CCL 2025 : చెన్నైకి చెమటలు పట్టించిన భోజ్‌పురి దబాంగ్స్ .. నరాల తెగే పోరులో రైనోస్ గెలుపు

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025) ఉత్కంఠభరితంగా సాగుతోంది. సినీతారలు క్రీడాకారుల్లా తలపడుతూ విజయం కోసం చెమటలు చిందిస్తున్నారు. ఇప్పటికే తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఈ వారంతో నాకౌట్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ఇప్పటికే బెంగల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు సెమీస్ బెర్త్‌లు కన్ఫర్మ్ చేసుకోగా.. మిగిలిన 5 జట్లలో ముంబై హీరోస్ ప్రయాణం ఎప్పుడో ముగిసింది. దీంతో నాలుగు జట్లు సెమీస్ కోసం పోరాడుతున్నాయి. ఫిబ్రవరి 22న సూరత్ వేదికగా చెన్నై రైనోస్ - భోజ్‌పురి దబాంగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచారు? ఎవరు సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నారో చూస్తే :

తొలుత భోజ్‌పురీ దబాంగ్స్ కెప్టెన్ మనోజ్ తివారీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన చెన్నైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రమణ 10 పరుగులకే ఔట్ అయ్యాడు. అయితే శరణ్ , విక్రాంత్‌లు భోజ్‌పురి జట్టుకు ఏమాత్రం సంతోషాన్ని మిగల్చలేదు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పవర్‌ప్లేలోనే 50 పరుగులు దాటించారు.

Celebrity Cricket League CCL 2025 Season 11 Chennai Rhinos vs Bhojpuri Dabanggs match report scores Points Table

ప్రమాదకరంగా మారుతున్న ఈ జట్టును ఆదిత్య విడదీశాడు. 35 పరుగులు చేసిన శరణ్‌ పాయింట్‌లో పర్వేష్‌లాల్‌కి చిక్కాడు. ఆ కాసేపటికే గాయం కారణంగా పృథ్వీ మైదానాన్ని విడాడు దీంతో విక్రాంత్, దాశరథీలు విరవిహారం మొదలైంది. 10వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లతో చెన్నై రైనోస్ 29 పరుగులు పిండుకుంది. మొత్తంగా చెన్నై రైనోస్ తన తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో భారీలోకి దిగిన భోజ్‌పురి దబాంగ్స్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 3 పరుగుల వ్యధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. పర్వేష్ లాల్ , అస్గర్‌ ఖాన్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న దలో జట్టు స్కోరు 41 పరుగుల వద్ద అస్గర్ ఖాన్ ఔట్ అయ్యాడు . ఆ కాసేపటికే పర్వేష్ కూడా ఔట్ కావడంతో దబాంగ్స్ 55 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఉదయ్ తివారీ, సుధీర్ సింగ్‌లు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా నడిపించారు. ఆ దశలో భోజ్‌పురి దబాంగ్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నైకి 65 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నైని తొలి ఓవర్‌లోనే గట్టి దెబ్బ కొట్టింది భోజ్‌పురి దబాంగ్స్ తొలి ఓవర్‌లోనే పృథ్వీ (6), కలై (0)లను అస్గర్ ఖాన్ ఔట్ చేశాడు. అనంతరం విక్రాంత్ (24) , అజయ్‌ (17), శరణ్ (19), పరి (17)లు ధాటిగా ఆడటంతో నిర్ణీత 10 ఓవర్లలో చెన్నై రైనోస్ 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసి భోజ్‌పురి దబాంగ్స్ ముందు 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Celebrity Cricket League CCL 2025 Season 11 Chennai Rhinos vs Bhojpuri Dabanggs match report scores Points Table

168 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భోజ్‌పురి దబాంగ్స్‌‌కు ఉదయ్ (21), అస్గర్ ఖాన్ (10)లు మెరుపు ఇన్నింగ్స్ అందించారు. మంచి ఊపు మీదున్న దశలో వీరిద్దరూ ఔట్ కావడంతో దబాంగ్స్‌‌కు షాక్ తగిలింది. తర్వాత వచ్చిన కెప్టెన్ మనోజ్ తివారీ రిటైర్డ్ హర్ట్ కాగా.. దినేష్ లాల్ యాదవ్‌ను విక్రాంత్ బోల్తా కొట్టించడంతో భోజ్‌పురి జట్టు పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అన్షుమాన్ రాకతో సీన్ మారిపోయింది.

వచ్చి రావడంతో ఫోర్లు , సిక్సర్లో విరుచుకుపడ్డ అన్షుమన్ 27 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. ఇతనికి ఆదిత్య (21) కూడా చక్కని సహకారం అందించినప్పటికీ చేతిలో బంతులు లేకపోవడంతో ఓటమి తప్పలేదు. నిర్ణీత 10 ఓవర్‌లలో భోజ్‌పురి దబాంగ్స్ 4 వికెట్లు కోల్పోయి 150 పరుగుల చేసింది. దీంతో చెన్నై రైనోస్ జట్టు 17 పరుగులతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X