CCL 2024 హైదరాబాద్‌లో సినీ తారల క్రికెట్ లీగ్.. ఎప్పుడు? ఎవరెవరితో మ్యాచ్ అంటే?
దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ హీరోలు పాల్గొనే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 మెల్లమెల్లగా ఊపందుకొంటున్నది. ఇటీవల ఆడిన ప్రారంభమ్యాచ్ ఆస్ట్రేలియాలో ముగిసింది. ఇక హైదరాబాద్ వేదిక మూడు ప్రధాన జట్లు హోరా హోరీ పోరుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లు ఎవరెవరి మధ్య జరుగబోతున్నాయి? వాటి వివరాలు ఏమిటి? మ్యాచ్ చూడాలనుకొనే అభిమానులు టికెట్స్ ఎక్కడ కొనుక్కోవాలనే వివరాల్లోకి వెళితే..
సీసీఎల్ 2024లో జట్లు
2024 సంవత్సరపు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఛాంపియన్ షిప్ పోటీలో బెంగాల్ టైగర్స్, భోజ్‌పూరి దబాంగ్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై హీరోస్ జట్టు, పంజాబ్ షేర్, తెలుగు వారియర్స్ జట్లు పాల్గొంటున్నాయి.

మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు
ఇక హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మూడు భారీ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు కూడా చేపట్టారు. ఈ మ్యాచ్ చూడాలనుకొనే సినీ, క్రికెట్ అభిమానులు Ticketgenie.in వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని లీగ్ నిర్వాహకులు వెల్లడించారు.
అఖిల్ అక్కినేనితో సోనుసూద్ ఫైట్
మార్చి 1వ తేదీన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. హీరో అఖిల్ అక్కినేని కెప్టెన్సీలో తెలుగు వారియర్స్ జట్టుతో కెప్టెన్ సోనుసూద్ టీమ్ పంజాబ్ దే షేర్ జట్టుతో తలపడనున్నది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్ విషయానికి వస్తే.. నటుడు జీవా కెప్టెన్సీలో చెన్నై రైనోస్ జట్టుతో మనోజ్ తివారీ నేతృత్వంలోని భోజ్‌పురి దంబాగ్స్ టీమ్ తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్ 6.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

సల్మాన్ ఖాన్‌తో సుదీప్ కిచ్చ అమీతుమీ
మార్చి 2వ తేదీన కూడా మరో రెండు మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. మొదటి మ్యాచ్‌లో సుదీప్ కిచ్చ కెప్టెన్సీలో కర్ణాటక బుల్డోజర్స్ జట్టు బెంగాల్ టైగర్స్‌తో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. రెండో మ్యాచ్ విషయానికి వస్తే.. తెలుగు వారియర్ష్ జట్టుతో కేరళ వారియర్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ 6.30 గంటలకు జరుగుతుంది.

జీవాతో సుదీప్ కిచ్చ పోటీ
మార్చి 3వ తేదీన కూడా మరో రెండు మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కెప్టెన్సీలో ముంబై హీరోస్ జట్టుతో మనోజ్ తివారీ నాయకత్వంలోని భోజ్‌పురి జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక చెన్నై రైనోస్ జట్టుతో కర్ణాటక బుల్డోజర్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్ర 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications











