CCL 2025: పరువు తీసుకొన్న తెలుగు వారియర్స్ .. సెమీస్‌కి చేరిందెవరు? ఇంటికి వెళ్లిన జట్లు ఏవి?

సెలబ్రెటీ క్రికెట్ లీడ్ (సీసీఎల్ 2025) సినీ, క్రీడా అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్‌లు సాగుతూ .. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఏమాత్రం తగ్గని రేంజ్‌లో పోరాడారు తారలు. ఈ ఆదివారంతో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల దశ ముగిసింది. మరి సెమీఫైనల్ ఏయే జట్లు వెళ్లాయి? ఎవరెవరు ఇంటికి వెళ్లారు? ఒకసారి పరిశీలిస్తే.

ఫిబ్రవరి 8న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఏడాది సీసీఎల్‌ ఆరంభమైంది. నాటి నుంచి అన్ని జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే అన్ని కళ్లు అఖిల్ అక్కినేని సారథ్యంలోని తెలుగు వారియర్స్ మీదే. నాలుగు సార్లు ఈ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచింది తెలుగు జట్టు. ఈసారి కూడా గెలిచి ఐదోసారి కప్ అందుకోవాలని అఖిల్ సేన అందుకుంది. కానీ పేలవమైన ప్రదర్శనతో తెలుగు జట్టు పరువు పొగొట్టుకుంది. ఏ ఒక్కరూ తమ స్థాయికి తగ్గ ఆటను ఆడకుండా జట్టుకు చేటు చేశారు.

Celebrity Cricket League - CCL 2025 Which teams have entered the semi-finals

తొలి మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో అఖిల్ సేన చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌తో తెలుగు వారియర్స్ తలపడింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అఖిల్ సేన చెమటోడ్చి గెలిచింది. ఫాంలోకి వచ్చారు అనుకునే లోపు చెన్నై రైనోస్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ దారుణంగా చిత్తయ్యింది. 108 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన తెలుగు జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోటీ ఇవ్వలేక మరో ఓటమిని మూటకట్టుకుంది.

ఇక ఫిబ్రవరి 23వ తేదీన సూరత్‌లో బెంగాల్ టైగర్స్‌తో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనూ తడబడింది. టాస్ ఓడిపోవడంతో మొదలైన అఖిల్ సేన కష్టాలు చివరి వరకు కొనసాగాయి. చెత్త ఫీల్డింగ్, బ్యాటింగ్‌, బౌలింగ్‌తో తెలుగు వారియర్స్ చిత్తు చిత్తుగా ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ కంటే 19 పరుగులు వెనుకబడిన అఖిల్ జట్టు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్ధిని కంట్రోల్ చేయలేకపోయింది. దీంతో 148 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో తెలుగు బ్యాట్స్‌మెన్లు నిర్లక్ష్యంగా ఆడారు. కెప్టెన్ అఖిల్ అక్కినేని ఒంటరి పోరాటంతో 90కి పరుగులు చేసినా చేతిలో బంతులు లేకపోవడంతో తెలుగు వారియర్స్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Celebrity Cricket League - CCL 2025 Which teams have entered the semi-finals

ఈ టోర్నీలో సెమీస్‌కి వెళ్లిన.. ఇంటికి వెళ్లిన జట్లను పరిశీలిస్తే.. బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, చెన్నై రైనోస్, పంజాబ్ దే షేర్ జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్లగా.. భోజ్‌పురి దబాంగ్స్, తెలుగు వారియర్స్, ముంబై హీరోస్ జట్లు ఇంటి ముఖం పట్టాయి. భోజ్‌పురి దబాంగ్స్ నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచి ఖచ్చితంగా సెమీస్‌కు వెళ్తుందని అంతా అనుకున్నారు. అయితే పంజాబ్ దే షేర్ అనూహ్య విజయంతో పాటు మెరుగైన రన్‌రేట్‌తో దబాంగ్స్‌కి షాకిచ్చింది. మార్చి 1న జరిగే తొలి సెమీ ఫైనల్స్‌లో బెంగాల్ టైగర్స్‌తో పంజాబ్ దే షేర్ తలపడనుండగా.. అదే రోజు సాయంత్రం జరిగే రెండో సెమీ ఫైనల్స్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో చెన్నై రైనోస్ తలపడనుంది. మార్చి 2న మైసూర్‌లో ఫైనల్ జరగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X