలెట్స్, ఆటగాళ్లు సాధించిన పరుగుల వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై జట్టు భారీ స్కోరు సాధించింది. తొలుత ఒపెనర్లు, మిడిల్ ఆర్డర్ తడబాటు పడినా.. కొంత మేరకు నిలదొక్కుకొన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ముంబై జట్టులో అత్యధికంగా సిద్దాంత్ 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు. భోజ్‌పూరి జట్టులో అస్గర్ ఖాన్ 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు.

ముంబై జట్టు విసిరిన 125 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భోజ్‌పురి జట్టు ఆటగాళ్లు సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయారు. ఈ జట్టులోని కీలక ఆటగాడు అస్గర్ ఖాన్ కేవలం 30 బంతుల్లో 96 పరుగులు చేయడంతో భారీ స్కోరు చేసింది. ఓ దశలో కేవలం ఐదు ఓవర్లలోనే 100 పరుుగులు చేశారు. కానీ చివరి ఓవర్లలో ముంబై జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్ అమిత్ తివారీ జట్టు 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. దాంతో ముంబై జట్టుపై 25 పరుగుల ఆధిక్యాన్ని భోజ్‌పురి సాధించింది.
ఆ తర్వాత ముంబై జట్టు ధాటిగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. జట్టు ఓపెనర్ షబ్బీర్ అహ్లువాలియా కేవలం 33 బంతుల్లో 82 పరుగులు చేశాడు. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 128 రన్స్ చేసింది. భోజ్‌పురి బౌలర్ మన్మోహన్ ఒక వికెట్ పడగొట్టాడు. దాంతో విజయానికి భోజ్‌పురి జట్టు 103 పరుగులు చేయాల్సి వచ్చింది.
103 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భోజ్‌పురి జట్టు బ్యాట్స్‌మెన్లు ముంబై జట్టు బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. జట్టు ఆటగాడు అస్గర్ ఖాన్ కేవలం 19 బంతుల్లోనే 58 పరుగులు చేయడంతో గెలుపు అతి సులభమైంది. కేవలం 5.5 ఓవర్లలోనే 104 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. దాంతో భోజ్‌పురి జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఈ మ్యాచ్ అమిత్ తివారీ సేన ఆధిక్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ప్రొఫెషనల్ క్రికెటర్లను తలపించేలా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











