CCL 2025 Live: హోం గ్రాండ్‌లో దుమ్మురేపిన తెలుగు వారియర్స్.. భోజ్‌పురి జట్టుకు భంగపాటు
సినీ తారల క్రికెట్ టోర్నమెంట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 (CCL 2025) అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 8వ తేదీన బెంళూరులో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో గతేడాది విజేత బెంగాల్ టైగర్స్, రన్నరప్ కర్ణాటక బుల్లోజర్స్ జట్లు తమ సత్తా చాటాయి. చెన్నైపై బెంగాల్ జట్టు, తెలుగు వారియర్స్ జట్టుపై కర్ణాటక జట్టు ఘన విజయం సాధించాయి. అయితే టైటిల్ ఫేవరేట్‌గా ఉన్న తెలుగు వారియర్స్ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే సొంత గడ్డ హైదరాబాద్‌తో సత్తా చాటుకొనే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో తెలుగు వారియర్స్ జట్టు, భోజ్‌పురి దబాంగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ గురించి లైవ్ అప్ డేట్స్ మీ కోసం..
సీసీఎల్ 2025 మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ ఆప్ డేట్స్ వివరాల్లోకి వెళితే..
మ్యాచ్ నంబర్ 6: హైదరాబాద్‌లోనే జరిగే 6వ మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్, తెలుగు వారియర్స్ జట్టు పోటీపడుతాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటల నుంచి 10.30 గంటల వరకు కొనసాగుతుంది.

భోజ్‌పురి దబాంగ్స్
ఓనర్స్: సుశీల్ శర్మ, కనిష్క్ శీల్, రాహుల్ మిశ్రా, సుశీల్ మాలిక్
కెప్టెన్: మనోజ్ తివారీ
టీమ్: రవి కిషన్, విక్రాంత్ సింగ్, ఆదిత్య జోజా, అస్గర్ ఖాన్, అయాజ్ ఖాన్, జే యాదవ్, వికాస్ సింగ్ విరప్పన్, అజయ్ శర్మ, శైలేష్ సిన్హా, దినేష్ లాల్ యాదవ్, పర్వేశ్ లాల్ యాదవ్, ఉదయ్ తివారీ, అన్హుమాన్ సింగ్ రాజ్‌పుత్, ఖేసరి లాల్ యాదవ్, వికాస్ ఝా, బైవావ్ రాయ్, సుధీర్ సింగ్
----------
తెలుగు వారియర్స్:
ఓనర్స్: సచిన్ జోషి, వెంకటేశ్
కెప్టెన్: అఖిల్ అక్కినేని
టీమ్: సచిన్ జోషి, అశ్విన్ బాబు, సాయిధరమ్ తేజ్, ఆదర్శ్, నందకిషోర్, నిఖిల్, రఘు, సామ్రాట్, తరుణ్, విశ్వ, ప్రిన్స్, సుశాంత్, ఖయ్యూం, హరీష్
- Feb 15, 2025 12:12 AM
7 పరుగుల తేడాతో తెలుగు వారియర్స్ విజయం
- Feb 14, 2025 11:43 PM
మరో రెండు వికెట్లు కోల్పోయిన భోజ్‌పురి జట్టు
- Feb 14, 2025 11:27 PM
భోజ్‌పురి జట్టుకు దెబ్బ మీద దెబ్బ
- Feb 14, 2025 11:09 PM
అస్గర్ ఖాన్ ఔట్
- Feb 14, 2025 10:58 PM
లక్ష్య ఛేదనకు దిగిన భోజ్‌పురి దబాంగ్స్
- Feb 14, 2025 10:49 PM
సెకండ్ ఇన్నింగ్స్‌లో రఫ్పాడించిన తెలుగు వారియర్స్
- Feb 14, 2025 10:29 PM
అఖిల్ ఔట్ .. నాలుగో వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్
- Feb 14, 2025 10:21 PM
100 మార్క్ దాటిన అఖిల్ సేన
- Feb 14, 2025 10:06 PM
మూడు వికెట్లు ఔట్.. కష్టాల్లో తెలుగు వారియర్స్
- Feb 14, 2025 9:44 PM
థమన్ బీభత్సం
- Feb 14, 2025 9:32 PM
తెలుగు వారియర్స్‌పై 46 పరుగుల ఆధిక్యంలో మనోజ్ సేన
- Feb 14, 2025 9:08 PM
రెండో వికెట్ కోల్పోయిన భోజ్‌పురి జట్టు
- Feb 14, 2025 9:03 PM
లీడింగ్‌లోకి భోజ్‌పురి దబాంగ్స్
- Feb 14, 2025 8:36 PM
తొలి వికెట్ కోల్పోయిన భోజ్‌పురి దబాంగ్స్
- Feb 14, 2025 8:23 PM
80 వద్ద ముగిసిన తెలుగు వారియర్స్ ఇన్నింగ్స్
- Feb 14, 2025 8:09 PM
భోజ్‌పురి దెబ్బ.. అఖిల్ , సాంబ, నిఖిల్ ఔట్
- Feb 14, 2025 7:52 PM
50 పరుగులు పూర్తి చేసుకున్న తెలుగు వారియర్స్
- Feb 14, 2025 7:39 PM
థమన్ ఔట్
- Feb 14, 2025 7:21 PM
ఒకే ఓవర్‌లో ముగ్గురు ఔట్ .. కష్టాల్లో అఖిల్ సేన


Click it and Unblock the Notifications











