CCL 2025: తెలుగు వారియర్స్ ఓటమికి తమన్ కారణమా? అభిమానుల తీవ్ర ఆగ్రహం!
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL 2025) హోరాహోరీగా కొనసాగుతున్నది. దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు చెందిన 8 క్రికెట్ జట్లు తమ ప్రతిభను ఘనంగా చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, ముంబై, భోజ్‌పురి, బెంగాల్ టీమ్స్ ప్రొఫెషనలిజంతో క్రికెట్ ఆడుతున్నాయి. అయితే హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు దారుణమైన ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ గురించి అభిమానుల వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
సీసీఎల్ 11వ సీజన్‌లో తెలుగు వారియర్స్ జట్టు తడబాటుతో తన జర్నీని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టు చేతిలో ఓడిపోవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో పోరాడి భోజ్‌పురి దంబాగ్స్ జట్టుపై విజయం సాధించారు. దాంతో తెలుగు వారియర్స్ జట్టు గాడిన పడ్డారనే అభిప్రాయానికి ఫ్యాన్స్ వచ్చారు.

తెలుగు వారియర్స్ జట్టు తప్ప గెలువాల్సిన మ్యాచ్‌లో అప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన చెన్నై రైనోస్ జట్టుతో ఆడాల్సి వచ్చింది. అయితే గెలుపు సులభం అనుకొన్న ప్రారంభించిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ధాటిగా ఆడుతూ భారీగా పరుగులు చేసింది. సుమారు 108 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన తెలుగు జట్టు విజయం ముందు చతికిలపడింది. దాంతో తెలుగు వారియర్స్ జట్టు సెమీస్ ఆశలు కష్టంగా మారాయి.
తెలుగు వారియర్స్ జట్టు సొంత గడ్డపై ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని అభిప్రాయపడ్డారు. అలాగే జట్టు సమతూకం లేదన్నారు. అయితే కెప్టెన్సీ విషయంలో అఖిల్ ఈ మ్యాచ్‌లో సరిగా రియాక్ట్ కాలేదు. బౌలింగ్‌లో చాలా వీక్ ఉన్నాం. అఖిల్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. అందుకే ఓడిపోయామని పలువరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తెలుగు వారియర్స్ జట్టు ఆటను బాగానే ఎంజాయ్ చేశాం. తమన్ జట్టులో లేకపోవడం వల్లే ఓడిపోయాం. తమన్ ఆట కోసమే మేము వచ్చాం. ఆయన లేకపోవడం వల్ల పూర్తిగా నిరాశ చెందాం అని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. తమన్ అన్న రాకపోవడం బాధగా ఉంది. తమన్ లేకపోవడం జట్టుకు మైనస్. ఆయన ఉంటే జట్టుకు బలంగా ఉండేది అని ఫ్యాన్స్ చెప్పారు. తమన్ సార్ లేకపోవడం వల్లే జట్టు ఓడిపోయింది. ఆయన ఉంటే గ్రౌండ్‌లో మంచి వినోదం ఉంటుంది. సిక్సర్లు కూడా భారీగా కొడుతాడు అని అభిమానులు వెల్లడించారు.
సీసీఎల్ టోర్నీలో నాలుగు సార్లు విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్ మరోసారి విజయం సాధించాలంటే.. ఫిబ్రవరి 23వ తేదీన బెంగాల్ టైగర్స్ జట్టుతో జరిగే కీలక మ్యాచ్‌లో భారీ రన్ రేట్‌తో గెలువాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో అనూహ్యమైన విజయాన్ని సాధిస్తే తప్పా ఈ టోర్నిలో ముందుకు వెళ్లడం కుదరదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డతున్నారు.


Click it and Unblock the Notifications











