CCL 2025: బెంగాల్ టైగర్స్ చేతిలో చెన్నై రైనోస్ చిత్తు.. ఎన్ని రన్స్‌తో ఓటమి అంటే?

దేశవ్యాప్తంగా అన్ని భాషలకు చెందిన సినీ తారల క్రికెట్ టోర్నమెంట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అలియాస్ ది ఛాంపియన్స్ క్రికెట్ లీగ్ (CCL 2025) పోరుకు సర్వం సిద్దమైంది. గతేడాది విజేత బెంగాల్ టైగర్స్, రన్నరప్ కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తొలి రోజు బరిలోకి దిగనున్నాయి. అలాగే ఈ ఏడాది టైటిల్ ఫేవరేట్‌గా భావిస్తున్న తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్ జట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అయ్యారు. ఈ రోజు జరిగే మ్యాచ్స్ హైలెట్స్, సైడ్ లైట్స్, బాల్ టు బాల్ స్కోర్ అప్ డేట్స్ మీ కోసం..

CCL 2025 LIVE Scores Telugu Warriors vs Karnataka Bulldozers chennai rhinos Vs Bengal Tigers match ball to ball update

LIVE Feed
  • Feb 8, 2025 6:22 PM

    గెలుపు వాకిట చెన్నై రైనోస్ బోల్తా

    బెంగాల్ రైనోస్ జట్టు చేతిలో చెన్నై రైనోస్ జట్టు పోరాడి ఓడింది. 100 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో 12 పరుగులు తేడాతో చెన్నై ఓటమి పాలైంది.

  • Feb 8, 2025 6:11 PM

    విజృంభించిన బౌలర్ జామీ.. హ్యాట్రిక్ మిస్

    బెంగాల్ బౌలర్ విజృంభించడంతో చెన్నై రైనోస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో జామీ ఇద్దరిని అవుట్ చేయడంతో హాట్రిక్ ఛాన్స్ లభించింది. జాయ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెన్నై బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశాడు.

  • Feb 8, 2025 6:04 PM

    18 బంతుల్లో 48 పరుగులు

    చెన్నై జట్టు 7వ ఓవర్ ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉంది.

  • Feb 8, 2025 5:53 PM

    30 బంతుల్లో 61 పరుగులు

    5వ ఓవర్ ముగిసే సమయానికి చెన్నై జట్టు 30 బంతుల్లో 61 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై జట్టు 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. అయితే భారీ లక్ష్యాన్ని రైనోస్ ఛేదిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

  • Feb 8, 2025 5:35 PM

    42 బంతుల్లో 75 పరుగుల టార్గెట్

    భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై రైనోస్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. బెంగాల్ టైగర్స్ పంజా విసరడంతో తొలి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. 42 బంతుల్లో 75 పరుగులు చేయాల్సి ఉంటుంది.

  • Feb 8, 2025 5:30 PM

    ఆదిలోనే చెన్నైకి ఎదురుదెబ్బ

    100 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండో బంతికే అజయ్ అవుటయ్యాడు. రెండు ఓవర్లు ముగిసే సమయానికి రైనోస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 82 పరుగులు చేయాల్సి ఉంటుంది.

  • Feb 8, 2025 5:12 PM

    చెన్నై టార్గెట్ 100 పరుగులు

    10వ ఓవర్‌లో బెంగాల్ టైగర్స్ కెప్టెన్ జిషు సేన్ గుప్తా రెండు సిక్సర్లు కొట్టడంతో జట్టు 4 వికెట్లు కొల్పోయి 111 పరుగులు చేసింది. దాంతో బెంగాల్ టైగర్స్ జట్టుకు 100 పరుగులు రెండో ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక చెన్నై జట్టు ముందు 100 పరుగుల టార్గెట్‌ను పెట్టింది.

  • Feb 8, 2025 5:04 PM

    9 ఓవర్లలో 3 వికెట్లకు 94 పరుగులు

    9వ ఓవర్ తొలి బంతికి రాహుల్ బౌండరీ వద్ద క్యాచ్ అవుట్ అవ్వడంతో బెంగాల్ 3వ వికెట్ కోల్పోయింది. తొమ్మిదో ఓవర్ ముగిసే సమయానికి బెంగాల్ జట్టు 94 పరుగులు చేసింది. దాంతో 83 పరుగుల ఆధిక్యం లభించింది.

  • Feb 8, 2025 5:01 PM

    78 పరుగుల ఆధిక్యంలో బెంగాల్

    బెంగాల్ జట్టు 8 ఓవర్లలో 89 పరుగులు చేసింది. రాహుల్ 38 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. దాంతో బెంగాల్‌కు 78 పరుగులు ఆధిక్యం లభించింది.

  • Feb 8, 2025 4:49 PM

    7 ఓవర్లలో 81/1

    7 ఓవర్‌లో ఒక సిక్స్, ఒక ఫోర్ సహాయంతో రాహుల్ భారీ స్కోరు సాధించాడు. రాహుల్ వ్యక్తిగతం 36 పరుగులు చేయగా.. ఒక వికెట్ కోల్పోయి బెంగాల్ జట్టు 81 పరుగులు చేసింది.

  • Feb 8, 2025 4:47 PM

    6 ఓవర్లలో 58 పరుగుల ఆధిక్యం

    బెంగాల్ టైగర్ జట్టు 6 ఓవర్లు ముగిసే సమయానికి 68 పరుగులు చేసింది. రాహుల్, ఆనంద క్రీజులో ఉన్నారు. బెంగాల్‌కు 58 పరుగుల ఆధిక్యం లభించింది.

  • Feb 8, 2025 4:42 PM

    54 పరుగుల ఆధిక్యంలో బెంగాల్

    బెంగాల్ టైగర్స్ జట్టు 5 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. రాహుల్ 27 పరుగులు, ఆనంద 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. చెన్నైపై బెంగాల్‌కు 54 పరుగుల ఆధిక్యం లభించింది.

  • Feb 8, 2025 4:41 PM

    50 పరుగులు దాటిన బెంగాల్

    4వ ఓవర్ ముగిసే సమయానికి బెంగాల్ జట్టు 50 పరుగుల మైలురాయిని దాటింది. మొత్తంగా 54 పరుగులు చేసింది.

  • Feb 8, 2025 4:32 PM

    చెన్నైని బెంగాల్ వీర బాదుడు

    3వ ఓవర్‌లో కూడా బెంగాల్ టైగర్స్ వీరబాదుడు ప్రదర్శించారు. జాయ్ వరుసగా ఫోర్లు సాధించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. దాంతో 3 ఓవర్లలో 47 పరుగులు చేసింది. జాయ్ 30 పరుగులతో, రాహుల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 8, 2025 4:30 PM

    బెంగాల్ పరుగుల వరద

    చెన్నై రెండో ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో పరుగుల వరదను పారించింది. జాయ్, రాహుల్ ఇద్దరు కలిసి 18 పరుగులు చేశారు. ఫోర్లు, సిక్సర్లతో భారీగా పరుగులు సాధించారు. దాంతో 22 పరుగుల ఆధిక్యం లభించింది.

  • Feb 8, 2025 4:21 PM

    3 ఫోర్లతో రాహుల్ రచ్చ..

    11 పరుగుల అధిక్యంతో చెన్నై విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన బెంగాల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. తొలి ఓవర్లలో రెండు ఫోర్లతో 15 పరుగులు చేసింది. రాహుల్ 12 పరుగుల, జాయ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • Feb 8, 2025 4:09 PM

    11 పరుగుల ఆధిక్యంతో చెన్నై

    నిర్ణీత 10 ఓవర్ల తొలి ఇన్నింగ్స్‌ను చెన్నై, బెంగాల్ జట్లు పూర్తి చేశాయి. 79 పరుగులు చేసిన బెంగాల్‌కు ధీటుగా సమాధానం ఇస్తూ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. దాంతో చెన్నై జట్టుకు 11 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అజయ్ 20 పరుగులతో నాటౌట్‌గా, పృథ్వీ 14 పరుగులు చేసి చివరి బంతికి రనౌట్ అయ్యాడు.

  • Feb 8, 2025 4:04 PM

    బెంగాల్ జట్టుపై ఆధిక్యంలో చెన్నై

    చెన్నై ఆటగాడు అజయ్ భారీ షాట్స్ ఆడటంతో భారీగా పరుగులు లభించాయి. అజయ్ సిక్సర్ సహాయంతో 17 పరుగులు, పృథ్వీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. చెన్నై జట్టు 3 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. దాంతో 4 పరుగుల తొలి ఇన్నింగ్స్ అధిక్యం లభించింది.

  • Feb 8, 2025 3:59 PM

    70 పరుగులతో చెన్నై

    8 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై జట్టు 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. అజయ్ 5 పరుగులు, పృథ్వీ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 8, 2025 3:54 PM

    3 వికెట్లు కోల్పోయిన చెన్నై రైనోస్

    7వ ఓవర్‌లో బెంగాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై జట్టు పరుగులు సాధించడం కష్టమైంది. కెప్టెన్ విక్రాంత్‌ను బౌలర్ రత్నదీప్ క్లీన్ బౌల్డ్ చేశఆడు. దాంతో ఏడు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.

  • Feb 8, 2025 3:48 PM

    సిక్స్ బాదిన పృథ్వీ

    6వ ఓవర్‌లో చెన్నై జట్టు 10 పరుగులు చేసింది. పృథ్వీ సిక్స్‌తోపాటు మొత్తం 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దాంతో చెన్నై జట్టు 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.

  • Feb 8, 2025 3:45 PM

    2 వికెట్ కోల్పోయిన చెన్నై

    6వ ఓవర్‌లో చెన్నై రైనోస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రమణ 19 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం విక్రాంత్, పృథ్వీ క్రీజులో ఉన్నారు.

  • Feb 8, 2025 3:43 PM

    తొలి వికెట్ కొల్పోయిన చెన్నై

    ఐదో ఓవర్‌లో రమణ, శరన్ ధాటిగా ఆడారు. సిక్స్, ఫోర్లతో ఏకంగా 13 పరుగులు చేయడంతో జట్టు 50 పరుగుల మైలురాయిని దాటింది. అయితే ఈ ఓవర్‌లో అద్బుతమైన క్యాచ్‌ను బెంగాల్ కెప్టెన్ జిషుసేన్ గుప్తా పట్టడంతో శరన్ రూపంలో చెన్నై తొలి వికెట్ పడింది.

  • Feb 8, 2025 3:37 PM

    సిక్స్, ఫోర్లతో చెలరేగిన రమణ

    నాలుగో ఓవర్‌లో రమణ ఒక ఫోర్‌, సిక్స్ కొట్టాడు. దాంతో 4 ఓవర్లు ముగిసే సమయానిికి 37 పరగులుు చేసింది. రమణ 25 పరుగులు, శరణ్ 10 పరుగులు చేశారు.

  • Feb 8, 2025 3:32 PM

    3 ఓవర్లు ముగిసే సమయానికి 23 పరుగులతో చెన్నై

    రెండు ఓవర్లలో 20 ఓవర్లు చేసిన చెన్నై జట్టును బెంగాల్ జట్టు కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. మూడో ఓవర్‌ను పకడ్బందీగా వేయడంతో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసింది. దాంతో చెన్నై జట్టు వికెట్లు కోల్పోకుండా 23 పరుగులు చేసింది.

  • Feb 8, 2025 3:24 PM

    తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం

    ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బెంగాల్ నిర్దేశించిన 80 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు చెన్నై ధాటిగా బ్యాటింగ్ చేపట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో అధిక్యాన్ని సాధించేందుకు ప్రయత్నించింది.

  • Feb 8, 2025 3:19 PM

    హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగిన చెన్నై

    80 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు ధాటిగా పరుగులు సాధించింది. వరుసగా మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టారు. నాలుగో బంతికి ఎల్పీ అప్పీల్ చేయగా అంపైర్ నిరాకరించాడు. తొలి ఓవర్ ముగిసే సమయానికి చెన్నై జట్టు 12 ఓవర్లు చేసింది. బెంగాల్ జట్టు రెండు క్యాచులు మిస్ చేశారు. రమణ 12 పరుగులు, శరణ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

  • Feb 8, 2025 3:06 PM

    ఇరగదీసిన చెన్నై బౌలర్లు

    చెన్నై రైనోస్ జట్టులో బౌలర్ కలాయ్ 2 వికెట్లు, భరత్ 1 వికెట్, శరన్ ఒక వికెట్ పడగొట్టారు. 80 విజయలక్ష్యాన్ని చెన్నై ఛేదిస్తుందా? లేదా చూడాలి.

  • Feb 8, 2025 3:04 PM

    బెంగాల్ జట్టు 79 పరుగులు.. చెన్నై టార్గెట్ 80 రన్స్

    10వ ఓవర్‌..చివరి ఓవర్‌లో తొలి బంతికి 2 పరుగులు, రెండో బంతికి 1, మూడో బంతికి 1 పరుగు చేసింది. నాలుగో బంతికి జాయ్ వికెట్ కోల్పోయింది. ఐదో బంతికి ఒక పరుగు, ఆరో బంతికి వైడ్ రూపంలో ఒక పరుగు, చివరి బంతికి 2 పరుగులు చేసింది. దాంతో 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. రత్నదీప్ 1 పరుగు, యూసఫ్ 14 పరుగులు క్రీజులో ఉన్నారు.

  • Feb 8, 2025 2:58 PM

    9 ఓవర్లలో బెంగాలో జట్లు

    9 ఓవర్‌లో బెంగాల్ జట్టు 8 పరుగులు చేసింది. జాయ్ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దాంతో 70 రన్స్ చేసింది.

  • Feb 8, 2025 2:57 PM

    8వ ఓవర్‌లో 20 పరుగులు

    8 ఓవర్లలో బెంగాల్ జట్టు భారీ స్కోర్ సాధించింది. జాయ్ షాట్స్ ఆడటంతో 20 పరుగులు వచ్చాయి. జాయ్ ఒక సిక్స్, ఫోర్‌ను సాధించాడు. దాంతో 4 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.

  • Feb 8, 2025 2:47 PM

    బెంగాల్ జట్టు 7 ఓవర్లలో 41/4

    బెంగాల్ టైగర్స్ జట్టు 7 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. జామీ 22 పరుగులు, బోన్ని 1 పరుగు, జుషు సేన్ గుప్తా 2 పరుగులు, రాహుల్ 2 పరుగులు చేసి అవుటయ్యారు. యూసఫ్ 1 పరుగుతో, జాయ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 8, 2025 2:40 PM

    4 వికెట్ కోల్పోయిన టైగర్స్.. జామీ అవుట్

    బెంగాల్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడినట్టు కనిపిస్తున్నది. 35 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న జామీ భారీ షాట్ ప్రయత్నించి.. బౌండరీలైన్ వద్ద క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. దాంతో జామీ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది.

  • Feb 8, 2025 2:39 PM

    3 వికెట్ కోల్పోయిన బెంగాల్ జట్టు

    బెంగాల్ టైగర్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 33 పరుగుల వద్ద 3 వికెట్ కూడా కోల్పోయింది.

  • Feb 8, 2025 2:36 PM

    2 వికెట్ కోల్పోయిన బెంగాల్ జట్టు

    రెండో వికెట్ కోల్పోయిన బెంగాల్ టైగర్స్ జట్టు. 2 పరుగుల చేసిన కెప్టెన్ జిషు సేన్ గుప్తా రనౌట్ అయి పెవిలియన్ చేరారు. 30 పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది

  • Feb 8, 2025 2:24 PM

    తొలి వికెట్ కోల్పోయిన బెంగాల్ టైగర్స్

    బెంగాల్ టైగర్స్ జట్టు మూడో ఓవర్ చివరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. బోన్నీ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బౌలర్ షమీ క్యాచ్ పట్టడంతో కాట్ అండ్ బౌల్ రూపంలో ఆయన పెవిలియన్‌కు చేరారు. దాంతో 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

  • Feb 8, 2025 2:16 PM

    ధాటిగా ఆడుతున్న జామీ

    రెండో ఓవర్‌లో 6 పరుగులు చేసింది. బ్యాట్స్‌మెన్ జామీ మరో బౌండరీని సాధించాడు. దాంతో రెండు ఓవర్లలో వికట్లేమి కోల్పోకుండా 11 పరుగులు చేసింది.

  • Feb 8, 2025 2:12 PM

    బౌండరీతో పరుగులు ఖాతా తెరిచిన జామీ

    బెంగాల్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగింది. ఆ జట్టు ఓపెనర్స్ జామీ, బొన్నీ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. తొలి ఓవర్‌లో మూడో బంతిని బౌండరీకి తరలించి పరుగుల ఖాతాను తెరిచాడు. తొలి ఓవర్ ముగిసే సమయానికి 5 పరుగులు చేసింది.

  • Feb 8, 2025 2:06 PM

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న బెంగాల్ టైగర్స్

    సీసీఎల్ 2025 టోర్నిలో భాగంగా తొలి మ్యాచ్‌ బెంగాల్ టైగర్స్ జట్టుతో చెన్నై రైనోస్ జట్టు తలపడుతున్నది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ జిషు సేన్ గుప్తా టాస్ గెలిచి బెంగాల్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొన్నారు. దాంతో చెన్నై జట్టు బౌలింగ్‌కు దిగింది.

  • Feb 8, 2025 10:22 AM

    ప్రాక్టీస్ చేస్తున్న కిచ్చ సుదీప్

    సీసీఎల్ మ్యాచ్ కోసం బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్న కన్నడ సూపర్ స్టార్, కర్ణాటక బుల్డోజర్స్ కెప్టెన్ కిచ్చ సుదీప్

  • Feb 8, 2025 9:12 AM

    పునీత్ రాజ్ కుమార్‌కు తమన్ ఘన నివాళి

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ టోర్నీ ప్రారంభానికి ముందు బెంగళూరులోని స్వర్గీయ పునీత్ రాజ్‌కుమార్ స్మారక మందిరాన్ని మ్యూజిక్ డైరెక్టర్, తెలుగు వారియర్స్ జట్టు కీలక ఆటగాడు తమన్ ఎస్ దర్శించుకొన్నారు. ఆయన పునీత్ సమాధి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. తన సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు.

  • Feb 8, 2025 9:05 AM

    బెంగాల్ టైగర్స్ జట్టు వివరాలు

    ఓనర్స్: బోని కపూర్, రాజ్ షా కెప్టెన్: జిషు సేన్ గుప్తా కెప్టెన్: ఉదయ్, ఇంద్రాశీష్, మోహన్, సుమన్, జాయ్, జోయ్, యూసఫ్, జీతూ కమల్, జామీ, రత్నదీప్ ఘోష్, ఆనంద చౌదరీ, శాండీ, ఆదిత్య రాయ్ బెనర్జీ, ఆర్మాన్ ఆహ్మద్, మాంటీ, రాహుల్ మజుందార్, గౌరవ్ చక్రవర్తి, బోనీ, సౌరవ్ దాస్

  • Feb 8, 2025 9:04 AM

    చెన్నై రైనోస్ జట్టు వివరాలు

    కెప్టెన్: ఆర్య టీమ్: విష్ణు విశాల్, జీవా, విక్రాంత్, శంతను, పృథ్వీ, అశోక్ సెల్వన్, కలై అర్సన్, మిచ్చి శివ, భారతీ నివాస్, రమణ, సత్య, దశరథన్, శరణ్, ఆధవ్, బాల శరవణన్

  • Feb 8, 2025 9:04 AM

    కర్ణాటక బుల్డోజర్స్ జట్టు వివరాలు

    ఓనర్: అశోక్ ఖేనీ కెప్టెన్: సుదీప్ కిచ్చా టీమ్: రాజీవ్ హెచ్, సుదీప్ కిచ్చా, సునీల్ రావు, జయరాం కార్తీక్, ప్రతాప్, ప్రసన్న, శివకుమార్, గణేష్, కృష్న, సౌరవ్ లోకేష్, చందన్, అర్జున్ యోగి, నిరూప్ భండారీ, నంద కిషోర్, సాగర్ గౌడ

  • Feb 8, 2025 9:03 AM

    తెలుగు వారియర్స్ జట్టు

    ఓనర్స్: సచిన్ జోషి, వెంకటేశ్ కెప్టెన్: అఖిల్ అక్కినేని టీమ్: సచిన్ జోషి, అశ్విన్ బాబు, సాయిధరమ్ తేజ్, ఆదర్శ్, నందకిషోర్, నిఖిల్, రఘు, సామ్రాట్, తరుణ్, విశ్వ, ప్రిన్స్, సుశాంత్, ఖయ్యూం, హరీష్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X