CCL 2023 final తెలుగు వారియర్స్, భోజ్‌పురి నువ్వా? నేనా .. వైజాగ్‌లో గెలుపు ఎవ్వరిది? ఉత్కంఠతో ఫైనల్ మ్యాచ్‌!

భారతీయ సినీ తారల పాల్గొంటున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నీ 2023 చివరి దశకు చేరుకొన్నది. గత కొద్దివారాలు క్రికెట్ ఆటలో ప్రొఫెనల్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా యాక్టర్లు మంచి ప్రతిభను చాటుతున్నారు. CCL 2023 ఫైనల్ మ్యాచ్ ఏపీలోని వైజాగ్‌లో కిక్కిరిసిన సినీ అభిమానులు, క్రికెట్ అభిమానుల మధ్య కోలాహాలంగా నడుస్తున్నది. ఫైనల్ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

తెలుగు వారియర్స్ ఫైనల్‌కు ఇలా

తెలుగు వారియర్స్ ఫైనల్‌కు ఇలా


తెలుగు వారియర్స్ జట్టు ఫైనల్‌కు చేరుకొన్న వివరాల్లోకి వెళితే.. కేరళ స్ట్రైకర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్‌ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. మూడో మ్యాచ్‌ను పంజాబ్ దే షేర్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయాన్ని చేజిక్కించుకొన్నది. ఇక క్వార్టర్ ఫైనల్లో చెన్నై రైనోస్ జట్టుపై 20 పరుగులు తేడాతో తెలుగు వారియర్స్ విజయం సాధించింది. ఇక హోరాహోరీగా జరిగిన సెమీ ఫైనల్లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకొన్నది.

భోజ్‌పురి దబాంగ్స్ ఇలా ఫైనల్‌కు

భోజ్‌పురి దబాంగ్స్ ఇలా ఫైనల్‌కు


భోజ్‌పురి దబాంగ్స్ ఫైనల్‌కు చేరిన విషయంలోకి వెళితే.. తొలి మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్ జట్టుపై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో చెన్నై రైనోస్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక మూడో మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టును భోజ్‌పురి జట్టు 5 వికెట్ల తేడాతో ఓడించింది. అలాగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్ జట్టుపై భారీ తేడా అంటే.. 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక సెమిఫైనల్‌లో ముంబై హీరోస్ జట్టుపై 6 వికెట్ల తేడాతో భోజ్‌పురి దంబాంగ్స్ జట్టు విజయం సాధించింది.

 టాస్ గెలిచిన అఖిల్ అక్కినేని

టాస్ గెలిచిన అఖిల్ అక్కినేని


సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 టోర్నీలో అద్బుతమైన ప్రతిభను చాటి వరుసు విజయాలు చేజిక్కించుకొన్న తెలుగు వారియర్స్ జట్టు, భోజ్‌పురి దబాంగ్స్ జట్టు టైటిల్ పోరు బరిలోకి ఉత్సాహంగా దూకాయి. వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ అఖిల్ అక్కినేని టాస్ గెలిచి ఫీల్గింగ్ ఎంచుకొన్నాడు. భోజ్‌పురి దబాంగ్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారీకి బ్యాటింగ్ అప్పగించాడు.

వెంకటేష్, శ్రీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా

వెంకటేష్, శ్రీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా


వైజాగ్‌లో జరుగుతున్న సీసీఎల్ 2023 టోర్నికి తెలుగు సినిమా, భోజ్‌పురి సినిమా ప్రముఖులు భారీగా హాజరయ్యారు. తెలుగు పరిశ్రమకు చెందిన విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. అలాగే భోజ్‌పురి సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా భారీగా హాజరయ్యారు. ఇరు జట్లకు సినీ ప్రముఖులు చీర్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రావడం గమనార్హం.

 తొలి ఇన్సింగ్స్‌లో భోజ్‌పురి

తొలి ఇన్సింగ్స్‌లో భోజ్‌పురి


ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ జట్టు భోజ్‌పురి దబంగ్స్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భోజ్‌పురి జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ మనోజ్ తివారీ 9 పరుగులు, ప్రవేశ్ యాదవ్ 4 పరుగులకే అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఉదయ్ తివారీ 10 పరుగులు, అస్గర్ ఖాన్ 26, అన్షుమన్ సింగ్ 11 పరుగులు, విక్రాంత్ సింగ్ 9 పరుగులు చేశాడు.

 తెలుగు వారియర్స్ తొలి ఇన్నింగ్స్‌లో

తెలుగు వారియర్స్ తొలి ఇన్నింగ్స్‌లో


తెలుగు వారియర్స్ జట్టులో రఘు 2 ఓవర్లు వేసి 10 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకొన్నాడు ప్రిన్స్ 12 పరుగులు ఇచ్చి ఒక వికెట్, టెలివిజన్ నటుడు నందకిషోర్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం గమనార్హం. కడపటి వార్తలు అందేసరికి.. 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి తెలుగు వారియర్స్ జట్టు 49 పరుగులు చేసింది. అఖిల్ 36 పరుగులతో, రఘు 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X