CCL 2023 final భోజ్‌పురి బౌలర్లను చితకబాదిన అఖిల్.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. అక్కినేని కుర్రాడు రికార్డు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL 2023) 2023 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నది. ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్, భోజ్‌పురి దబంగ్స్ జట్ల మధ్య టైటిల్ పోరులో అఖిల్ అక్కినేని కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో భారీ స్కోరును చేసింది. అఖిల్ సుడిగాలి ఇన్సింగ్స్‌తో తెలుగు వారియర్స్ జట్టు తొలి ఇన్సింగ్స్‌లో అధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో అఖిల్ అక్కినేని దూకుడు ఎలా సాగిందంటే?

భోజ్ పురి టీమ్ తొలి ఇన్సింగ్స్
వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ అఖిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొన్నారు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన భోజ్‌పురి దంబాంగ్స్ జట్టు తొలి ఇన్సింగ్స్‌లో 10 ఓవర్లలో 72 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన తెలుగు వారియర్స్ జట్టు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది.

అఖిల్ దూకుడుతో బ్యాటింగ్
తెలుగు వారియర్ జట్టులో ఇన్సింగ్స్‌ను అఖిల్, ప్రిన్స్ ఓపెన్ చేశారు. ప్రిన్స్ ఆరంభంలో అవుటై నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘు అండతో అఖిల్ చెలరేగిపోయాడు. భోజ్‌పురి బౌలర్లను చిత్తు చిత్తుగా బాదాడు. ఫోర్ల కంటే సిక్సర్లు ఎక్కువగా బాదిన అఖిల్ ఆద్యంత ప్రేక్షకులను తన బ్యాటింగ్‌తో అలరించాడు.

సుడిగాలి వేగంతో అర్ధ సెంచరీ
అఖిల్ తన బ్యాటింగ్ తడాఖా చూపించడంతో భోజ్‌పురి బౌలర్లు బేజారెత్తారు. కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 27 బంతుల్లో 54 పరుగుల చేశాడు. వ్యక్తిగత స్కోరు 48 పరుగుల మీద ఉన్న అఖిల్ అక్కినేని సిక్సర్ కొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకొన్నారు. దాంతో స్డేడియం దద్దరల్లిపోయింది. హాఫ్ సెంచరీ తర్వాత అఖిల్ భావోద్వేగానికి లోనయ్యారు. బ్యాట్ ఎత్తి ప్రేక్షకులకు అభివాదం చేశాడు.

సీసీఎల్ 2023లో 400 పరుగులు
అఖిల్ ఫైనల్ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నారు. ఈ లీగ్‌లో 400 పరుగులు పూర్తి చేసుకొన్నారు. చివరకు 32 బంతుల్లో 67 పరుగులు చేసి అవుటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన అఖిల్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో అవుటయ్యారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులకు మంచి జోష్ పంచాడు.

తెలుగు వారియర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో
తెలుగు వారియర్స్ జట్టు తొలి ఇన్సింగ్స్‌ను భారీ స్కోరుతో ముగించింది. నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన జట్టు 104 పరుగులు సాధించింది. తొలి ఇన్సింగ్స్‌లో భోజ్‌పురి జట్టుపై 32 పరుగులు ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్రిన్స్ 10 పరుగులు, రవితేజ సోదరుడు రఘు 13 పరుగులు, రోషన్ 7, అశ్విన్ బాబు 2, తమన్ 2 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications











