Chalapathi Rao Assets: చలపతిరావుకు అన్ని కోట్ల ఆస్తులు.. మొత్తం విలువ తెలిస్తే షాక్ అవుతారు!

సాదాసీదాగా నటుడిగా పరిచయం అయినా.. తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు సీనియర్ యాక్టర్ చలపతిరావు. సినిమాల్లోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపు దక్కించుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్టుగా ఎదిగిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చారు. ఇలా దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు ఎన్నో చిత్రాలను చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా చలపతిరావు మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!

చలపతిరావు కన్నుమూత

చలపతిరావు కన్నుమూత


దాదాపు ఐదున్నర దశాబ్దాలకు పైగానే తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటుడు చలపతిరావు.. గుండెపోటు కారణంగా ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. నటుడు చలపతిరావు మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ మొత్తం నివాళి

ఇండస్ట్రీ మొత్తం నివాళి

దిగ్గజ నటుడిగా పేరొందిన చలపతిరావు మరణంతో సినీ పరిశ్రమలో పెను విషాదం నెలకొంది. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్లు, ఇతర నటీనటులు చలపతిరావు పార్థీవ దేహానికి నివాళులు కూడా అర్పించారు.

అలా ఎంట్రీ.. కొడుకును

అలా ఎంట్రీ.. కొడుకును


కృష్ణ నటించిన 'గూడచారి 116' సినిమా ద్వారా వెండితెరపైకి చలపతిరావు ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన సుమారు 1200 లకు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. ఇక, ఆయన వారసుడిగా చలపతిరావు తన కుమారుడు రవి బాబును కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అతడు నటనతో పాటు దర్శకుడిగానూ ఎన్నో మంచి మంచి చిత్రాలను తెరకెక్కించాడు.

నిర్మాతగా నష్టాలతోనే

నిర్మాతగా నష్టాలతోనే

నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న చలపతిరావు నిర్మాతగానూ మారారు. ఈ క్రమంలోనే ఆయన 'కలియుగ క్రిష్ణుడు', 'కడపరెడ్డమ్మ', 'జగన్నాటకం', 'పెళ్లంటే నూరేళ్ల పంట', 'ప్రెసిడెంటిగారి అల్లుడు', 'అర్ధరాత్రి హత్యలు', 'రక్తం చిందిన రాత్రి' వంటి చిత్రాలు నిర్మించారు. ఆ సమయంలో కొంత డబ్బును కూడా పోగొట్టుకున్నారు.

ఆస్తులు మాత్రం లేవు

ఆస్తులు మాత్రం లేవు

50 సంవత్సరాలకు పైగా నట ప్రస్థానంలో 1200లకు పైగా సినిమాల్లో నటించిన చలపతిరావుకు పేరు ప్రఖ్యాతలు బాగానే వచ్చాయి. కానీ, ఆయన ఆస్తులను కూడబెట్టుకోవడంలో మాత్రం విఫలం అయ్యారు. కానీ, పిల్లలను మాత్రం ఉన్న స్థాయిలోనే ఉంచారు. ఈ క్రమంలోనే ఇద్దరు అమ్మాయిలు, రవిబాబుకు తన ఆస్తుల్లో కొంత భాగాలను కూడా పంచేసినట్లు టాక్ ఉంది.

ఆ రెండు మాత్రమేనట

ఆ రెండు మాత్రమేనట


సీనియర్ నటుడు చలపతిరావుకు ప్రస్తుతం పెద్దగా ఆస్తులు ఏమీ లేవని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఆయన పేరిట హైదరాబాద్ నగరంలో వేరు వేరు ప్రాంతాల్లో రెండు ఇళ్లు మాత్రమే ఉన్నాయని తెలిసింది. వీటి విలువ రూ. 20 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇవి తప్ప చలపతిరావు పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X