CCL 2025: బెంగాల్ టైగర్స్ సంచలన విజయం.. చేతులెత్తేసిన పంజాబ్ షేర్స్

దేశంలోని అన్ని భాషల సినీ తారల క్రికెట్ టోర్నమెంట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 (CCL 2025) అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 8వ తేదీన బెంళూరులో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో గతేడాది విజేత బెంగాల్ టైగర్స్, రన్నరప్ కర్ణాటక బుల్లోజర్స్ జట్లు తమ సత్తా చాటాయి. చెన్నైపై బెంగాల్ జట్టు, తెలుగు వారియర్స్ జట్టుపై కర్ణాటక జట్టు ఘన విజయం సాధించాయి. ఇక టోర్నీలో మరో రెండు మ్యాచులు ఉత్కంఠ పోరుకు తెరలేపాయి. సీసీఎల్ 2025 మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ ఆప్ డేట్స్ వివరాల్లోకి వెళితే..

CCL 2025 LIVE Scores Pujab De Sher vs Bengal Tigers and Mumbai Heroies Vs Bhojpuri Dabanggs match ball to ball update

LIVE Feed
  • Feb 9, 2025 6:51 PM

    పంజాబ్‌పై బెంగాల్ విజయం

    పంజాబ్ ది షేర్ జట్టుపై బెంగాల్ టైగర్స్ విజయం సాధించింది. 7.3 ఓవర్లలోనే గెలుపు కోసం కావాల్సిన 83 పరుగులను సాధించింది. జామీ అత్యధికంగా 24 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో బెంగాల్ జట్టుకు ఇది రెండో విజయం. దాంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

  • Feb 9, 2025 6:31 PM

    40 బంతుల్లో 49 పరుగులు

    బెంగాల్ టైగర్స్ జట్టు మరో విజయం వైపు దూసుకుపోతున్నది. 83 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జిషు సేన్ గుప్తా టీమ్ కేవలం 3 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. ఇంకా గెలుపు కోసం 40 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది.

  • Feb 9, 2025 6:00 PM

    బెంగాల్ టార్గెట్ 83 రన్స్

    పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఆర్టర్ కుప్పకూలడంతో భారీ స్కోరు బెంగాల్ జట్టు ముందు ఉంచలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పంజాబ్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. దాంతో బెంగాల్ ఈ మ్యాచ్‌లో గెలువాలంటే కనీసం 83 పరుగులు చేయాల్సి ఉంటుంది. పంజాబ్‌లో అత్యధికంగా హార్డీ 42 పరుగులు చేశాడు.

  • Feb 9, 2025 5:42 PM

    కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్ ఆర్టర్

    పంజాబ్ జట్టు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 5 వికెట్లు కోల్పోయి 7 ఓవర్లలో 63 పరుగులు చేసింది. కెప్టెన్ హర్డీ 41 పరుగులతో, జస్సీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు 64 పరుగుల ఆధిక్యం లభించింది.

  • Feb 9, 2025 5:18 PM

    కష్టాల్లో పంజాబ్ జట్టు

    రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ జట్టు 4 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. కెప్టెన్ హార్డీ 20 పరుగులతో, నింజా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు పంజాబ్‌కు 34 పరుగుల ఆధిక్యం లభించింది.

  • Feb 9, 2025 4:45 PM

    10 ఓవర్లలో 110 పరుగులు

    బెంగాల్ టైగర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులు చేసింది. జామీ, 65 పరుగులు చేశాడు. కెప్టెన్ జిషు సేన్ గుప్తా బాధ్యతాయుతంగా జట్టును నడిపించాడు. జామీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ వరుసగా రెండు సిక్సర్లు బాది 2 బంతుల్లో 12 పరుగులు చేశాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ జట్టు 111 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బెంగాల్‌పై పంజాబ్ ఒక పరుగు ఆధిక్యం సాధించింది.

  • Feb 9, 2025 4:41 PM

    జామీ హాఫ్ సెంచరీ.. బెంగాల్ ధీటైన జవాబు

    9వ ఓవర్ పూర్తయిన తర్వాత బెంగాల్ జట్టు 1 వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది. జుషు 21 పరుగులతో, జామీ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జామీ హాఫ్ సెంచరీతో పంజాబ్‌కు దీటైన జవాబునిచ్చింది,

  • Feb 9, 2025 4:20 PM

    6 ఓవర్ల తర్వాత బెంగాల్ జట్టు

    బెంగాల్ జట్టు 6 ఓవర్ల తర్వాత ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. జామీ 40 పరుగులతో జిషు సేన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. పంజాబ్ జట్టు కంటే 48 పరుగులు వెనుకబడి ఉన్నారు.

  • Feb 9, 2025 3:57 PM

    జామీ బ్యాటింగ్ జోరు

    పంజాబ్ విసిరిన 111 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ చేపట్టిన జట్టు ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. జామీ భారీ షాట్స్‌తో బోర్డుపై స్కోరును పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. 3 ఓవర్లు ముగిసే సమాయానికి జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. జామీ 19 పరుగులతో ఆడుతున్నాడు.

  • Feb 9, 2025 3:31 PM

    పంజాబ్ భారీ స్కోర్ (111/5)

    పంజాబ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. కెప్టెన్ హార్డీ 40 పరుగులు, రాహుల్ 26 పరుగులు చేశాడు. అయితే ఓ దశలో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ హార్డీ ఆదుకొన్నాడు. దాంతో భారీ స్కోర్‌ను పంజాబ్ సాధించింది.

  • Feb 9, 2025 2:59 PM

    కష్టాల్లో పంజాబ్ షేర్స్

    పంజాబ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధాటిగా ఆడుతున్న రాహుల్ అవుటైన వెంటనే మరో వికెట కూడా పడటంతో పరుగలు వేగం మందగించింది. 5 ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది.

  • Feb 9, 2025 2:42 PM

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

    బెంగాల్ టైగర్స్ జట్టుతో మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 21 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. నింజా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. మరో రాహుల్ 24 పరుగులతో, బబ్బల్ రాయ్ క్రీజులో ఉన్నారు.

  • Feb 9, 2025 2:27 PM

    టాస్ గెలిచిన పంజాబ్

    టాస్ గెలిచిన పంజాబ్ ది షేర్ జట్టు. కెప్టెన్ హార్డీ సంధూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో బెంగాల్ టైగర్స్ జట్టు ఫీల్డింగ్‌కు దిగింది. దాంతో బెంగాల్ జట్టు బ్యాటింగ్ చేపట్టేందుకు రెడీ అయింది.

  • Feb 9, 2025 2:27 PM

    బెంగాల్ టైగర్స్ జట్టు

    ఓనర్స్: బోని కపూర్, రాజ్ షా కెప్టెన్: జిషు సేన్ గుప్తా టీమ్: ఉదయ్, ఇంద్రాశీష్, మోహన్, సుమన్, జాయ్, జోయ్, యూసఫ్, జీతూ కమల్, జామీ, రత్నదీప్ ఘోష్, ఆనంద చౌదరీ, శాండీ, ఆదిత్య రాయ్ బెనర్జీ, ఆర్మాన్ ఆహ్మద్, మాంటీ, రాహుల్ మజుందార్, గౌరవ్ చక్రవర్తి, బోనీ, సౌరవ్ దాస్

  • Feb 9, 2025 2:27 PM

    పంజాబ్ దే షేర్ జట్టు వివరాలు

    పంజాబ్ దే షేర్ ఓనర్స్: నవరాజ్ హాన్స్, పునీత్ సింగ్ కెప్టెన్: హార్డీ సంధూ టీమ్: సోనుసూద్, జిమ్మీ ష్రెగిల్, ఆయుష్మాన్ ఖురానా, గుర్ ప్రీత్ గుగ్గి, బిన్ను దిల్లాన్, జస్సీ గిల్, రాహుల్ దేవ్, గేవీ చాహల్, దేవ్ కరౌడ్, గుల్జార్ చాహల్, బబ్బల్ రాయ్, ఆర్యమన్ సప్రూ, నవరాజ్ హన్స్, యువరాజ్ హాన్స్, ముకుల్ దేవ్, అర్జన్ బజ్వా, హర్మీత్ సింగ్

  • Feb 9, 2025 2:26 PM

    మ్యాచ్ నంబర్ 4

    సీసీఎల్‌లో నాలుగో మ్యాచ్ ముంబై, భోజ్‌పూరి దబాంగ్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుంది.

  • Feb 9, 2025 2:26 PM

    ఫిబ్రవరి 9వ తేదీన

    మ్యాచ్ నంబర్ 3: ఈ టోర్నీలో మూడో మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. గత ఏడాది విన్నర్ బెంగాల్ టైగర్స్‌ జట్టుతో పంజాబ్ ది షేర్ జట్టు తలపడుతుంది. ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X