CCL 2025: విక్రాంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. హోంగ్రౌండ్‌లో కర్ణాటకకు భంగపాటు, ఫైనల్లో చెన్నై రైనోస్!
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మార్చి 2తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ఈ సీజన్‌లో ఛాంపియన్‌గా ఎవరు నిలనున్నారోనని సినీ , క్రీడా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మైసూర్‌లో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో బెంగాల్ టైగర్స్‌పై పంజాబ్ దే షేర్ విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ వెంటనే సెకండ్ ఫైనలిస్ట్ కోసం కర్ణాటక బుల్డోజర్స్ - చెన్నై రైనోస్ జట్లు తలపడ్డాయి. మరి ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధించారు? ఏ జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టిందో చూస్తే :
తొలుత టాస్ గెలిచిన చెన్నై రైనోస్ కెప్టెన్ ఆర్య ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక బుల్డోజర్స్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందజేశారు. కృష్ణ , రాజీవ్‌లు ఫోర్లు, సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. 5.4 ఓవర్‌లో 60 పరుగుల వద్ద కృష్ణను ఆధవ్ ఔట్ చేశాడు. అయితే రాజీవ్ మాత్రం తన జోరు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ దశలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రాజీవ్ మరింత ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు. మొత్తంగా కర్ణాటక బుల్డోజర్స్ తన నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కర్ణాటక బ్యాట్స్‌మెన్‌లలో కృష్ణ 25, చందన్ 3, రాజీవ్ 53, బచ్చన్ 6 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో కలై 2, అధవ్ 1 వికెట్ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రమణను సునీల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే విక్రాంత్ ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అతనికి దశరథ్, పృథ్వీల నుంచి చక్కని సహకారం లభించింది. దీంతో చెన్నై రైనోస్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 105 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా కర్ణాటకకు 6 పరుగుల ఆధిక్యం లభించింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో రమణ 0, పృథ్వీ 17, విక్రాంత్ 63, దశరథ్ 15 పరుగులు చేశారు. బుల్డోజర్స్ బౌలర్లలో సునీల్ , చందన్ తలో వికెట్ పడగొట్టారు.
6 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కర్ణాటక బుల్డోజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బచ్చన్‌ను అధవ్ ఔట్ చేశాడు. అయితే కార్తీక్, కెప్టెన్ సుదీప్, కృష్ణలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివరిలో శరణ్ వరుస బంతుల్లో రాజీవ్, కృష్ణ వికెట్లను పడగొట్టడంతో కర్ణాటక ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. అయితే మంజునాథ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు.
దీంతో నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసిన కర్ణాటక బుల్డోజర్.. చెన్నై రైనోస్ ముందు 129 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కర్ణాటక బ్యాట్స్‌మెన్‌లలో బచ్చన్ 3, కార్తీక్ 26, సుదీప్ 23, కృష్ణ 28, రాజీవ్ 0, మంజునాథ్ 35 పరుగులు చేశారు. చెన్నై రైనోస్ బౌలర్లలో శరణ్ 2, భరత్, అధవ్, విక్రాంత్‌లు తలో వికెట్ పడగొట్టారు.
130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై రైనోస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాజీవ్ వరుస బంతుల్లో స్టార్ బ్యాటర్లు శరణ్, శంతనులను పెవిలియన్‌కు పంపాడు. ఆ కాసేపటికే పృథ్వీ కూడా ఔట్ కావడంతో చెన్నై కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విక్రాంత్, అజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌కు చక్కదిద్దాడు. ముఖ్యంగా విక్రాంత్ తన విధ్వంసర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను కర్ణాటక నుంచి లాగేసుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో లక్ష్యాన్ని కరిగించాడు. అతనికి అజయ్ చక్కని సహకరం అందించడంతో చెన్నై విజయం దిశగా సాగిపోయింది.
మొత్తంగా కర్ణాటక నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 9.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో శరణ్ 0, శంతను 0, పృథ్వీ 7, అజయ్ 65, విక్రాంత్ 50 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో రాజీవ్ 2, కృష్ణ 1 వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో మార్చి 2న జరగనున్న సీసీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ దే షేర్‌తో చెన్నై రైనోస్ తలపడనుంది. మరి ఈ సీజన్ ఛాంపియన్‌గా ఎవరు నిలవనున్నారో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











