CCL 2026: సీసీఎల్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ.. స్టార్ హీరోలతో ఫ్యాన్స్ క్రికెట్ ఆడే ఛాన్స్.. అవకాశం ఎలా అంటే?

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) ద్వారా దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు చెందిన స్టార్స్ అంతా ఒక చోట చేరి అభిమానులకు క్రికెట్ మజాను అందిస్తున్నారు. జనవరి 16వ తేదీ నుంచి సీసీఎల్ 2026 ప్రారంభమైంది.. ఫిబ్రవరి 1వ తేదీన జరిగే ఫైనల్‌తో సీసీఎల్ 2026 ముగియనుంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు జరగ్గా.. బెంగాల్ టైగర్స్ 2, భోజ్‌పురి దంబాగ్స్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, తెలుగు వారియర్స్ జట్లు ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి. క్రికెట్‌కు ఏమాత్రం తీసిపోకుండా స్టార్స్ అంతా అద్భుతంగా ఆడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లన్నీ మంచి మజాను అందిస్తున్నాయి.

మ్యాచ్‌లకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తమ ఫేవరెట్ స్టార్స్‌తో కలిసి క్రికెట్ ఆడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి సీసీఎల్ నిర్వాహకులు గుడ్‌న్యూస్ చెప్పారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సీసీఎల్‌లో పాల్గొనే అవకాశాన్ని సామాన్యులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీసీఎల్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు రిజిస్ట్రేషన్ ఎలా? ఎంపిక ప్రక్రియ ఎలా? ఎంతమంది సామాన్యులకు స్టార్స్‌తో క్రికెట్ ఆడే ఛాన్స్ ఇస్తారు? అనే దానిపై నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

CCL 2026 Wild Card Initiative How Fans Can Play Cricket with Celebrities Registration Selection Process and Rules

సీసీఎల్ వైల్డ్ కార్డ్ ఇనిషియేటివ్‌లో పాల్గొనాలని అనుకునే వాళ్లు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని తమకు ఇష్టమైన సీసీఎల్ టీమ్‌ను ఎంచుకోవాలి. అనంతరం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగే సీసీఎల్ ట్రయల్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వారి క్రికెట్ స్కిల్స్, ఫిట్‌నెస్, ఇతర అంశాలను పరిశీలిస్తారు. 120 మంది ఆటగాళ్లకు, సీసీఎల్ నటులతో కలిసి కోచింగ్ క్యాంప్స్ జరుగుతాయి. వీరిలో 40 మందికి సీసీఎల్ టీమ్‌లతో పాటు ట్రావెల్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. షార్ట్ లిస్ట్ అయిన 15 మందికి రోటేషన్ పద్ధతిలో సీసీఎల్ మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతిస్తారు. ప్రతి జట్టు ఐదుగురు వైల్డ్ కార్డ్ ప్లేయర్స్‌ను ఎంచుకుని ట్రావెలింగ్ స్క్వాడ్‌లో స్థానం కల్పించాల్సి ఉంటుంది. అలాగే ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకు ప్రతి మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం కల్పిస్తారు. ఎంపిక ప్రక్రియలో తుది నిర్ణయం సీసీఎల్ నిర్వాహకులదే.

సీసీఎల్ వైల్డ్ కార్డ్ ఇనిషియేటివ్ - ప్రశ్నలు, సమాధానాలు (FAQs)
1.సీసీఎల్ వైల్డ్ కార్డ్ ఇనిషియేటివ్ అంటే ఏమిటీ?
సీసీఎల్ వైల్డ్ కార్డ్ ఇనిసియేటివ్ అనేది సామాన్యులకు తమ అభిమాన నటులతో కలిసి సెలబ్రిటి క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందులో రిజిస్ట్రేషన్స్, ట్రయల్స్, కోచింగ్ కాంప్స్, మ్యాచ్‌లో ప్రాతినిథ్యం ఉంటాయి.

2.ఇందుకోసం లక్కీ డ్రా ఏమైనా ఉంటుందా?
సీసీఎల్ వైల్డ్ కార్డ్ ఇనిషియేటివ్‌ కోసం లక్కీ డ్రా లేదా ఫాంటసీ కాంటెస్ట్ లేదు. సీసీఎల్ నిర్వహించే క్రికెట్ ట్రయల్స్, ఇతర పరీక్షల్లో పర్ఫార్మెన్స్‌ను బట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అవకాశం కల్పిస్తారు.

3. ఎవరు ఈ కార్యక్రమానికి రిజస్టర్ చేసుకోవచ్చు?
ఎవరైనా ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఎంపిక ప్రక్రియ, తుది నిర్ణయం మాత్రం సీసీఎల్‌దే.

4. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత?
రిజిస్ట్రేషన్ ఫీజు కింద 1,499 రూపాయలను సీసీఎల్‌కు చెల్లించాలి.

5. రిజిస్ట్రేషన్ ఫీజు రిఫండబులా?
రిజిస్ట్రేషన్ ఫీజు రీఫండబుల్ కాదు.

6. రిజిస్ట్రేషన్ ఫీజును ఏం చేస్తారు?
రిజిస్ట్రేషన్ ఫీజులో 500 రూపాయలను మార్కెటింగ్, ఆపరేషనల్ ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. మరో 999 రూపాయలను సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లోని జట్లకు, సీసీఎల్‌కు రెవెన్యూ షేరింగ్ విధనంలో పంచుతారు.

7. సెలక్షన్ ప్రాసెస్ ఎలా?
సెలక్షన్ ప్రాసెస్‌లో చాలా దశలు ఉన్నాయి

1.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
2.దేశవ్యాప్తంగా సీసీఎల్ ఆధ్వర్యంలో ట్రయల్స్
3.ఒక్కో జట్టు కోసం 15 మంది ప్లేయర్స్‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు
4. జట్లలోని నటులకు, ఆటగాళ్లకు మధ్య కోచింగ్ క్యాంప్స్ నిర్వహిస్తారు
5. ట్రావెలింగ్ స్క్వాడ్ కింద 5గురు ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేస్తారు
6. రొటేషన్ పద్ధతిలో మ్యాచ్‌ ఆడే అవకాశం కల్పిస్తారు.

8. ఒక్కో జట్టుకు ఎంత మంది ప్లేయర్స్‌ను సెలెక్ట్ చేస్తారు?
ఒక్కో జట్టుకు 15 మంది ప్లేయర్స్‌ని సీసీఎల్ షార్ట్ లిస్ట్ చేస్తుంది. వీరిలో నుంచి ఐదుగురు ఆటగాళ్లను ఒక్కో జట్టు ట్రావెలింగ్ స్క్వాడ్ కింద ఎంపిక చేస్తుంది. వీరిలో ఇద్దరిని రొటేషన్ పద్ధతిలో ప్రతి మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం కల్పిస్తారు.

9. వైల్డ్ కార్డ్ ప్లేయర్స్ నిజంగానే సీసీఎల్ మ్యాచ్‌లు ఆడతారా?
అవును. సెలెక్ట్ అయిన వైల్డ్ కార్డ్ ప్లేయర్స్.. అధికారికంగా సీసీఎల్ మ్యాచ్‌లలో భాగం. మ్యాచ్ కండీషన్స్, సేఫ్టీ గైడ్‌లైన్స్ ఆధారంగా ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారు.

10. వైల్డ్ కార్డ్ ప్లేయర్స్‌కి మ్యాచ్ సమయంలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?
ఔను, భద్రతా పరమైన కారణాలు, పోటీని బ్యాలెన్స్ చేయడం తదితర కారణాలతో వైల్డ్ కార్డ్ ప్లేయర్స్‌ కొన్ని గైడ్‌లైన్స్, నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఓవర్లు, బౌలింగ్ పరిమితులను పాటించాల్సి ఉంది. మ్యాచ్‌లో పాల్గొనే వైల్డ్‌కార్డ్ ప్లేయర్స్‌కు ఈ విషయాలపై అవగాహన కల్పిస్తారు.

11. ట్రయల్స్ ఎక్కడ నిర్వహిస్తారు?
ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ జరుగుతాయి. ట్రయల్ జరిగే వేదికలు, షెడ్యూల్ అన్నింటిని రిజిస్టర్ చేసుకున్న వారికి ముందే తెలియజేస్తారు.

12. ఏ జట్టుకు ఆడాలో ఎంపిక చేసుకోవచ్చా?
ఔను, రిజిస్ట్రేషన్ సమయంలో మీకు నచ్చిన జట్టును ఎంపిక చేసుకోవచ్చు. అయితే చివరికి మీరు ఏ జట్టు తరపున ఆడాలో సెలక్షన్ ప్రాసెస్ అనంతరం తెలియనుంది.

13. రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ అవుతామని, మ్యాచ్‌లో పాల్గొంటామని హామీ ఇస్తుందా?
లేదు. నమోదు చేసుకున్నంత మాత్రాన ఎంపికకు హామీ ఉండదు. అన్ని ఎంపికలు.. ఆటగాళ్ల ప్రదర్శన, మూల్యాంకనం, జట్టు అవసరాలపై ఆధారపడి ఉంటాయి.

14. ఎంపికైన ఆటగాళ్లకు ట్రైనింగ్, కోచింగ్ ఇస్తారా?
అవును. షార్ట్ లిస్ట్ అయిన ప్లేయర్స్‌కు సీసీఎల్ జట్టులోని నటులతో పాటు అధికారికంగా కోచింగ్ క్యాంప్స్ నిర్వహిస్తారు.

15. సీసీఎల్‌లో నా జర్నీని చిత్రీకరిస్తారా? బహిరంగంగా పంచుకుంటారా?
అవును. ట్రయల్స్, కోచింగ్ క్యాంపులు, మ్యాచ్‌లను సీసీఎల్ చిత్రీకరించి, వాటిని డిజిటల్, ప్రసార, ప్రచార కంటెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు.

16. నేను క్రమశిక్షణ, ప్రవర్తనా నియమాలను ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుంది?
మైదానంలో లేదా మైదానం వెలుపల క్రమశిక్షణను ఉల్లంఘించినట్లయితే, సీసీఎల్ అభీష్టానుసారం, వైల్డ్ కార్డ్ ఇనిషియేటివ్ నుండి తక్షణమే తొలగించడం జరగవచ్చు.

17. సిసిఎల్ ఈ ప్రక్రియను లేదా నిబంధనలను మార్చగలదా?
అవును. లీగ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అవసరమైతే షెడ్యూల్స్, నియమాలు, వేదికలు, ఎంపిక ప్రక్రియలను సవరించే అధికారం సీసీఎల్‌కు ఉంది.

18. ఎంపికలో తుది నిర్ణయం ఎవరిది?
CCL యాజమాన్యం తీసుకునే అన్ని ఎంపిక, భాగస్వామ్య నిర్ణయాలే అంతిమం. వాటికి కట్టుబడి ఉండాల్సిందే.

19. నేను సీసీఎల్ వైల్డ్ కార్డ్ ఇనిషియేటివ్‌లో ఎందుకు పాల్గొనాలి?

సెలబ్రిటీలతో కలిసి ఆడేందుకు జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అవకాశం
వృత్తిపరమైన శిక్షణ, మ్యాచ్ అనుభవం
జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రచారం
మరచిపోలేని క్రికెట్ ప్రయాణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X