Chandra Mohan ఆయన పక్కన నటిస్తే స్టార్ కావాల్సిందే.. ఆ హీరోయిన్లకు లక్కీ స్టార్‌గా చంద్రమోహన్!
ప్రముఖ నటుడు చంద్ర మోహన్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మృతిపై సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ ఓ గొప్ప నటుడిని కోల్పోయిందంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్ర మోహన్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో ఆయన పక్కన నటించిన ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు అయిపోయారు. ఆయన ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. మరీ అంతలా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పక్కన నటించి స్టార్ హీరోయిన్లు అయిపోయిన వారి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటుచేసుుకుంది. ప్రముఖ విలక్షణ నటుడు చంద్ర మోహన్ కన్నుమూశారు. హీరోగా, కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి చంద్రమోహన్.. ఇండస్ట్రీలో ఓ గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్ర మోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో మే 23న 1942వ సంవత్సరంలో జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. సినిమాలపై మక్కువపై... మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం చిత్రంతో 1966వ సంవత్సరంలో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు.

తొలి సినిమా రంగుల రట్నంతోనే ఆయన నంది అవార్డును సాధించారు. ఇక ఆయన దాదాపు 175 సినిమాల్లో హీరోగా నటించగా... మొత్తంగా 900కు పైగా చిత్రాల్లో నటించారు. ఇక ఆయన నటిస్తే చాలు... స్టార్ అయిపోవచ్చని చాలా మంది అప్పట్లో అనుకునే వారు. అంతలా ఆయన పేరు తెచ్చుకున్నారు. నిజంగానే ఆయన పక్కన నటించిన చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. స్టార్ హీరోయిన్లు అయిపోయారు.
చంద్ర మోహన్ పక్కన నటించిన శ్రీదేవి, జయప్రద, జయసుధ, సుహాసిని, విజయ శాంతి వంటి హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ఆయన పక్కన నటించి.. ఈ రేంజ్ కు వచ్చారని అప్పట్లో చాలా మంది అనుకునేవారు. అందుకు తగ్గట్లుగానే ఆయనతో నటించిన సినిమాలు ఈ హీరోయిన్లకు భారీ హిట్టును ఇచ్చాయి.
కళాతపస్వి విశ్వానాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరిసిరి మువ్వలు చిత్రంలో జయప్రయ హీరోయిన్ గా చేయగా.. హీరోగా చంద్ర మోహన్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాతే జయప్రద స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరుసగా ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఆ తర్వాత శ్రీదేవి కూడా చంద్ర మోహన్ పక్కన పదహారేళ్ల వయసు చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమా తర్వాతే శ్రీదేవి ఫేట్ మారిపోయింది. ఈ సినిమాతోనే ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చింది
ఇక జయసుధ, చంద్ర మోహన్ కాంబినేషన్ లో ప్రాణం ఖరీదు అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె స్టార్ డమ్ తెచ్చుకుంది. వీరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచాయి. చంద్ర మోహన్ తో నటించిన తర్వాత జయసుధ స్టార్ డమ్ తెచ్చుకుంది. ఒక్క జయ ప్రద, జయ సుధ, శ్రీదేవి మాత్రమే కాదు.. ఆయనతో సుహాసిని, విజయ శాంతి, రాధిక, ప్రభ, మంజుల ఇలా హీరోయిన్లు నటించి.. స్టార్ హీరోయిన్లు అయిపోయారు.
చాలా మంది హీరోయిన్లు చంద్ర మోహన్ పక్కన నటిస్తే.. స్టార్ డమ్ తెచ్చుకోవచ్చని భావించే వారు. అందుకే ఆయన్నీ తెలుగు సినీ ఇండస్ట్రీలో లక్కీ హీరోగా పిలుచేవారు. ఆయన సరసన నటిస్తే చాలు హీరోయిన్ల స్టార్ డమ్ పెరుగుతుందని అప్పట్లో టాక్.


Click it and Unblock the Notifications











