Niharika: మెగా డాటర్ నిహారికపై భర్త కంప్లైంట్.. ఆ ఫొటో సాక్ష్యంగా పెట్టి సీక్రెట్ రివీల్ చేసేశాడు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఎక్కువ శాతం హీరోలే ఉండగా.. అమ్మాయిలు వచ్చింది మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్‌గా పరిచయమైంది నిహారిక కొణిదెల. అద్భుతమైన టాలెంట్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుందామె.
తద్వారా చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. ఫలితంగా బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుని సత్తా చాటింది. ఇలా కెరీర్ పరంగా ఎదుగుతోన్న సమయంలోనే మెగా డాటర్ వివాహం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెపై భర్త చైతన్య కంప్లైంట్ చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అలా ఎంట్రీ... అప్పుడే నిర్మాతగానూ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన 'ఢీ' అనే డ్యాన్స్ షోకు యాంకర్‌గా పని చేసింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించిన ఆమె.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించి పేరు తెచ్చుకుంది.

హీరోయిన్‌గా పరిచయం... నిరాశగానే
కెరీర్ ఆరంభంలో యాంకర్‌గా, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో సత్తా చాటిన నిహారిక.. హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన 'ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయమైంది. తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాల్లోనూ లీడ్ రోల్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని ఇవ్వలేదు.

అంగరంగ వైభవంగా చైతన్యతో పెళ్లి
కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న సమయంలో గత ఏడాది నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. తన కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించిన నాగబాబు.. అందుకు అనుగుణంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో వీళ్ల పెళ్లి జరిపించారు. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది.

వివాహం తర్వాత కూడా కొనసాగిస్తూ
వివాహానికి ముందు కొన్ని సినిమాల్లో నటించడంతో పాటు పలు వెబ్ సిరీస్‌లను నిర్మించింది నిహారిక. ఈ క్రమంలోనే వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను ఆపకూడదని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే తన సొంత బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు చేయాలని ప్లాన్ చేసింది. అలాగే, నటిగానూ బిజీగా మారబోతుంది. ఇలా పెళ్లైనా కెరీర్ సాగిస్తూ ఆమె ఆదర్శంగా ఉంటోంది.

ఫ్యామిలీ కథ హిట్.. నిహారిక ఖుషీగా
నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఇటీవలే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా నటించిన దీనిని మహేశ్ ఉప్పాల తెరకెక్కించారు. జీ5లో ఇది స్ట్రీమింగ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవడంతో నిహారిక ఫుల్ ఖుషీగా ఉందనే చెప్పాలి.

భర్తతో ఫారెన్ టూర్.. ఫుల్ ఎంజాయ్
చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత నిహారిక కొణిదెల తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. తరచూ టూర్లు వెళ్తూ పార్టీలు చేసుకుంటూ యమ ఎంజాయ్ చేస్తోంది. ఇక, ఇప్పుడు 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' మంచి స్పందనను అందుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉన్న నిహారిక కొణిదెల.. ఆ వెంటనే తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి ఫారెన్ టూర్‌కు వెళ్లింది.

నిహారికపై చైతన్య కంప్లైంట్ చేస్తూ
నిహారిక మాదిరిగానే చైతన్య కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడు ఫారెన్ టూర్ ఫొటోలు షేర్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే నిహారిక ఫోన్ చూస్తూ కూర్చున్న ఓ పిక్‌ను పోస్ట్ చేశాడు. అంతేకాదు, 'నిహారిక ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటుంది' అంటూ కంప్లైంట్ చేశాడు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











