CCL 2026 Points Table: సీసీఎల్ 2026లో ఎవరికి ఎన్ని పాయింట్లు.. తెలుగు వారియర్స్ ఏ స్థానంలో అంటే?

దేశంలోని ప్రధాన భాషలకు సంబంధించిన సినీ యాక్టర్ల క్రికెట్ పండుగ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 సంచలనాలతో రసవత్తరంగా సాగుతున్నది. జనవరి 16వ తేదీన వైజాగ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో సినీ తారలు అత్యంత ప్రొఫెషనలిజంతో తమ సత్తాను చాటుతున్నారు. గత మూడు రోజుల్లో ఆరు మ్యాచులు నువ్వా? నేనా అన్నట్టు జరిగాయి. తొలివారం తర్వాత సీసీఎల్ 2026 లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? ఎవరికి ఎన్ని పాయింట్లు లభించాయి అనే వివరాల్లోకి వెళితే...

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో మొత్తం ఎనిమిది టీమ్‌లు పాల్గొంటున్నాయి. సోనుసూద్ కెప్టెన్‌గా పంజాబ్ దే షేర్ జట్టు, జిషు సేన్ గుప్తా కెప్టెన్‌గా బెంగాల్ టైగర్స్, మనోజ్ తివారీ కెప్టెన్‌గా భోజ్‌పురి దబాంగ్స్, కిచ్చ సుదీప్ కెప్టెన్‌గా కర్ణాటక బుల్డోజర్స్, ఉన్ని ముకుందన్ నాయకత్వంలో కేరళ స్ట్రైకర్స్, రితేష్ దేశ్‌ముఖ్ కెప్టెన్సీలో ముంబై హీరోస్, అఖిల్ అక్కినేని కెప్టెన్సీలో తెలుగు వారియర్స్ జట్టు పోటీపడుతున్నాయి.

CCL 2026 Points Table

తొలి వారంలో

గతేడాది ఛాంపియన్ పంజాబ్ దే షేర్ తన సమీప ప్రత్యర్థి కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ జట్టు చేతిలో తెలుగు వారియర్స్ జట్టు ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టు ముంబై హీరోస్ విజయం సాధించంది. ఆ తర్వాత తెలుగు వారియర్స్ జట్టు పంజాబ్ దే షేర్ టీమ్‌పై విజయం సాధించింది. చెన్నై కింగ్స్ జట్టును బెంగాల్ టైగర్స్ ఓడించింది. ముంబై హీరోస్ జట్టుపై కేరళ స్ట్రైకర్స్ జట్టు గెలుపు సాధించింది.

తొలి వారంలో మూడు సంచలనాలను నమోదు అయ్యాయి. రెండు హ్యాట్రిక్స్ నమోదు అయ్యాయి. చెన్నై, బెంగాల్ జట్ల మ్యాచ్‌లో సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. అలాగే అఖిల్ అక్కినేని సెంచరీ సాధించాడు. ఈ వారం అన్ని జట్లు పోటీ తత్వంతో ఆడుతూ తమ అభిమానులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాయి. రెండో వారంలో ఎలాంటి సంచలనాలు నమోదు అవుతాయో వేచి చూడాల్సిందే.

రెండోవారంలో అంటే..
జనవరి 23వ తేదీన.. కేరళ జట్టుతో బెంగాల్ టైగర్స్ జట్టు, కర్ణాటక జట్టుతో తెలుగు వారియర్స్ జట్టు తలపడుతుంది.
జనవరి 24వ తేదీన.. పంజాబ్ దే షేర్ VS భోజ్‌పురి దబాంగ్స్, చెన్నై కింగ్స్ Vs కేరళ స్ట్రైకర్స్ ఆడుతాయి.
జనవరి 25వ తేదీన.. కర్ణాటక బుల్డోజర్స్ Vs భోజ్‌పురి దబాంగ్స్, చెన్నై కింగ్స్ Vs ముంబై హీరోస్ జట్లు అమీతుమీ తేల్చుకొంటాయి.

మూడో వారంలో అంటే..

జనవరి 31వ తేదీన .. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగుతాయి.

ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో జట్టు గెలుపు ఓటముల తర్వాత వివిధ టీమ్‌ల పాయింట్లు ఇలా ఉన్నాయి.
బెంగాల్ జట్టు రెండు మ్యాచులు గెలిచి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వా త ఒక్కో మ్యాచ్ గెలిచిన భోజ్‌పురి, కర్ణాటక, కేరళ స్ట్రైకర్స్, తెలుగు వారియర్స్ జట్టు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

CCL 2026 Points Table

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X