CCL 2025 LIVE: చెన్నైకి మరో షాక్ .. ఎదురే లేని కర్ణాటక, సుదీప్ సేన ఖాతాలో సెకండ్ విక్టరీ

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2025 (సీసీఎల్ 2025) సినీ, క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. ఫిబ్రవరి 8న ఈ మెగా ఈవెంట్ ప్రారంభమవ్వగా.. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు జరగ్గా బెంగాల్ టైగర్స్ 2 మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత కర్ణాటక బుల్డోజర్స్, భోజ్‌పురి దబాంగ్ తలో మ్యాచ్ గెలిచాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, పంజాబ్ షేర్స్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు.

ఫిబ్రవరి 14న కర్ణాటక బుల్డోజర్స్ - చెన్నై రైనోస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సుదీప్ సేనతో ఆర్య జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటాలని కర్ణాటక.. విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని చెన్నై భావిస్తున్నాయి. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

Celebrity Cricket League CCL 2025 Season 11 Chennai Rhinos Vs Karnataka Bulldozers Today live updates scores Points Table and highlights in telugu

LIVE Feed
  • Feb 14, 2025 6:41 PM

    కర్ణాటక బుల్డోజర్స్ విజయం

    సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా చెన్నై రైనోస్ - కర్ణాటక బుల్డోజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక కేవలం 6.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సుదీప్ సేన వరుసగా రెండో విజయాన్ని, ఆర్య జట్టు వరుసగా రెండో ఓటమిని తమ ఖాతాలో వేసుకున్నాయి.

  • Feb 14, 2025 6:20 PM

    కర్ణాటక విలవిల

    చెన్నై రైనోస్ - కర్ణాటక బుల్డోజర్స్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. 70 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కర్ణాటకను చెన్నై కట్టడి చేస్తోంది. కిచ్చా సుదీప్ ఔట్ కావడంతో కర్ణాటక 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

  • Feb 14, 2025 5:53 PM

    కర్ణాటక బుల్డోజర్స్ టార్గెట్ 70 పరుగులు

    కర్ణాటకపై 28 పరుగులు వెనుకబడ్డ చెన్నై తన రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి సుదీప్ సేన ముందు 70 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అజయ్ 14, శరణ్ 4, కలై 24, విక్రాంత్ 8, పృథ్వీ 30, దాశరథి 4, పరి 2, ఆధవ్ 7 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో సునీల్ 2, గణేష్ , చందన్, రాజీవ్‌లు తలో వికెట్ పడగొట్టారు.

  • Feb 14, 2025 5:25 PM

    రెండుసార్లు తప్పించుకుని మూడోసారి బలి

    చెన్నై రైనోస్ ఆటగాడు కలై రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 6వ ఓవర్‌లో చందన్ బౌలింగ్‌లో ఒకసారి క్యాచ్ ఇవ్వగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డ్ వదిలేశాడు. ఆ మరుసటి బాల్‌కి స్టంపింగ్ చేసే అవకాశాన్ని కెప్టెన్ సుదీప్ నేలపాలు చేశాడు. అయితే ఆ వెంటనే సునీల్ బౌలింగ్‌లో కలై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 24 పరుగులు చేశాడు కలై.

  • Feb 14, 2025 5:02 PM

    3 ఓవర్లకు 30 పరుగులు

    రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై రైనోస్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం అజయ్, కలైలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. 3 ఓవర్లలో 30 పరుగులు చేసిన చెన్నై లీడింగ్‌లోకి వచ్చింది.

  • Feb 14, 2025 4:31 PM

    ముగిసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్.. చెన్నైపై ఆధిక్యం

    109 పరుగుల టార్గెట్‌తో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కర్ణాటక బుల్డోజర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. తద్వారా చెన్నైపై 34 పరుగుల తొలి ఇన్నింగ్స్ సాధించింది సుదీప్ సేన. ఓపెనర్లు కృష్ణ, రాజీవ్‌లు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటు ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్‌గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కృష్ణ. కేవలం 23 బంతుల్లోనే కృష్ణ 50 పరుగులు చేయడం విశేషం. రాజీవ్ 11, చందన్ 15, కరణ్ 44, మంజునాథ్ 1, కార్తీక్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో అధవ్ 2, కలై, భరత్‌లు తలో వికెట్ పడగొట్టగా.. దాశరథి మొత్తం నాలుగు క్యాచ్‌లు పట్టుకున్నాడు.

  • Feb 14, 2025 3:34 PM

    కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగిన రాజీవ్ ఔట్

    లక్ష్యఛేదనలో కర్ణాటకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దూకుడు మీదున్న రాజీవ్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి జట్టు స్కోరు 24 పరుగుల వద్ద ఉండగా బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు

  • Feb 14, 2025 3:26 PM

    లక్ష్యఛేదనకు దిగిన కర్ణాటక

    109 పరుగుల టార్గెట్‌తో కర్ణాటక బుల్డోజర్స్ తన తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కర్ణాటక ఇన్నింగ్స్‌ను రాజీవ్ , కృష్ణలు ఆరంభించగా.. శరణ్ తొలి ఓవర్ వేయగా ఈ ఓవర్‌లో పరుగులు వచ్చాయి. రాజీవ్ 11 , కృష్ణ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 14, 2025 3:13 PM

    ముగిసిన చెన్నై తొలి ఇన్నింగ్స్

    చెన్నై రైనోస్ - కర్ణాటక బుల్డోజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 108 పరుగులతో తన తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. రమణ 18, విక్రాంత్ 27, పృథ్వీ 27, శరణ్ 17 (నాటౌట్), దశరథ్ 2, అజయ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్స్‌లో చందన్ రెండు వికెట్లు, గణేష్ ఒక వికెట్ పడగొట్టారు.

  • Feb 14, 2025 2:52 PM

    పృథ్వీ ఔట్

    చెన్నై రైనోస్‌కు మరో షాక్ తగిలింది. వరుస సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన పృథ్వీ జట్టు స్కోరు 76 పరుగుల వద్ద చందన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద రాజీవ్‌కు చిక్కాడు. 10 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో పృథ్వీ 27 పరుగులు చేశాడు.

  • Feb 14, 2025 2:49 PM

    విక్రాంత్ రిటైర్డ్ హర్ట్

    దూకుడు మీదున్న చెన్నై రైనోస్‌కు గట్టి షాక్ తగిలింది. జోరు మీదున్న విక్రాంత్‌కు తోడ కండరాలు పట్టేయడంతో జట్టు స్కోరు 76 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 16 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో విక్రాంత్ 27 పరుగులు చేశాడు.

  • Feb 14, 2025 2:39 PM

    రమణ క్లీన్ బౌల్డ్

    చెన్నై రైనోస్ తొలి వికెట్ కోల్పోయింది. జోరు మీదున్న రమణను 5వ ఓవర్‌లో 44 పరుగుల వద్ద చందన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో రమణ 18 పరుగులు చేశాడు.

  • Feb 14, 2025 2:30 PM

    హ్యాట్రిక్ బౌండరీలు బాదిన విక్రాంత్

    అనూప్ వేసిన నాలుగో ఓవర్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ విక్రాంత్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో చెన్నై జట్టుకు 16 పరుగులు వచ్చాయి. విక్రాంత్ 24 పరుగులతో , రమణ 15 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • Feb 14, 2025 2:25 PM

    3 ఓవర్లకు 24 పరుగులు

    కర్ణాటక బుల్డోజర్స్ - చెన్నై రైనోస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 3 ఓవర్లు ముగిసేసరికి చెన్నై .. 24 పరుగులు చేసింది. రమణ 14, విక్రాంత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 14, 2025 2:20 PM

    రమణగాడి వీరబాదుడు

    కర్ణాటక బుల్డోజర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో చెన్నై రైనోస్‌కు బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. అయితే కార్తీక్ వేసిన రెండో ఓవర్‌లో రమణ చితక్కొట్టాడు.. ఒక ఫోర్ , ఒక సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు

  • Feb 14, 2025 2:10 PM

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

    సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా కర్ణాటక బుల్డోజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై రైనోస్ కెప్టెన్ ఆర్య అశోక్ సెల్వన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. రమణ , విక్రాంత్‌లు చెన్నై తరపున ఓపెనింగ్‌కు రాగా.. సునీల్ తొలి ఓవర్ వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X