CCL 2026 Live: కర్ణాటక బుల్డోజర్స్ దూకుడు.. 8 వికెట్లు కోల్పోయిన బెంగాల్ టైగర్స్

భారతీయ సినిమా పరిశ్రమలోని ప్రధాన భాషల్లో రాణిస్తున్న సినీ రంగాలకు చెందిన హీరోలు, నటులు, సాంకేతిక నిపుణులతో కూడిన క్రికెట్ జట్లు కలిసి ఆడుతున్న టోర్ని సెలబ్రిటీ క్రికెట్ లీగ్. CCL 2026 టోర్నీలో మొత్తం 8 భాషలకు చెందిన సినీ పరిశ్రమ కళాకారులు పాల్గొంటారు. 2011 సంవత్సరంలో మొదలైన ఈ టోర్ని కరోనా సమయంలో మినహాయిస్తే.. దాదాపు నిర్విరామంగా సాగుతున్నది. ఇప్పటి వరకు తెలుగు వారియర్స్ 2015, 2016, 2017, 2023 సంవత్సరంలో కప్‌ గెలుచుకొన్నది. ఈ టోర్నీలో అత్యధికంగా నాలుగు సార్లు టైటిల్ గెలుచుకోగా, ఆ తర్వాత చెన్నై రెండుసార్లు, కర్ణాటక రెండుసార్లు, బెంగాల్ ఒకసారి, ముంబై, పంజాబ్ చేరోసారి టైటిల్ గెలిచాయి.

2026 సంవత్సరంలో జరిగే టోర్నీ కోసం అన్ని జట్లు సర్వసిద్దమయ్యాయి. జనవరి 16 నుంచి 18వ తేదీ వరకు ఈ పోటీలు వైజాగ్‌లోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, వైజాగ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఆ తర్వాత మధురై, మైసూర్, హైదరాబాద్‌లో జరుగుతాయి అని నిర్వాహకులు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ టోర్నీలోని మ్యాచుల ఎక్స్‌క్లూజివ్ కవరేజ్ మీ కోసం..

Celebrity Cricket League 2026 Live CCL 2026 Live Telugu Warrior Scoreboard CCL Ball to Ball Match Report Karnataka Bulldozers Live Scores Chennai Rhinos Live Updates Mumbai Heroes Kerala Strikers Bhojpuri Dabanggs Bengal Tigers

LIVE Feed
  • Feb 1, 2026 8:22 PM

    కష్టాల్లో బెంగాల్ టైగర్స్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా కర్ణాటక బుల్డోజర్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కర్ణాటక దెబ్బకు 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి బెంగాల్ జట్టు 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇంద్రాశిష్ 2, ఆనంద 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Feb 1, 2026 7:39 PM

    3 వికెట్లు కోల్పోయిన బెంగాల్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో (సీసీఎల్) 2026లో భాగంగా కర్ణాటక బుల్డోజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ బుల్డోజర్స్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నిర్ణీత 10 ఓవర్లలో బెంగాల్ జట్టు 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. జాయ్ 34 పరుగులు, రాహుల్ 1 పరుగులు చేశారు.

  • Feb 1, 2026 6:36 PM

    బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్ టైగర్స్

    సీసీఎల్ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో బెంగాల్ టైగర్స్ - కర్ణాటక బుల్డోజర్స్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ కెప్టెన్ జిషుసేన్ గుప్తా బ్యాటింగ్ ఎంచుకున్నారు.

  • Feb 1, 2026 5:58 PM

    CCL 2026 Final: Karnataka Bulldozers vs Bengal Tigers

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026 తుది అంకానికి చేరుకుంది. కోయంబత్తూరులో జరుగుతున్న ఫైనల్‌లో బెంగాల్ టైగర్స్‌తో కర్ణాటక బుల్డోజర్స్ తలపడనుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఒక్కసారిగా ఓడిపోలేదు. 12 ఏళ్లుగా కర్ణాటక కప్ కోసం ఎదురుచూస్తోంది.. అటు బెంగాల్ మూడేళ్ల నాటి ఫీట్‌ను రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. బలాబలాల్లో ఇరు జట్లు సమానంగా ఉండటంతో సీసీఎల్ 2026 ఫైనల్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

  • Jan 31, 2026 9:22 PM

    చెన్నై కింగ్స్ ఆలౌట్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో చెన్నై కింగ్స్‌తో కర్ణాటక బుల్డోజర్స్ తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై కింగ్స్ జట్టు 19.5 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో రమణ 2, విక్రాంత్ 66, శంతను 5, పృథ్వీ 0, శరణ్ 9, సత్య ఎన్‌జే 0, అశోక్ 12, అధవ్ 31, దశరాథి 12, పారి 9 పరుగులు చేయగా, భరత్ 1 నాటౌట్‌గా నిలిచాడు. కర్ణాటక బుల్డోజర్స్ బౌలర్లలో సచిన్ 3, చందన్ 2, కరణ్ 2, ప్రతాప్, డార్లింగ్ కృష్ణలు తలో వికెట్ పడగొట్టారు.

  • Jan 31, 2026 7:07 PM

    Vels Chennai Kings vs Karnataka Bulldozers

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో వేల్స్ చెన్నై కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 1వ తేదీన బెంగాల్ టైగర్స్‌తో జరగనున్న ఫైనల్‌లో తలపడనుంది. మరి చెన్నై, కర్ణాటకలలో ఎవరు సెమీఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెడతారో చూడాలి. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ విక్రాంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • Jan 31, 2026 6:41 PM

    తొలి సెమీఫైనల్‌లో బెంగాల్ టైగర్స్ విజయం

    సెలబ్రిటి క్రికెట్ లీగ్‌ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో జనవరి 31వ తేదీన నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌లో కేరళ స్ట్రైకర్స్‌పై 5 వికెట్ల తేడాతో బెంగాల్ టైగర్స్ ఘన విజయం సాధించింది. కేరళ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించి సీసీఎల్ 2026 ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. బెంగాల్ టైగర్స్ బ్యాట్స్‌మెన్‌లలో జాయ్ 18, ఇంద్రాశిస్ 0, జామ్మీ 64, ఉదయ్ 6, యూసుఫ్ 10 పరుగులు, జిషుసేన్ 23 నాటౌట్, రాహుల్ మజుందార్ 40 నాటౌట్‌‌గా నిలిచారు. కేరళ బౌలర్లలో వివేక్, ఉన్నీ, మొహమ్మద్, బినేష్, అరుణ్‌లు తలో వికెట్ పడగొట్టారు

  • Jan 31, 2026 5:02 PM

    50 పరుగులు దాటిన బెంగాల్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్) 2026 లో భాగంగా కోయంబత్తూరులో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో కేరళ స్ట్రైకర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బెంగాల్ టైగర్స్ రంగంలోకి దిగింది. అయితే ఆదిలోనే జట్టు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి 54 పరుగులు చేసింది. ఉదయ్ 5, జామ్మీ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 31, 2026 4:11 PM

    ముగిసిన కేరళ ఇన్నింగ్స్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో బెంగాల్ టైగర్స్‌తో కేరళ స్ట్రైకర్స్‌ తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు.. నిర్ణీత 20 ఓవర్‌లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కేరళ బ్యాట్స్‌మెన్‌లలో ఉన్ని ముకుందన్ 41, అర్జున్ 61, జీన్ 0, మదన్ 28, ఆర్యన్ 10, వివేక్ 11 నాటౌట్, అరుణ్ 14, మొహమ్మద్ 4 నాటౌట్‌గా నిలిచారు. బెంగాల్ బౌలర్లలో జమ్మీ 3, ఆదిత్య 2, రాహుల్ ఒక వికెట్ పడగొట్టారు. బెంగాల్ ఫైనల్ చేరాలంటే 178 పరుగులు చేయాల్సి ఉంది.

  • Jan 31, 2026 3:29 PM

    మదన్ ఔట్.. బెంగాల్ శిబిరంలో సంబరాలు

    సీసీఎల్ 2026లో భాగంగా కోయంబత్తూరులో జరుగుతున్న కేరళ స్ట్రైకర్స్ - బెంగాల్ టైగర్స్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌లో కేరళ స్ట్రైకర్స్ 125 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. బెంగాల్ బౌలర్ జామ్మీ దెబ్బకు కేరళ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు

  • Jan 31, 2026 2:06 PM

    టాస్ గెలిచిన బెంగాల్ టైగర్స్

    సీసీఎల్ 2026లో కోయంబత్తూరులో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో భాగంగా కేరళ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ కెప్టెన్ జిషుసేన్ గుప్తా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

  • Jan 31, 2026 1:55 PM

    Kerala Strikers vs Bengal Tigers

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026 తుది అంకానికి చేరుకుంది. జనవరి 31వ తేదీ నుంచి సెమీఫైనల్స్ జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌తో బెంగాల్ టైగర్స్‌తో తలపడనుంది. బెంగాల్ టైగర్స్‌ ఇప్పటి వరకు ఆడిన ఏ మ్యాచ్ ఓడిపోలేదు. అలాంటి జట్టును కేరళ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.

  • Jan 25, 2026 7:43 PM

    బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై కింగ్స్

    సీసీఎల్ 2026లో భాగంగా ముంబై హీరోస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ విక్రాంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వచ్చి రావడంతోనే విక్రాంత్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 3 ఓవర్లు ముగిసేసరికి చెన్నై కింగ్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. విక్రాంత్ 38 పరుగులు, రమణ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 25, 2026 7:20 PM

    Vels Chennai Kings vs Mumbai Heroes

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో జనవరి 25వ తేదీన జరగనున్న మ్యాచ్‌లో ముంబై హీరోతో.. వేల్స్ చెన్నై కింగ్స్ తలపడనుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండు ఓటములతో నిలిచిన ముంబై, చెన్నై జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుండటంతో ఈ మ్యాచ్‌ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

  • Jan 25, 2026 7:10 PM

    భోజ్‌పురి దబాంగ్స్ ఓటమి

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో కర్ణాటక బుల్డోజర్స్ ఆధిపత్యం కొనసాగించి సెమీస్‌లో అడుగుపెట్టిన జట్టుగా నిలిచింది. కోయంబత్తూరులో భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో కర్ణాటక 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుల్డోజర్స్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దబాంగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. మనోజ్ తివారీ 10, అన్షుమన్ 1, టైగర్ 7, ఆదిత్య 34, ఉదయ్ 36, రాజీవ్ 38, మన్మోహన్ 9, అస్గర్ 16, సుధీర్ 1, దినేష్ 1, రోహిత్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కర్ణాటక బౌలర్లలో సునీల్ 2, కార్తీక్ 1, మంజునాథ్ 2, కరణ్ 2, అర్జున్ 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు

  • Jan 25, 2026 5:18 PM

    3 వికెట్లు కోల్పోయిన భోజ్‌పురి దబాంగ్స్

    సీసీఎల్‌లో భాగంగా కోయంబత్తూరులో జరుగుతున్న మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ తడబడుతోంది. కర్ణాటక బుల్డోజర్స్ వెంట వెంటనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి దబాంగ్స్ 3 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఉదయ్ 7, ఆదిత్య 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 25, 2026 4:24 PM

    దబాంగ్స్ టార్గెట్ 203 పరుగులు

    సెలబ్రిటి క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా జనవరి 25వ తేదీన కోయంబత్తూరులో భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. డార్లింగ్ కృష్ణ 53, సుదీప్ 26, రాజీవ్ 62, మంజునాథ్ 12, కరణ్ 21 చందన్ 9, నిరూప్ 5, కార్తీక్ 1, అర్జున్ 1 పరుగు చేయగా.. సునీల్ 0 నాటౌట్, సచిన్ 4 నాటౌట్‌గా నిలిచారు. భోజ్‌పురి బౌలర్లలో అస్గర్ , ఆదిత్యలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఉదయ్ 1 వికెట్ తీశారు. కర్ణాటక బౌలర్లలో నలుగురు బ్యాట్స్‌మెన్లు రన్ఔట్ కావడం గమనార్హం. భోజ్‌పురి దబాంగ్స్ విజయం సాధించాలంలో 203 పరుగులు సాధించాల్సి ఉంది.

  • Jan 25, 2026 2:12 PM

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక

    సీసీఎల్ 2026లో భాగంగా భోజ్‌పురి దబాంగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ కెప్టెన్ కిచ్చా సుదీప్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • Jan 25, 2026 1:43 PM

    Karnataka Bulldozers vs Bhojpuri Dabanggs

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా ఆదివారం కోయంబత్తూరులో జరగనున్న మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో భోజ్‌పురి దబాంగ్స్ ఢీకొట్టనుంది. లీగ్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన కర్ణాటక మంచి ఊపులో ఉండగా... ఒక విజయం, ఒక ఓటమితో సెమీస్ ఆశలు నిలుపుకోవాలనే లక్ష్యంతో భోజ్‌పురి దబాంగ్స్ నిలిచాయి. దాంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

  • Jan 24, 2026 8:18 PM

    చెన్నై టార్గెట్ 166 పరుగులు

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా చెన్నై కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్ తడబడింది. చేజేతులా భారీ స్కోర్ సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. 17.4 ఓవర్‌లలో 165 పరుగులకు ఆలౌటైంది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పాటు వెంట వెంటనే ఒత్తిడిలోకి నెట్టడంతో కేరళ ఒత్తిడికి చిత్తయ్యింది. కెప్టెన్ ఉన్ని ముకుందన్ 27, అర్జున్ 49, జీన్ 1, వివేక్ 1, ప్రశాంత్ 21, మదన్ 27, మణికుట్టన్ 1, బినేష్ 0, ఆర్యన్ 9 నాటౌట్, అరుణ్ 12, సమర్థ 0 పరుగులు మాత్రమే చేయగలిగారు. చెన్నై బౌలర్లలో విక్రాంత్ 2, భరత్, అశోక్, శరణ్ తలో వికెట్ పడగొట్టగా అధవ్ 3 వికెట్లు తీశాడు.

  • Jan 24, 2026 7:02 PM

    3 వికెట్లు కోల్పోయిన కేరళ

    సీసీఎల్‌లో భాగంగా చెన్నై కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత కెప్టెన్ ఉన్ని ముకుందన్ వికెట్ పొగొట్టుకున్న కేరళకు ఆ కాసేపటికే విక్రాంత్ షాకిచ్చాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన జీన్ లాల్ ఒక్క పరుగుకే అధవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ వెంటనే వివేక్ గోపన్ కూడా ఒక్క పరుగు చేసి అధవ్‌కి క్యాచ్ ఇచ్చాడు.

  • Jan 24, 2026 6:35 PM

    బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

    సీసీఎల్ 2026లో భాగంగా కోయంబత్తూరులో కేరళ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ విక్రాంత్ బౌలింగ్ ఎంచుకున్నారు.

  • Jan 24, 2026 6:31 PM

    Chennai Kings vs Kerala Strikers

    సెలబ్రిటి క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో జనవరి 24వ తేదీ జరగనున్న మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌తో చెన్నై కింగ్స్ తలపడనుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒక ఓటమి, ఒక విజయంతో కేరళ జట్టు తన సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని కేరళ స్ట్రైకర్స్ భావిస్తోంది. అటు చెన్నై జట్టు ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడిపోవడంతో తర్వాత జరిగే రెండు మ్యాచ్‌లలో గెలవాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

  • Jan 24, 2026 6:15 PM

    పంజాబ్ ఘన విజయం

    సీసీఎల్ 2026లో భాగంగా కోయంబత్తూరులో జరిగిన మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌పై పంజాబ్ దే షేర్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దబాంగ్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 11.1 ఓవర్‌లలో 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

  • Jan 24, 2026 4:32 PM

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

    మనోజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన బబ్బాల్ రాయ్... 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శుభ్‌కు దొరికిపోయాడు. దీంతో పంజాబ్ 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

  • Jan 24, 2026 4:03 PM

    పంజాబ్ టార్గెట్ 172

    సీసీఎల్‌లో భాగంగా పంజాబ్ దే షేర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారీ 52, టైగర్ 7, ఆదిత్య 63 , అన్షుమన్ 15, అస్గర్‌ 23 నాటౌట్ చేశారు. పంజాబ్ బౌలర్లలో జెస్సీ, దక్ష్ సింగ్, హర్డీ సంధూ, అనూజ్‌లు తలో వికెట్ పడగొట్టారు.

  • Jan 24, 2026 3:21 PM

    మనోజ్ తివారీ ఔట్

    సెలబ్రిటి క్రికెట్ లీగ్‌లో భాగంగా పంజాబ్ దే షేర్‌తో జరిగిన మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ రెండు వికెట్లు కోల్పోయింది. మంచి ఊపు మీదున్న కెప్టెన్ మనోజ్ తివారి 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసి ఆ వెంటనే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భోజ్‌పురి దబాంగ్స్ 14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 120 పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆదిత్య 52 పరుగులు, అస్గర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 24, 2026 2:44 PM

    50 పరుగులు దాటిన దబాంగ్స్

    సీసీఎల్ 2026లో భాగంగా కోయంబత్తూరులో పంజాబ్ దే షేర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి ఈ జట్టు 50 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారీ 24 పరుగులు, ఆదిత్య 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 24, 2026 2:06 PM

    బ్యాటింగ్ ఎంచుకున్న భోజ్‌పురి దబాంగ్స్

    సీసీఎల్ 2026లో భాగంగా పంజాబ్‌ దే షేర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భోజ్‌పురి దబాంగ్స్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • Jan 24, 2026 1:52 PM

    Punjab De Sher vs Bhojpuri Dabanggss

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా జనవరి 24వ తేదీన కోయంబత్తూరులో జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్‌తో భోజ్‌పురి దబాంగ్స్ తలపడనుంది. ఆడిన ఒక్క మ్యాచ్‌లో గెలిచిన భోజ్‌పురి టీమ్ మంచి ఊపులో ఉండగా... పంజాబ్ దే షేర్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది.

  • Jan 23, 2026 8:50 PM

    కర్ణాటక బుల్డోజర్స్ టార్గెట్ 227

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా కోయంబత్తూరులో కర్ణాటక బుల్డోజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అశ్విన్ బాబు 132, అఖిల్ 44, ప్రిన్స్ 17, థమన్ 4, వినయ్ 4, సామ్రాట్ రెడ్డి 1 (నాటౌట్)గా నిలిచారు. కర్ణాటక బుల్డోజర్స్‌ బౌలర్లలో చందన్, అరుణ్, ప్రదీప్, కరణ్‌లు తలో వికెట్ పడగొట్టారు. తెలుగు వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో 24 పరుగులు వచ్చాయి. కర్ణాటక విజయం సాధించాలంటే 227 పరుగులు సాధించాల్సి ఉంది.

  • Jan 23, 2026 8:29 PM

    అశ్విన్ బాబు సెంచరీ

    సీసీఎల్ 2026లో భాగంగా కర్ణాటక బుల్డోజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఓపెనర్ అశ్విన్ బాబు సెంచరీ చేశాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అతను శతకం సాధించాడు. ప్రస్తుతం తెలుగు వారియర్స్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

  • Jan 23, 2026 7:50 PM

    అఖిల్ అక్కినేని ఔట్

    సీసీఎల్ 2026లో భాగంగా కర్ణాటక బుల్డోజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌ తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకరంగా మారుతున్న అఖిల్‌ను (44) 12వ ఓవర్‌లో చందన్ ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దాంతో 103 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం అశ్విన్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు

  • Jan 23, 2026 7:22 PM

    50 పరుగులు దాటిన అఖిల్ సేన

    సీసీఎల్ 2026లో భాగంగా కోయంబత్తూరులో కర్ణాటక బుల్లోజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు 7 ఓవర్లలో 50 పరుగుల మార్క్ దాటింది. అఖిల్ అక్కినేని 18, అశ్విన్ బాబు 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 23, 2026 6:42 PM

    బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక బుల్డోజర్స్

    సీసీఎల్‌ 2026లో భాగంగా తెలుగు వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక బుల్డోజర్స్ కెప్టెన్ కిచ్చా సుదీప్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

  • Jan 23, 2026 6:38 PM

    Telugu Warriors vs Karnataka Bulldozers

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కోయంబత్తూరులో జనవరి 23న కర్ణాటక బుల్డోజర్స్‌తో తెలుగు వారియర్స్ జట్టు తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లో ఒక్కటి మాత్రమే గెలిచిన అఖిల్ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అటు ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచిన కర్ణాటక జట్టు ఇందులోనూ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది. దాంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

  • Jan 23, 2026 6:31 PM

    కేరళ ఆశలు ఆవిరి.. సెమీస్‌కు బెంగాల్ టైగర్స్

    సీసీఎల్ 2026లో భాగంగా కోయంబత్తూరులో కేరళ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టు 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ 19.2 ఓవర్‌లలో 164 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో బెంగాల్ జట్టు సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది.

  • Jan 23, 2026 5:33 PM

    కేరళ జట్టు గెలవాలంటే?

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా కేరళ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ పట్టు బిగిస్తోంది. కేరళ జట్టు 15 ఓవర్‌లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేరళ స్ట్రైకర్స్ విజయం సాధించడంతో 24 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి ఉంది.

  • Jan 23, 2026 5:03 PM

    కష్టాల్లో కేరళ స్ట్రైకర్స్

    కేరళ స్ట్రైకర్స్‌ను బెంగాల్ టైగర్స్ కట్టడి చేస్తోంది. ఈ క్రమంలో 11వ ఓవర్‌లో కేరళకు మరో షాక్ తగిలింది. ధాటిగా ఆడుతున్న అర్జున్ కుమార్‌ 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రత్నదీప్ బౌలింగ్‌లో జాయ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కేరళ 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.

  • Jan 23, 2026 4:31 PM

    ఉన్ని ముకుందన్ ఔట్

    178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ స్ట్రైకర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 28 పరుగుల వద్ద కెప్టెన్ ఉన్ని ముకుందన్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

  • Jan 23, 2026 3:56 PM

    తడబడి నిలబడిన బెంగాల్ టైగర్స్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్) 2026లో భాగంగా కేరళ స్ట్రైకర్స్‌తో కోయంబత్తూరులో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. జాయ్ 42 పరుగులు, ఇంద్రశిష్ 5 పరుగులు, జామ్మీ 51 పరుగులు, రాహుల్ 7 పరుగులు, జిషుసేన్ గుప్తా 46 పరుగులు, యూసఫ్ 15 పరుగులు, రత్నదీప్ 1, ఉదయ్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. బెంగాల్ బౌలర్లలో వివేక్ 3 వికెట్లు, బినేష్ 3 వికెట్లు, మణికుట్టన్ ఒక వికెట్ పడగొట్టారు.

  • Jan 23, 2026 3:14 PM

    బెంగాల్ టైగర్స్ 109/3

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా కేరళ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ సెంచరీ దాటింది. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి బెంగాల్ 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. జాయ్ 9, జిషుసేన్ గుప్తా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 23, 2026 2:39 PM

    50 పరుగులు పూర్తి చేసిన బెంగాల్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా కేరళ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ 50 పరుగుల మార్క్ చేరింది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి 56 పరుగులు చేసింది. జాయ్ 8 పరుగులు, జామ్మీ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 23, 2026 2:16 PM

    తొలి వికెట్ కోల్పోయిన బెంగాల్

    బెంగాల్ టైగర్స్ తొలి వికెట్ కోల్పోయింది. మణికుట్టన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఓపెనర్ ఇంద్రశిష్ (5) ప్రశాంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • Jan 23, 2026 2:04 PM

    బౌలింగ్ ఎంచుకున్న కేరళ

    సీసీఎల్ 2026లో భాగంగా కేరళ స్ట్రైకర్స్ - బెంగాల్ టైగర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ కెప్టెన్ ఉన్ని ముకుందన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

  • Jan 23, 2026 1:41 PM

    ఊపు మీదున్న బెంగాల్ టైగర్స్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో బెంగాల్ టైగర్స్ జట్టు మంచి ఊపు మీదుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. అటు ఉన్ని ముకుందన్ సారథ్యంలోని కేరళ స్ట్రైకర్స్ ఒక మ్యాచ్ ఆడి, ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. రెండు జట్లు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఓడిపోకపోవడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

  • Jan 23, 2026 1:37 PM

    Bengal Tigers vs Kerala Strikers

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా జనవరి 23వ తేదీన జరిగే మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌తో బెంగాల్ టైగర్స్ తలపడనుంది. కోయంబత్తూరులోని శ్రీ రామకృష్ణా కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్స్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.

  • Jan 19, 2026 12:15 AM

    ఉత్కంఠ పోరులో కేరళ జట్టు విజయం

    ముంబై హీరోస్ జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన కేరళ జట్టు. ఇంకా మూడు బంతులు ఉండగానే సిక్సర్ కొట్టిన మదన్ మోహన్ తన జట్టుకు విజయాన్ని అందించాడు.

  • Jan 18, 2026 11:27 PM

    గెలుపు బాటలో కేరళ జట్టు

    15 ఓవర్లు ముగిసే సమయానికి కేరళ జట్టు 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వివేక్ గోపన్ 23 పరుగులు, మదన్ మోహన్ 45 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేరళ టీమ్ విజయం సాధించాలంటే.. 29 బంతుల్లో 43 పరుగులు చేయాల్సి ఉంటుంది.

  • Jan 18, 2026 10:19 PM

    తొలి వికెట్ కోల్పోయిన కేరళ జట్టు

    192 పరుగులు టార్గెట్‌తో బ్యాటింగ్ చేపట్టిన కేరళ స్ట్రైకర్స్ జట్టు 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఉన్న ముకుందన్ 18 పరుగులు చేసి రితేష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ప్రస్తుతం అర్జున్ నంద కుమార 20 పరుగులు, జీన్ పాల్ లాల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 18, 2026 9:36 PM

    కేరళ టార్గెట్ 192

    కేరళ స్ట్రైకర్స్ టీమ్‌పై ముంబై హీరోస్ జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. తోమార్ నవదీప్ 58 పరుగులు, శరద్ ఖేల్కర్ 38 పరుగులు, సాకిబ్ సలీం 29, షబ్బీర్ 23 పరుగులు, సిద్దాంత్ సచ్‌దేవ్ 21 పరుగులు చేశారు. ఉన్ని ముకుందన్ 3 వికెట్లు, సమారత్ 3 వికెట్లు, జీన్ పాల్ లాల్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో కేరళ విజయం సాధించాలంటే.. 192 పరుగులు చేయాల్సి ఉంది.

  • Jan 18, 2026 9:20 PM

    భారీ స్కోర్ దిశగా ముంబై

    ముంబై బ్యాట్స్‌మెన్ తోమార్ నవదీప్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఆయన 58 పరుగులు చేసి అవుటయ్యాడు. శరద్ కేల్కర్ 38 పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ముగ్గురు సున్నా పరుగులకే అవుటయ్యారు. దాంతో 19 ఓవర్లలో ముంబై హీరోస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.

  • Jan 18, 2026 8:28 PM

    సెంచరీ దాటిన ముంబై హీరోస్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్ 2026)లో భాగంగా విశాఖపట్నం వేదికగా ముంబై హీరోస్- కేరళ స్ట్రైకర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ కెప్టెన్ ఉన్ని ముకుందన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 44 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ఉన్ని ముకుందన్ బౌలింగ్‌లో షబ్బీర్ అహ్లూవాలియా (23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రాజీవ్ పిళ్లై పరుగులు ఏమీ చేయకుండానే రన్ ఔట్ అయ్యాడు. ఈ దశలో షాకీబ్ సలీమ్‌తో కలిసి శరద్ ఖేల్కర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జీన్ విడదీశాడు. జట్టు స్కోర్ 65 పరుగుల వద్ద ఉండగా 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షాకీబ్ సలీమ్ ఔటయ్యాడు. 12 ఓవర్‌లు ముగిసేసరికి ముంబై హీరోస్ 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

  • Jan 18, 2026 8:23 PM

    Kerala Straikers Vs Mumbai Heroes

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా వైజాగ్‌లోని ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. దాంతో ముంబై హీరోస్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు షబ్బీర్ అలువాలియా 23 పరుగులు, సాకిబ్ సలీమ్ 29 పరుగులు చేసి అవుటాయ్యారు. ఉన్ని ముకుందన్ 1 వికెట్, జీన్ పాల్ లాల్ మరో వికెట్ పడగొట్టారు.

  • Jan 18, 2026 6:12 PM

    రాహుల్ హ్యాట్రిక్.. చెన్నె, బెంగాల్ మ్యాచ్ సూపర్ ఓవర్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో మరో సంచలనం నమోదైంది. రాహుల్ మజుందార్ హ్యాట్రిక్ సాధించడం సెన్సేషన్‌గా మారింది. వరుస బంతుల్లో దాశరథి, సత్య, పరి వికెట్లు పడగొట్టడంతో హ్యాట్రిక్ లభించింది. దాంతో ఈ మ్యాచ్ టైగా నిలిచింది. ప్రస్తుతం సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌ గేమ్ మరింత ఆసక్తిని రేపింది.

  • Jan 18, 2026 5:50 PM

    వరుసగా వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టు

    గెలుపు బాటలో ఉన్న చెన్నై కింగ్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శంతను 35 పరుగులు, దాశరథి 1 పరుగు, భరత్ నివాస్ 0 పరుగులకు అవుట్ అవ్వడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఇంకా 18 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

  • Jan 18, 2026 5:32 PM

    పృథ్వీ హాఫ్ సెంచరీ.. గెలుపు దిశగా చెన్నై

    చెన్నై బ్యాట్స్‌మెన్ పృథ్వీ పాండ్యరాజన్ రాణించి 50 పరుగులు చేయడంతో జట్టు పటిష్టమైన స్థితిలోకి వెళ్లింది. మరో ఆటగాడు శంతను 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లలో 149 పరుగులు చేసిన చెన్నై జట్టు 2 వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 36 పరుగులు చేయాల్సి ఉంది.

  • Jan 18, 2026 4:34 PM

    రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై

    186 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు శరణ్ కుమార్, విక్రాంత్ రూపంలో వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 18 పరుగులు చేసి ఆనంద క్యాచ్ పట్టగా జాయ్ కే బౌలింగ్‌లో శరణ్ అవుట్ అయ్యాడు. విక్రాంత్ 45 పరుగులు అవుటయ్యాడు. శంతను ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో చెన్నై 66 పరుగులు చేసింది.

  • Jan 18, 2026 3:53 PM

    చెన్నై టార్గెట్ 186

    సీసీఎల్‌ 2026 టోర్నీలో భాగంగా వెల్స్ చెన్నై కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. జాయ్ కుమార్ 65 పరుగులు, ఇంద్రశీష్ 26, జామీ బెనర్జీ 31 పరుగులు, రాహుల్ మజుందార్ 43 పరుగులు చేశారు. చెన్నై జట్లులో విక్రాంత్, పరి చెరో వికెట్ పడగొట్టారు.

  • Jan 18, 2026 3:29 PM

    నాలుగో వికెట్ కోల్పోయిన బెంగాల్

    బెంగాల్‌కు మరో షాక్ తగిలింది. రాహుల్‌తో సమన్వయ లోపంతో కెప్టెన్ జిషుసేన్ గుప్తా (1) రన్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం బెంగాల్ జట్టు 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. రాహుల్ 41, యూసఫ్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 18, 2026 3:15 PM

    150 మార్క్ దిశగా బెంగాల్

    చెన్నై కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టు 10 ఓవర్‌లో 100 పరుగుల మార్క్ దాటింది. చెన్నై ఫీల్డర్లు చెత్త ఫీల్డింగ్‌తో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటున్నారు. ఆ కాసేపటికే విక్రాంత్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన జాయ్ ముఖర్జీ (65) పృథ్వీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 14 ఓవర్లకు గాను బెంగాల్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రాహుల్ 9 పరుగులు, జామీ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 18, 2026 2:50 PM

    ఇంద్రాశిష్ రనౌట్

    బెంగాల్ టైగర్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. పారి వేసిన త్రోకు ఇంద్రశిష్ (29) రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం బెంగాల్ జట్టు 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది

  • Jan 18, 2026 2:31 PM

    క్యాచ్‌లు నేలపాలు

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా బెంగాల్ టైగర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై చెత్త ఫీల్డింగ్‌తో భారీగా పరుగులు సమర్పించుకుంటోంది. పలు క్యాచ్‌లు మిస్ చేయడంతో పాటు చేజేతులా సిక్సర్లు, ఫోర్లు సమర్పించుకుంటున్నారు.

  • Jan 18, 2026 2:06 PM

    టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్) 2026లో భాగంగా బెంగాల్ టైగర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్న కింగ్స్ కెప్టెన్ విక్రాంత్ సంతోష్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

  • Jan 18, 2026 1:38 PM

    బెంగాల్‌ టైగర్స్ vs చెన్నై కింగ్స్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026లో భాగంగా విశాఖలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై కింగ్స్‌తో బెంగాల్ టైగర్స్ తలపడుతోంది. ఇప్పటికే ముంబై హీరోస్‌పై గెలిచిన బెంగాల్ టైగర్స్ మంచి ఊపులో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని బెంగాల్ భావిస్తోంది. అటు తొలి మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని చెన్నై కూడా పట్టుదలతో ఉంది.

  • Jan 17, 2026 11:20 PM

    చిత్తుగా ఓడిన పంజాబ్ దే షేర్

    185 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ దే షేర్ జట్టు 18.2 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో తెలుగు వారియర్స్ జట్టు 52 పరుగులు తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొన్నది. తెలుగు వారియర్స్ జట్టులో అఖిల్ (101) సెంచరీ చేయగా, వినయ్ మహాదేవ్ 3 వికెట్లు పడగొట్టారు. పంజాబ్ జట్టులో కరణ్ వాహి అత్యధికంగా 56 పరుగులు చేశాడు. రౌనక్ 2 వికెట్లు పడగొట్టారు.

  • Jan 17, 2026 10:52 PM

    పరుగుల వేటలో పంజాబ్ తడబాటు

    పంజాబ్ ది షేర్ జట్టు పరుగుల వేటలో తడబాటుకు గురైంది. 185 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 15.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 116 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 69 పరుగులు 22 బంతుల్లో చేయాల్సి ఉంది.

  • Jan 17, 2026 10:06 PM

    4 వికెట్ కోల్పోయిన పంజాబ్

    భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్‌కు తెలుగు వారియర్స్ జట్టు బౌలర్లు షాకిచ్చారు. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 66 బంతుల్లో 126 పరుగులు చేయాల్సి ఉంది.

  • Jan 17, 2026 9:53 PM

    కష్టాల్లో పంజాబ్ దే షేర్

    185 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ దే షేర్ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు నింజా 10 పరుగులు చేసి సమ్రాట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ బాబల్ రాయ్ 1 పరుగు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ జైట్లీ 15 పరుగులు చేసి రఘు బౌలింగ్‌లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టు 7 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.

  • Jan 17, 2026 9:00 PM

    పంజాబ్ లక్ష్యం 185

    పంజాబ్‌ దే షేర్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని 101, అశ్విన్ బాబు 60, సామ్రాట్ 4, థమన్1, వినయ్ 6 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్‌లలో జెస్సీ ఒక వికెట్, రౌనక్ రెండు వికెట్లు పడగొట్టాడు.

  • Jan 17, 2026 8:35 PM

    ఒక్క పరుగుకే థమన్ ఔట్

    సామ్రాట్ రెడ్డి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన థమన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రౌనక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

  • Jan 17, 2026 8:16 PM

    అశ్విన్ బాబు ఔట్

    తెలుగు వారియర్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.. 60 పరుగులు చేసి మంచి ఊపు మీదున్న అశ్విన్ బాబు.. జెస్సీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

  • Jan 17, 2026 8:08 PM

    అశ్విన్ - అఖిల్ అర్ధసెంచరీలు

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా పంజాబ్ దే షేర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు ఓపెనర్ అశ్విన్ బాబు అర్ధ సెంచరీ చేశాడు. 46 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ వెంటనే కెప్టెన్ అఖిల్ అక్కినేని కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అఖిల్ అర్ధ సెంచరీ సాధించాడు

  • Jan 17, 2026 7:39 PM

    50 పరుగులు దాటిన తెలుగు వారియర్స్

    తెలుగు వారియర్స్ జట్టు నిలకడగా బ్యాటింగ్‌‌ చేస్తోంది. 7వ ఓవర్‌లో అఖిల్ సేన 50 పరుగుల మార్క్ క్రాస్ చేసింది. ప్రస్తుతం అశ్విన్ బాబు 37 పరుగులు, అఖిల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Jan 17, 2026 6:43 PM

    తెలుగు, పంజాబ్‌ జట్లకు కీలక మ్యాచ్

    తెలుగు వారియర్స్ జట్టు పేలవంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ చేతిలో అఖిల్ సేన దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. టోర్నీలో ముందుకు సాగాలంటే పంజాబ్‌పై తెలుగు వారియర్స్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. అటు పంజాబ్ దే షేర్‌కు కూడా తెలుగు వారియర్స్‌పై గెలవడం కీలకం. సీసీఎల్‌ 2026లో భాగంగా తన తొలి మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌ చేతిలో ఓడిపోయిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌పై గెలిచి రేసులో నిలబడాలని భావిస్తోంది.

  • Jan 17, 2026 6:39 PM

    బ్యాటింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్

    సెలబ్రిటి క్రికెట్ లీగ్‌ (సీసీఎల్ 2026)లో భాగంగా విశాఖపట్నంలో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌తో పంజాబ్ దే షేర్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని బ్యాటింగ్ ఎంచుకున్నారు.

  • Jan 17, 2026 6:12 PM

    ముంబాయితో ఉత్కంఠపోరు.. బెంగాల్ టైగర్స్ ఘన విజయం..

    ముంబాయి హీరోస్, బెంగాల్ టైగర్స్ మధ్య ఉత్కంఠ పోరు సాగింది. 200 పరుగుల లక్ష్యంలో బరిలో దిగిన బెంగాల్ టైగర్స్ ఘన విజయం సాగింది.

  • Jan 17, 2026 6:00 PM

    జ్యామి విధ్వంసకర ఇన్నింగ్స్‌కు బ్రేక్..

    బెంగాల్ టైగర్స్ బ్యాట్స్ మెన్ జ్యామి.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. కేవ‌లం 46 బంతుల్లోనే 97 పరుగులు చేశారు. సెంచరీకి 3 పరుగుల దూరంలో కెప్టెన్ రితేష్ బౌలింగ్ లో భారీ షాక్ ఆడబోయి షబ్బీర్ కు దొరికిపోయాడు. మైదానంలో ఉన్నంత సేపు ముంబాయి బౌలర్లపై విరుచుకపడ్డారు.

  • Jan 17, 2026 5:50 PM

    పుంజుకుంటున్న బెంగాల్ టైగర్స్

    ఊహించిన విధంగా బెంగాల్ టైగర్స్ దుమ్మురేపుతున్నారు. 13 ఓవర్లో రాహుల్ ముంబాయి బౌలర్లపై విరుచపడ్డారు ఈ ఓవర్లో 19 పరుగులు చేశారు. ఇక 15 ఓవర్ల పూర్తి అయ్యే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

  • Jan 17, 2026 5:37 PM

    ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూర్ టైగర్స్

    బెంగాల్ టైగర్స్ తీవ్ర కష్టాల్లో పడింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో బెంగాల్ టైగర్స్ బ్యాట్స్ మెన్స్ ఇబ్బంది పడుతున్నారు. 12 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. అయితే మరో ఎండ్‌లో జ్యామీ 54(32) నిలకడగా ఆడుతూ అర్థ శతకం చేశారు. గెలుపు పోరులో ఒంటరి పోరాటం చేస్తున్నారు.

  • Jan 17, 2026 5:31 PM

    నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూర్ టైగర్స్

    బెంగాల్ టైగర్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో బెంగాల్ టైగర్స్ 10 ఓవర్లకు 77/4 స్కోర్‌తో కష్టాల్లో పడింది. కీలక సమయంలో శివాంకిత్ బౌలింగ్‌లో కెప్టెన్ జిష్షు సెంగుప్తా వికెట్ కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో జ్యామీ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

  • Jan 17, 2026 5:00 PM

    మూడో వికెట్ కోల్పోయిన బెంగళూర్ టైగర్స్

    భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బెంగాల్ టైగర్స్ కు తొలి ఓవర్లలో ఎదురుదెబ్బ తగిలింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బ్యాట్స్‌మెన్ పెద్ద షాట్లకు వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో నిశాంత్ డి బౌలింగ్‌లో బెంగాల్ జట్టు మూడో వికెట్‌ను కోల్పోయింది. ఎక్స్‌ట్రా కవర్ వద్ద అభిలాష్ చౌదరి అద్భుతంగా క్యాచ్ పట్టడంతో సౌరవ్ దాస్ ఔటయ్యాడు. సౌరవ్ దాస్ 6 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇలా 6 ఓవర్లు ముగిసే సరికి బెంగాల్ 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది.

  • Jan 17, 2026 4:43 PM

    తొలి వికెట్ కోల్పోయిన బెంగళూర్ టైగర్స్

    బెంగాల్ టైగర్స్ కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బెంగాల్ టైగర్స్ కు తొలి ఓవర్లలో దెబ్బపడింది. ఓపెనర్లుగా వచ్చిన జాయి ముఖర్జీ, ఇంద్రశిష్ రాయ్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించారు. ముంబయి బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బ్యాట్స్‌మెన్ పెద్ద షాట్లకు వెళ్లలేకపోతున్నారు.ఈ క్రమంలో జాయ్ భారీ షాక్ కు ప్రయత్నించి పెవిలియన్‌కు బాట పడ్డారు. 3 ఓవర్లు ముగిసే సరికి బెంగాల్ 20 పరుగులు చేసింది.

  • Jan 17, 2026 4:06 PM

    దుమ్మురేపిన ముంబయి హీరోస్

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2026లో భాగంగా విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబాయి హీరోస్ బ్యాటర్స్ బెంగాల్ టైగర్స్ బౌలర్స్ విరుచుకపడ్డారు. నిర్ణీత 20 ఓవర్స్ లో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. బెంగాల్ టైగర్స్ కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింంది. చివర ఓవర్లలో నవదీప్ తన బ్యాట్ జూలిపించారు.

  • Jan 17, 2026 2:47 PM

    షబ్బీర్ అలువాలియా హాఫ్ సెంచరీ

    ముంబయి హీరోస్ తరఫున షబ్బీర్ అలువాలియా a అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పారు. బెంగాల్ టైగర్స్ బౌలర్లపై షబ్బీర్ విరుచుకుపడి హాఫ్ సెంచరీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఆత్మవిశ్వాసంగా ఆడిన షబ్బీర్, టైమింగ్‌తో కూడిన స్ట్రోక్స్‌తో ఫీల్డర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా స్పిన్నర్లపై సిక్సర్లు, ఫాస్ట్ బౌలర్లపై కవర్ డ్రైవ్స్‌తో స్కోర్‌బోర్డును పరుగెత్తించారు. కేవలం 23 బంతుల్లోనే 53 పరుగులు సాధించడం ద్వారా మ్యాచ్‌పై తన ముద్ర వేసారు.

  • Jan 17, 2026 2:35 PM

    ముంబయి హీరోస్ జట్టు ఆటగాళ్లు

    అభిలాష్ చౌదరి, రాజా, రితేశ్ దేశ్‌ముఖ్ (కెప్టెన్), సాకిబ్ సలీం, షబ్బీర్ అలువాలియా, సిద్ధాంత్ సచ్‌దేవ్, తోమర్ నవ్‌దీప్. ముంబయి హీరోస్‌కు రితేశ్ దేశ్‌ముఖ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ జట్టులో దూకుడైన బ్యాట్స్‌మెన్‌లు, ఆల్‌రౌండర్‌లు ఉన్నారు.

  • Jan 17, 2026 2:34 PM

    బెంగాల్ టైగర్స్ జట్టు ఆటగాళ్లు

    అన్షుమన్ ప్రత్యుష్, బోన్నీ, ఇంద్రశిష్ రాయ్, జ్యామీ బెనర్జీ, జిష్షు సేన్‌గుప్తా (కెప్టెన్), జాయ్ కుమార్ ముఖర్జీ, రాహుల్ మజుందర్, రత్నదీప్ ఘోష్, సౌరవ్ దాస్, యూసుఫ్ చిష్టీ. ఈ జట్టుకు అనుభవజ్ఞుడైన జిష్షు సేన్‌గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. బెంగాల్ టైగర్స్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ కూడా స్ట్రాంగ్ గా ఉంది.

  • Jan 17, 2026 2:03 PM

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా జనవరి 17వ తేదీన ముంబై హీరోస్‌తో బెంగాల్ టైగర్స్ తలపడనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రితేశ్ దేశ్‌ముఖ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు

  • Jan 17, 2026 8:14 AM

    Telugu Warriors Vs Punjab De Sher

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం (జనవరి 17) రోజున జరిగే రెండో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టును పంజాబ్ దే షేర్ జట్టు ఢీ కొట్టేందుకు రెడీ అయింది. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

  • Jan 17, 2026 8:12 AM

    Mumbai Heroes Vs Bengal Tigers

    సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం (జనవరి 17) రోజున ముంబై హీరోస్ జట్టుతో బెంగాల్ టైగర్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ తెలుగును ఫాలో అవ్వండి.

  • Jan 17, 2026 12:49 AM

    తెలుగు వారియర్స్ ఓటమి

    159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన తెలుగు వారియర్స్ జట్టు 18.1 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో భోజ్‌పురి దబాంగ్స్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తెలుగు వారియర్స్ జట్టులో అత్యధికంగా వినయ్ మహాదేవ్ 27 పరుగులు, సుధీర్ బాబు 26 పరుగులు, అశ్వీన్ బాబు 15, అఖిల్ అక్కినేని 12 పరుగులు, సమ్రాట్ రెడ్డి 10 పరుగులు చేశారు. భోజ్‌పురి జట్టులో కెప్టెన్ మనోజ్ తివారీ 3 వికెట్లు, రాజీవ్ రిషి 2 వికెట్లు, విక్రాంత్, అస్గర్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.

  • Jan 16, 2026 9:19 PM

    సచిన్ జోషి అవుట్

    భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన తెలుగు వారియర్స్ జట్టు రెండో బంతికే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సచిన్ జోషి పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యాడు.

  • Jan 16, 2026 9:13 PM

    తెలుగు వారియర్స్ టార్గెట్ 159 పరుగులు

    భోజ్‌పురి దబాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దాంతో తెలుగు వారియర్స్ ముందు 159 పరుగుల విజయలక్ష్యాన్ని భోజ్‌పురి ఉంచింది.

  • Jan 16, 2026 8:44 PM

    తెలుగు వారియర్స్ జట్టులో

    తెలుగు వారియర్స్ జట్టులో సచిన్ జోషి రెండు వికెట్లు, రఘు, వినయ్ మహదేవ్ చెరో వికెట్ పడగొట్టారు.

  • Jan 16, 2026 8:44 PM

    టాప్ ఆర్టర్ బాధ్యతాయుతంగా

    ఆరంభంలోనే కెప్టెన్ మనోజ్ తివారీ అవుట్ కావడంతో టాప్ ఆర్డర్ బాధ్యతాయుతంగా ఆడారు. రామ్ పర్వేశ్ 34 పరుగులు, ఆదిత్య అజయ్ 23 పరుగులు, అస్గర్ ఖాన్ 50 పరుగులు చేశారు.

  • Jan 16, 2026 6:59 PM

    తొలి వికెట్ కోల్పోయిన భోజ్‌పురి

    తొలి ఓవర్‌లోనే తెలుగు వారియర్స్‌కు శుభారంభం లభించింది. రఘు బౌలింగ్‌లో భోజ్‌పుర్ కెప్టెన్ 4 పరుగులు చేసి అఖిల్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. దాంతో భోజ్‌పురి జట్టు 4 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది.

  • Jan 16, 2026 6:54 PM

    అఖిల్ అక్కినేని టాస్ గెలిచి

    Telugu Warriors VS Bhojpuri Dabanggs Match Live: సీసీఎల్ 2026 టోర్నిలో భాగంగా వైజాగ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ అఖిల్ అక్కినేని టాస్ గెలిచి భోజ్‌పురి దబాంగ్స్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించారు.

  • Jan 16, 2026 6:30 PM

    కర్ణాటక జట్టు 31 పరుగుల తేడాతో

    ఈ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ గతేడాది విన్నర్ పంజాబ్ దే షేర్, రన్నరప్ కర్ణాటక బుల్డోజర్స్ మధ్య హోరాహోరీగా జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆదిపత్యం చూపించినప్పటికీ.. కర్ణాటక జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • Jan 16, 2026 6:29 PM

    171 పరుగుల విజయలక్ష్యంతో

    ఆ తర్వాత 171 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు 18.3 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్ జైట్లీ 68 పరుగులు, సర్వంత్ 28 పరుగులు చేశారు.

  • Jan 16, 2026 6:27 PM

    పంజాబ్ దే షేర్ జట్టు టాస్ గెలిచి

    పంజాబ్ దే షేర్ జట్టు టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకోవడంతో కర్ణాటక బుల్డోజర్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. అయితే పంజాబ్ బౌలర్ దక్ష్ విజృంభించడంతో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కరణ్ ఆర్యన్ రాణించి 33 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్ల సహాయంతో 83 పరుగులు చేయడంతో కర్ణాటక జట్టు 10 వికెట్లు కోల్పోయి 170 పరుగులకు ఆలౌట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X