CCL 2025 LIVE: అఖిల్ సిక్సర్ల హోరు.. నరాలు తెంచిన చివరి బంతి, బెంగాల్‌దే గెలుపు

సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్ 2025)లో భాగంగా ఈరోజు మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 23న సూరత్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో బలమైన బెంగాల్ టైగర్స్‌తో తెలుగు వారియర్స్ తలపడనుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిచిన బెంగాల్ జట్టు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. మరి ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో తెలుగు జట్టు సెమీఫైనల్‌లో అడుగుపెట్టేది లేనిది ఫిబ్రవరి 23తో తేలిపోనుంది. దీంతో ఏం జరుగుంది? ఏ జట్టు సెమీఫైనల్‌కు వెళ్తుందనేది ఉత్కంఠగా మారింది.

Celebrity Cricket League CCL 2025 Season 11 Telugu Warriors vs Bengal Tigers Today live updates scores Points Table and highlights in telugu

LIVE Feed
  • Feb 23, 2025 6:41 PM

    సీసీఎల్ 2025లో ముగిసిన తెలుగు వారియర్స్ పోరాటం

    సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025)లో తెలుగు వారియర్స్ పోరాటం ముగిసింది. బెంగాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో అఖిల్ సేన ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెంగాల్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని 91 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టు ఓటమిని తప్పించలేకపోయాడు.

  • Feb 23, 2025 6:21 PM

    ఆరో వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్

    తెలుగు వారియర్స్ ఆరో వికెట్ కోల్పోయింది . పరుగు కోసం ప్రయత్నించిన హరీష్‌ను జమ్మీ రనౌట్ చేశాడు

  • Feb 23, 2025 6:18 PM

    అఖిల్ అర్ధశతకం

    తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని అర్ధ శతకం సాధించాడు. 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అఖిల్ 52 పరుగులు చేశాడు.

  • Feb 23, 2025 6:15 PM

    సచిన్ ఔట్

    తెలుగు వారియర్స్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. రత్నదీప్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ముందుకొచ్చిన సచిన్ జోషిని సౌరవ్ స్టంప్ ఔట్ చేశాడు. 6 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో సచిన్ 12 పరుగులు చేశాడు

  • Feb 23, 2025 5:55 PM

    మూడో వికెట్ కోల్పోయిన అఖిల్ సేన

    తెలుగు వారియర్స్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. క్రీజులో కుదురుకున్న థమన్ .. ఆదిత్య బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద యూసఫ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో థమన్ 18 పరుగులు చేశాడు.

  • Feb 23, 2025 5:38 PM

    అశ్విన్ , సామ్రాట్ డకౌట్

    తెలుగు వారియర్స్‌కు తొలి దెబ్బ తగిలింది. స్కోరు బోర్డును పెంచే క్రమంలో ఉదయ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన అశ్విన్ బాబు (0) .. యూసఫ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన సామ్రాట్‌ (0) కూడా యూసఫ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు

  • Feb 23, 2025 5:33 PM

    థమన్ వీరబాదుడు

    148 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తెలుగు వారియర్స్‌కు థమన్ మంచి ఆరంభం ఇచ్చాడు. దీంతో తెలుగు జట్టు తొలి ఓవర్‌లో 11 పరుగులు చేసింది.

  • Feb 23, 2025 5:21 PM

    తెలుగు వారియర్స్ లక్ష్యం 148

    బెంగాల్ టైగర్స్ తన రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి తెలుగు వారియర్స్ ముందు 148 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఉదయ్ 19, రాహుల్ 18, ఆదిత్య 2, జమ్మీ 54, యూసుఫ్ 31 పరుగులు చేశారు. తెలుగు బౌలర్స్‌లో సామ్రాట్, ఆది, సాంబలు తలో వికెట్ పడగొట్టారు.

  • Feb 23, 2025 5:16 PM

    జమ్మీ అర్ధ శతకం

    తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన జమ్మీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు

  • Feb 23, 2025 5:01 PM

    నిలకడగా ఆడుతోన్న బెంగాల్ బ్యాట్స్‌మెన్లు

    3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును జమ్మీ (18), యూసఫ్ 15 (15) ఆదుకున్నారు. ప్రస్తుతం బెంగాల్ టైగర్స్ 7 ఓవర్లలో 73 పరుగులు చేసి 92 పరుగుల లీడ్‌లో ఉంది.

  • Feb 23, 2025 4:46 PM

    మూడో వికెట్ కోల్పోయిన బెంగాల్

    బెంగాల్ టైగర్స్ మూడో వికెట్ కోల్పోయింది. మంచి ఊపు మీదున్న రాహుల్‌ .. ఆది బౌలింగ్‌లో వికెట్ కీపర్ హరీష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో రాహుల్ 18 పరుగులు చేశాడు.

  • Feb 23, 2025 4:38 PM

    రెండో వికెట్ కోల్పోయిన బెంగాల్

    బెంగాల్ టైగర్స్‌ను సాంబ గట్టి దెబ్బ కొట్టాడు. 33 పరుగుల వద్ద రెండు పరుగులు చేసిన ఆదిత్య బెనర్జీని క్లీన్ బౌల్డ్ చేశాడు.

  • Feb 23, 2025 4:33 PM

    సచిన్ అద్భుత క్యాచ్

    బెంగాల్ టైగర్స్ తొలి వికెట్ కోల్పోయింది. సామ్రాట్ బౌలింగ్‌లో సచిన్ జోషి పట్టిన క్యాచ్‌తో ఉదయ్ వెనుదిరిగాడు. 10 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో ఉదయ్ 19 పరుగులు చేశారు

  • Feb 23, 2025 4:26 PM

    కట్టుదిట్టంగా తెలుగు వారియర్స్

    తెలుగు వారియర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో బెంగాల్ టైగర్స్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడుతోంది. రెండు ఓవర్లు ముగిసేసరికి బెంగాల్ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. ఉదయ్ 11, రాహుల్ 5 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

  • Feb 23, 2025 4:10 PM

    బెంగాల్ టైగర్స్ జట్టుకు 19 పరుగులు ఆధిక్యం

    తెలుగు వారియర్స్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. దాంతో బెంగాల్ టైగర్స్ జట్టుకు 19 పరుగులు ఆధిక్యం లభించింది. అశ్విన్ బాబు అత్యధికంగా 32 పరుగులు చేశాడు.

  • Feb 23, 2025 4:05 PM

    5 వికెట్లు కోల్పోయి 74 పరుగులు

    తెలుగు వారియర్స్ జట్టు 9 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. అశ్విన్ 19 పరుగులతో, సామ్రాట్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ కంటే 32 రన్స్ వెనకబడి ఉంది.

  • Feb 23, 2025 3:54 PM

    4వ వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్

    4వ వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్.. భారీ షాట్‌కు ప్రయత్నించిన తమన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆయన స్థానంలో సాంబా క్రీజులోకి వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సమయానికి 67 పరుగులు చేసింది.

  • Feb 23, 2025 3:51 PM

    7 ఓవర్లు పూర్తయ్యే సరికి

    7 ఓవర్లు పూర్తయ్యే సరికి తెలుగు వారియర్స్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. థమన్ 13, అశ్విన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ కంటే ఇంకా 42 పరుగులు వెనకబడి ఉంది.

  • Feb 23, 2025 3:38 PM

    3వ వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్

    మూడో వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్.. థమన్ బ్యాటింగ్ ఎంట్రీ.. 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసిన అఖిల్ సేన.

  • Feb 23, 2025 3:31 PM

    సచిన్ వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్

    తెలుగు వారియర్స్ జట్టు పరుగులు సాధించడంలో తడబాటు పడుతున్నది. సచిన్ రూపంలో టీమ్ రెండో వికెట్ కోల్పోయింది. దాంతో 4 ఓవర్లలో 29 పరుగులు చేసింది. ఆదర్శ్, అశ్విన్ క్రీజులో ఉన్నారు.

  • Feb 23, 2025 3:24 PM

    2 ఓవర్లలో 17 రన్స్

    తెలుగు వారియర్స్ జట్టు 2 ఓవర్లలో 17 రన్స్ చేసింది. అఖిల్ వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. ప్రస్తుతం సచిన్ 10 పరుగులతోను, ఆదర్శ్ 5 పరుగులతోను ఆడుతున్నారు.

  • Feb 23, 2025 3:16 PM

    కెప్టెన్ అఖిల్ అక్కినేని క్లీన్ బౌల్డ్

    కెప్టెన్ అఖిల్ అక్కినేని క్లీన్ బౌల్డ్.. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్. 1 వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.సచిన్ 5 పరుగులతో, ఆదర్శ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

  • Feb 23, 2025 3:10 PM

    35 బంతుల్లో 78 రన్స్

    బెంగాల్ ఆటగాడు జామీ వేగంగా 35 బంతుల్లో 78 రన్స్ చేశాడు. బోని 5, జిషు సేన్ 14, రాహుల్ 6 పరుగులు చేశారు. దాంతో 2 వికెట్లు 106 పరుగులు చేసింది.

  • Feb 23, 2025 3:03 PM

    10 ఓవర్లలో బెంగాల్ 106 రన్స్

    10వ ఓవర్‌లో తెలుగు వారియర్స్ జట్టు భారీగా రన్స్ సమర్పించుకొన్నది. అశ్విన్ బౌలింగ్‌లో వచ్చిన క్యాచులను ఫీల్డర్లు జార విడిచారు. దాంతో జామీ విజృంభించి బ్యాటింగ్ చేయడంతో బెంగాల్ జట్టు 16 పరుగులు సాధించింది. దాంతో నిర్ణీత పది ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది.

  • Feb 23, 2025 2:32 PM

    5వ ఓవర్ ముగిసే సమయానికి

    సాంబా 4 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకోవడంతో బెంగాల్ జట్టు 45 పరుగులు చేసింది. జామీ 38 పరుగులు, జిషు 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 23, 2025 2:27 PM

    తొలి వికెట్ కోల్పోయిన బెంగాల్

    సాంబా వేసిన 5వ ఓవర్ తొలి బంతికి బెంగాల్ తొలి వికెట్ కోల్పోయింది. బోని 5 పరుగులు చేసి అవుటయ్యాడు. బోని స్థానంలో కెప్టెన్ జిషు సేన్ గుప్తా బ్యాటింగ్‌కు దిగాడు.

  • Feb 23, 2025 2:24 PM

    4వ ఓవర్‌ను అశ్విన్ బాబు

    4వ ఓవర్‌ను అశ్విన్ బాబు ప్రారంభించాడు. జామీ ధాటిగా ఆడటంతో 2 ఫోర్లతోసహా 11 పరుగులు లభించాయి. దాంతో బెంగాల్ జట్టు వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. జామీ 36 పరుగులు, బోని 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 23, 2025 2:19 PM

    3 ఓవర్లు ముగిసే సమయానికి..

    బెంగాల్ టైగర్స్ జట్టు 3 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. జామీ 27 పరుగులతోను, బానీ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 23, 2025 2:18 PM

    జామీ క్యాచ్ జార విడిచిన సచిన్

    తెలుగు వారియర్ జట్టు ఓనర్, ఆటగాడు సచిన్ జోషి బెంగాల్ ఆటగాడు జామీ క్యాచ్ జార విడిచారు. దాంతో బెంగాల్‌కు మంచి అవకాశం లభించింది.

  • Feb 23, 2025 2:16 PM

    రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు

    ఆది వేసిన రెండో ఓవర్‌లో రెండు పరుగులు సహా 13 పరుగులు రాబట్టింది బెంగాల్ జట్టు. జమ్మీ ఫోర్లతో ఎదురుదాడికి దిగాడు.

  • Feb 23, 2025 2:09 PM

    కట్టుదిట్టంగా రఘు బౌలింగ్

    తొలి ఓవర్ రఘు వేయగా.. జమ్మీ, బోనీలు బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించారు. రఘు లైన్ అండ్ లెగ్త్‌తో బౌలింగ్ చేయడంతో తొలి ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి.

  • Feb 23, 2025 2:04 PM

    బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్

    తెలుగు వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ టైగర్స్ జట్టు కెప్టెన్ జిషుసేన్ గుప్తా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

More from Filmibeat

Read more about: ccl telugu warriors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X