CCL 2024 Final Live: కర్ణాటక బుల్డోజర్స్ టార్గెట్ 138.. గెలుపు దిశగా బెంగాల్ టైగర్స్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. హోరాహోరీగా జరుగుతుందని భావిస్తున్న ఈ ఆటలో అమీతుమీ తేల్చుకొనేందుకు కర్ణాటక బుల్డోజర్స్ జట్టు, బెంగాల్ టైగర్స్ జట్టు సిద్దమయ్యాయి. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో జరిగిన పరాభవానికి బెంగాల్ జట్టు ప్రతీకారం తీర్చుకొనేందుకు అస్త్రాలను సిద్దం చేసింది. ఈ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ మీ కోసం..

కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ టైగర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. అయితే తొలి ఓవర్‌లోనే జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. కార్తీక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఉదయ్ కొట్టిన బంతిని కరణ్ క్యాచ్ పట్టడటంతో అవుట్ అయ్యారు. దాంతో స్కోర్ బోర్డుపై 2 పరుగులు ఉండగా తొలి వికెట్ కోల్పోయింది.
బెంగాల్ జట్టుకు 3వ ఓవర్‌లో ఎదురు దెబ్బ తగిలింది. భారీ షాట్లతో ఆడుతున్న రత్నదీప్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. దాంతో 19పరుగుల వద్ద బెంగాల్ జట్టు 2 వికెట్ కోల్పోయింది. కర్నాటక బౌలర్ ప్రదీప్ వికెట్ లభించింది.5 ఓవర్లు పూర్తేయ్యే సరికి బెంగాల్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. జామీ 13 పరుగులతోను, కెప్టెన్ జిషు 6 పరుగలతో ఆడుతున్నారు. రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ను సాధించారు.
6వ ఓవర్‌లో బెంగాల్ జట్టు 19 పరుగులు సాధించింది. రెండు సిక్సర్లు, 1 ఫోర్ బాదారు. దాంతో జట్టు 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. జామీ 16 బంతుల్లో 24 పరుగులతో, జిషు 8 బంతుల్లో 12 పరుగులతో ఆడుతున్నారు.

7వ ఓవర్‌లో 13 పరుగులు సాధించింది. ఒక సిక్సర్ కూడా లభించింది. దాంతో బెంగాల్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. జామీ 36 పరుగులుతో, జామీ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కర్నాటక జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. కర్ణాటక బుల్డోజర్స్ జట్టులో బ్యాట్స్‌మెన్లు భారీగా పరుగులు సాధించారు. కర్ణాటక జట్టు బౌలర్లు విఫలం కావడంతో తొలి ఇన్సింగ్స్‌లో బెంగాల్ జట్టు భారీ స్కోరు చేసింది.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన కర్ణాటక బుల్లోజర్స్ జట్టు బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమయ్యారు. వెంటవెంటనే వికెట్లు పడిపోవడంతో పరుగులు వేగం మందగించింది. నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 86 పరుగులు చేసింది.

కర్ణాటక జట్టుపై 32 పరుగుల ఆధిక్యాన్ని రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బెంగాల్ జట్టు.. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు పెట్టేందుకు సిద్దమవుతున్నది. బెంగాల్ జట్టు 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. జామీ 2 పరుగులతో, రాహుల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు
బెంగాల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించే దిశగా పరుగులు పెడుతున్నది. 8 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. దాంతో కర్ణాటక జట్టుపై 112 పరుగుల అధిక్యం లభించింది.
బెంగాల్ జట్టులో జామీ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకొన్నాడు. కేవలం 16 బంతుల్లో 33 పరుగులు చేయడంతో 9 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. దాంతో 122 పరుగుల ఆధిక్యం లభించింది.
బెంగాల్ జట్టు భారీ స్కోరును కర్ణాటక జట్టు ముందుంచింది. ట్రోఫిని గెలువాలంటే బుల్డోజర్స్ జట్టు 137 పరుగులు చేయాల్సి ఉంటుంది. బెంగాల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 4వ వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. జాయ్ 7 పరుగుల, రాహుల్ 22 పరుగులు, జిషు 14 పరుగులు, జామీ 39 పరుగులు, యూసఫ్ 16 పరుగులు చేశారు.
138 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక జట్టు 2 ఓవర్లు ముగిసే సమయానికి ఓపెనర్లు 24 పరుగులు చేశారు. అయితే నాలుగో ఓవర్‌లో కరణ్ అవుట్ కావడంతో 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కార్తీక్, ప్రతాప్ క్రీజులో ఉన్నారు.

కర్ణాటక జట్టు 62 పరుగుల వద్ద ప్రతాప్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కార్తీక్ కూడా వెంటనే అవుట్ కావడంతో 65 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
6వ ఓవర్‌లో రాజీవ్ అద్బుతంగా సిక్సర్లు కొట్టడంతో మ్యాచ్ గెలుపు తమవైపుకు మళ్లింది. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు, ఎక్స్‌ట్రాలు రావడంతో మొత్తం 30 పరుగులు లభించాయి. కానీ 7వ ఓవర్‌లో బెంగాల్ ఆటగాడు అద్బుతమైన క్యాచ్ పట్టడంతో రాజీవ్ అవుట్ అయ్యాడు.
7వ ఓవర్‌లో రాహుల్ బౌలింగ్‌లో ప్రదీప్ క్లీన్ బౌల్డ్ కావడంతో ఆట మలుపు తిరిగింది. కర్ణాటక బుల్డోజర్స్ జట్టు 18 బంతుల్లో 36 పరుగులు విజయలక్ష్యంగా మారింది. దాంతో 5 వికెట్లు కోల్పోయి 102 పరుగలు చేసింది.
కర్ణాటక బుల్డోజర్స్ టీమ్:
ప్రదీప్ (కెప్టెన్), సుదీప్ కిచ్చ, చందన్ (వికెట్ కీపర్), జయరాం కార్తీక్, కరణ్ ఆర్యన్, రాజీవ్, కృష్ణ, మంజునాథ్ గౌడ, ప్రతాప్, సునీల్ రావు, త్రివిక్రమ్
బెంగాల్ టైగర్స్ జట్టు:
జిషు సేన్‌గుప్తా (కెప్టెన్), బొన్నీ, జామ్మీ, జాయ్, యూసఫ్, సౌరవ్ దాస్ (వికెట్ కీపర్), సత్‌దీప్, తరణ్ దీప్, ఆదిత్య, ఉదయ్, రాహుల్
సినీ, క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం అంటే మార్చి 17వ తేదీన 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం సినీ తారలు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











