CCL 2024 నరాలు తెగె సమరానికి రంగం సిద్దం.. తెలుగు వారియర్స్ లేకుండానే క్రికెట్ యుద్ధం! ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) చివరి అంకానికి చేరుకొన్నది. దేశంలోని సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ హీరోలందరూ తమ భాష తరపున జట్టుగా ఏర్పడి క్రికెట్ టోర్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏ మాత్రం తగ్గకుండా తమ ప్రతిభతో క్రికెటర్లను కూడా అభిమానులుగా మార్చుకొంటున్నారు. తాజాగా సీసీఎల్ 10వ సీజన్ ఫ్లే ఆఫ్ స్టేజ్‌కు చేరుకొన్నది. వచ్చే వారం జరిగే ఈ ఎలిమినేటర్ మ్యాచ్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
సీసీఎల్ 10వ సీజన్‌లో సంచలనాలు నమోదు అయ్యాయి. టైటిల్ ఫేవరేట్స్‌గా మారిన జట్లన్నీ ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందే ఓటమి పాలయ్యారు. మనోజ్ తివారీ నేతృత్వంలోని భోజ్‌పూరి దబంగ్స్, అఖిల్ అక్కినేని కెప్టెన్సీలో తెలుగు వారియర్స్, కేరళ స్టైకర్స్, సోనుసూద్ నేతృత్వంలోని పంజాబ్ దే షేర్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరకుండానే ఓడిపోయారు.

ప్రస్తుతం టైటిల్ రేసులో సుదీప్ కిచ్చ కెప్టెన్సీలో కర్ణాటక బుల్టోజర్స్, చెన్నై రైనోస్, ముంబై హీరోస్ టీమ్, బెంగాల్ టైగర్ జట్టు ఉన్నాయి. సీసీఎల్ 10 కప్ గెలుచుకోవడానికి నువ్వా నేనా అనే విధంగా మ్యాచ్‌లు ఆడటానికి అన్ని జట్టు రెడీ అవుతున్నాయి. ఈ టోర్ని ముగింపు షెడ్యూల్ ఈ కింది విధంగా ఉన్నది.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా తొలి తుది ఎలిమినేటర్ మ్యాచ్ చెన్నై రైనోస్, ముంబై హీరోస్ జట్ల మధ్య జరుగనున్నది. ఈ మ్యాచ్ మార్చి 15వ తేదీన జరుగుతుంది. అలాగే మార్చి 15వ తేదీన కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్ జట్ల మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతుంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేత జట్టుతో క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో పరాజయం పొందిన జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత క్వాలిఫయర్ మ్యాచ్ 1 విజేత, క్వాలిఫయర్ మ్యాచ్ 2 విజేత జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మార్చి 17వ తేదీన జరుగుతుంది.
త్రివేండ్రంలో జరిగే ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్‌ను జీ సినిమా, సోనీ స్పోర్ట్స్ 5 ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అయితే తెలుగు వారియర్స్ లేకుండానే తుది యుద్దం జరగడం తెలుగు సినీ, క్రికెట్ అభిమానులకు నిరాశకు గురిచేస్తున్నది. అయితే క్వార్టర్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు మాత్రం నరాలు తెగే ఉత్కంఠను రేపడం ఖాయమని సినీ, క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











