CCL 2025 LIVE : తెలుగు వారియర్స్‌కు షాక్.. బోణీ కొట్టిన చెన్నై రైనోస్

సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్ 2025)లో భాగంగా ఈరోజు మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తెలుగు వారియర్స్ - చెన్నై రైనోస్ జట్లు తలపడుతున్నాయి. టోర్నీలో ఒక మ్యాచ్ గెలిచి ఖాతా ఓపెన్ చేసిన తెలుగు వారియర్స్ మంచి ఊపులో ఉంది. అటు వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై జట్టు పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. హోంగ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్ కావడంతో హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చే అంశం.

Celebrity Cricket League CCL 2025 Season 11 Telugu Warriors vs Chennai Rhinos Today live updates scores Points Table and highlights in telugu

LIVE Feed
  • Feb 16, 2025 12:38 AM

    తెలుగు టీంపై 25 పరుగుల తేడాతో చెన్నై గెలుపు

    సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025)లో తెలుగు వారియర్స్‌పై చెన్నై రైనోస్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తెలుగు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. తెలుగు వారియర్స్‌ బ్యాట్స్‌మెన్స్‌లో రోషన్ 6, అశ్విన్ బాబు 2, సామ్రాట్ 0, సాంబ 10, అఖిల్ 27, ఆదర్శ్ 11, సచిన్ 27, రఘు 6 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో శరణ్ 2, ఆధవ్ , భరత్, కలైలు తలో వికెట్ పడగొట్టారు.

  • Feb 16, 2025 12:18 AM

    6వ వికెట్ కోల్పోయిన తెలుగు టీం

    తెలుగు వారియర్స్ తడబడుతోంది. స్కోరును పెంచే క్రమంలో కలై బౌలింగ్‌లో ఆదర్శ్ భారీ షాట్ కొట్టగా.. బౌండరీ లైన్ వద్ద భరత్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. 6 బంతుల్లో 1 ఫోర్ సాయంతో తెలుగు వారియర్స్ 11 పరుగులు చేసింది.

  • Feb 16, 2025 12:08 AM

    అఖిల్ ఔట్

    తెలుగు వారియర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని .. శరణ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద పృథ్వీకి చిక్కాడు. 14 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో అఖిల్ 27 పరుగులు చేశాడు.

  • Feb 16, 2025 12:01 AM

    సామ్రాట్ డకౌట్

    తెలుగు వారియర్స్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. జట్టు స్కోరు 36 పరుగుల వద్ద సామ్రాట్ (0) రనౌట్ అయ్యాడు. దీంతో భారమంతా కెప్టెన్ అఖిల్ అక్కినేని మీద పడింది

  • Feb 15, 2025 11:51 PM

    సాంబ ఔట్

    తెలుగు వారియర్స్‌కు గట్టి షాక్ తగిలింది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఉండగా శరణ్ బౌలింగ్‌లో సాంబ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో సాంబ 10 పరుగులు చేశాడు

  • Feb 15, 2025 11:42 PM

    అశ్విన్ బాబు ఔట్

    తెలుగు వారియర్స్‌ మరో వికెట్ కోల్పోయింది . జట్టు స్కోరు 8 పరుగుల వద్ద ఉండగా ప్రేమిస్తే భరత్ బౌలింగ్‌లో అశ్విన్ బాబు (2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

  • Feb 15, 2025 11:37 PM

    తొలి వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్

    115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లో రోషన్ ఔట్ అయ్యాడు.

  • Feb 15, 2025 11:12 PM

    ముగిసిన చెన్నై సెకండ్ ఇన్నింగ్స్

    తెలుగు వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై రైనోస్ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసి.. అఖిల్ సేన ముందు 115 పరుగుల లక్ష్యం ఉంచింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో పృథ్వీ 31, అజయ్ 25, శంతను 7, దాశరథి 4, విక్రాంత్ 8, పరి 0, శరణ్ 0, రమణ 1, కలై 5 (నాటౌట్), ఆధవ్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. తెలుగు బౌలర్లలో ఆది 3, సాంబ, సచిన్, సామ్రాట్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు

  • Feb 15, 2025 10:41 PM

    శరణ్ డకౌట్

    తెలుగు వారియర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆది బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడిన శరణ్ బౌండరీ లైన్ వద్ద అశ్విన్ బాబుకు చిక్కి డకౌట్‌గా వెనుదిరిగాడు

  • Feb 15, 2025 10:39 PM

    దాశరథి ఔట్

    చెన్నై రైనోస్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. ప్రమాదకర దాశరథి (4)ని సామ్రాట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 78 పరుగులకు చెన్నై 4 వికెట్లు కోల్పోయింది.

  • Feb 15, 2025 10:31 PM

    మూడో వికెట్ కోల్పోయిన చెన్నై

    చెన్నై రైనోస్ మూడో వికెట్ కోల్పోయింది. సచిన్ బౌలింగ్‌లో భారీ షాట్ ప్రయత్నించిన శంతను (7) బౌండరీ లైన్ వద్ద అశ్విన్ బాబుకు చిక్కాడు.

  • Feb 15, 2025 10:22 PM

    రెండో వికెట్ కోల్పోయిన ఆర్య జట్టు

    చెన్నై రైనోస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఊపు మీదున్న పృథ్వీ .. సాంబ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో పృథ్వీ 31 పరుగులు చేశాడు

  • Feb 15, 2025 10:16 PM

    తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

    చెన్నై రైనోస్‌ తొలి వికెట్ కోల్పోయింది. మంచి ఊపులో ఉన్న దశలో ఓపెనర్ అజయ్ రోహన్ అనవసర పరుగుకి ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజయ్ 25 పరుగులు చేశాడు.

  • Feb 15, 2025 9:59 PM

    సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై

    చెన్నై రైనోస్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. తెలుగు వారియర్స్ కట్టుదిట్టంగా బంతులు వేస్తూ కట్టడి చేస్తున్నారు . రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై 17 పరుగులు చేయగా.. పృథ్వీ 6, అజయ్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 15, 2025 9:44 PM

    ముగిసిన తెలుగు వారియర్స్ తొలి ఇన్నింగ్స్

    చెన్నై రైనోస్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ తన తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 6 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై జట్టుకు 20 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తెలుగు బ్యాట్స్‌మెన్లలో అఖిల్ 1, సచిన్ 18, ఆదర్శ్ 0, అశ్విన్ బాబు 4, రోషన్ 73 (నాటౌట్), సామ్రాట్ 3, ప్రిన్స్ 0, రఘు 1 (నాటౌట్) పరుగులు చేశారు. చెన్నై రైనోస్ బౌలర్లలో శరణ్ 3, కలై, ఆధవ్, పరిలు తలో వికెట్ పడగొట్టారు.

  • Feb 15, 2025 9:29 PM

    రోషన్ హాఫ్ సెంచరీ

    రోషన్ మేకా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రేమిస్తే భరత్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 25 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

  • Feb 15, 2025 9:20 PM

    ఐదో వికెట్ కోల్పోయిన అఖిల్ టీమ్

    అఖిల్ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 68 పరుగుల వద్ద సామ్రాట్ (3) భారీ షాట్‌కు ప్రయత్నించి దాశరథికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో రోషన్ మేకాపైనే భారం పడింది.

  • Feb 15, 2025 9:13 PM

    నాలుగో వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్

    తెలుగు వారియర్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 58 పరుగుల వద్ద సచిన్ జోషి (18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోషన్‌తో కలిసి సచిన్ ఆదుకున్నాడు

  • Feb 15, 2025 9:06 PM

    50 పరుగులు పూర్తి చేసుకున్న తెలుగు వారియర్స్

    తెలుగు వారియర్స్ 50 పరుగుల మార్క్‌ను చేరుకుంది. ప్రేమిస్తే భరత్ వేసిన 4.5 ఓవర్లలో సిక్సర్ ద్వారా రోషన్ మేకా జట్టు స్కోరును 50 పరుగులు దాటించాడు.

  • Feb 15, 2025 8:52 PM

    3వ వికెట్ కోల్పోయిన తెలుగు వారియర్స్

    తెలుగు వారియర్స్‌ను చెన్నై బౌలర్ శరణ్ గట్టి దెబ్బకొట్టాడు. కీలకమైన అశ్విన్ బాబు (4) భారీ షాట్‌‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద దాశరథికి చిక్కాడు. 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తెలుగు వారియర్స్ కష్టాల్లో పడింది.

  • Feb 15, 2025 8:41 PM

    తొలి ఓవర్‌లోనే అఖిల్, ఆదర్శ్ ఔట్

    తెలుగు వారియర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే కెప్టెన్ అఖిల్ అక్కినేని 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు. ఆ వెంటనే ఆదర్శ్ కూడా భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • Feb 15, 2025 8:32 PM

    ముగిసిన చెన్నై తొలి ఇన్నింగ్స్

    సీసీఎల్ 2025లో భాగంగా తెలుగు వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్న రైనోస్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును విక్రాంత్ , దాశరథి ఆదుకున్నారు. వీరిద్దరూ సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చెన్నై బ్యాట్స్‌మెన్లలో రమణ 10, విక్రాంత్ 61, శరణ్ 0, అజయ్ 12, దాశరథి 35 పరుగులు చేశారు. తెలుగు వారియర్స్ బౌలర్లలో రఘు 2, సామ్రాట్ ఒక వికెట్ పడగొట్టారు.

  • Feb 15, 2025 8:18 PM

    చెన్నై @100

    తెలుగు వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై రైనోస్ 100 పరుగుల మార్క్ దాటింది. సామ్రాట్ వేసిన 8. ఓవర్‌లో దాశరథి సిక్స్ కొట్టడంతో జట్టు స్కోరు 102కు చేరుకుంది. విక్రాంత్ 59, దాశరథి 16 పరుగులతోనూ క్రీజ్‌లో ఉన్నారు.

  • Feb 15, 2025 8:07 PM

    విక్రాంత్ హాఫ్ సెంచరీ

    చెన్నై రైనోస్ ఆటగాడు విక్రాంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సాంబ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఫిఫ్టీ అందుకున్నాడు. 20 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు విక్రాంత్.

  • Feb 15, 2025 8:07 PM

    మూడో వికెట్ కోల్పోయిన చెన్నై

    క్రీజులో కుదురుకున్నాడని అనుకున్న అజయ్ (12) ఔట్ అయ్యాడు. జట్టు స్కోరు 77 పరుగుల వద్ద సామ్రాట్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన అజయ్ బౌండరీ లైన్ వద్ద ప్రిన్స్‌కి చిక్కాడు.

  • Feb 15, 2025 7:58 PM

    50 పరుగులు పూర్తి చేసుకున్న చెన్నై

    తెలుగు వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై రైనోస్ 50 పరుగులు పూర్తి చేసుకుంది. సచిన్ జోషి వేసిన 4.3 ఓవర్‌లో విక్రాంత్ సిక్సర్ కొట్టడంతో చెన్నై 50 పరుగుల మార్క్ దాటింది. విక్రాంత్ 36 పరుగులు, అజయ్ 7 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • Feb 15, 2025 7:32 PM

    రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై

    విక్రాంత్, రమణలు చెన్నై ఇన్నింగ్స్ ప్రారంభించగా రఘు వేసిన తొలి ఓవర్‌లోనే ఆ జట్టుకు షాక్ తగిలింది. స్ట్రోక్ ప్లేయర్ రమణ 10 పరుగులు చేసి అఖిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే వచ్చిన శరణ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు.

  • Feb 15, 2025 7:25 PM

    గ్రౌండ్‌లో సందడి చేసిన అక్కినేని నాగచైతన్య

    సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్ 2025)లో భాగంగా తెలుగు వారియర్స్‌ - చెన్నై రైనోస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు టాలీవుడ్ హీరో నాగచైతన్య హాజరయ్యారు. తన తమ్ముడికి క్రికెట్ అంటే ప్యాషన్ అని.. బాగా ఆడతాడని ప్రశంసించాడు.

  • Feb 15, 2025 7:20 PM

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

    సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్ 2025)లో భాగంగా తెలుగు వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై రైనోస్ జట్టు కెప్టెన్ ఆర్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X